మేడిగడ్డ ఒక మేడిపండు: ముఖ్యమంత్రి రేవంత్

Date:

కోటి ఎకరాలకు నీరు పచ్చి అబద్ధం
కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సమీక్ష
సందర్శనకు ఎందుకు రాలేదని బి.జె.పి. పై విసుర్లు
మేడిగడ్డ, ఫిబ్రవరి 13 :
కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన అనంతరం ఆయన మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.
లక్ష కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదనీ, రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమేనానీ తెలిపారు.
కేవలం కరెంటు బిల్లులే ప్రతీ ఏటా రూ.10, 500 కోట్లు ఖర్చవుతోంది.
ప్రతీ ఏటా బ్యాంకు రుణాలు, ఇతరత్రా చెల్లింపులకు రూ.25వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు రూ.2లక్షల కోట్లు ఖర్చవుతుంది.
ఇప్పటి వరకు అబద్ధపు ప్రచారాలతో కేసీఆర్ కాలం గడిపారు.


2020లోనే ఈ బ్యారేజీకి ముప్పు ఉందని అధికారులు ఎల్&టీ కి లేఖ రాశారు.
సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్లే బ్యారేజీకి ఈ పరిస్థితి తలెత్తింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారు.
మూడు బ్యారేజీల్లో ఎక్కడా నీళ్లు లేవు.
నీళ్లు నింపితే కానీ భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి.
ఎన్నికల ముందు ఇష్యూ అవుతుందనే ఈ బ్యారేజీల్లో నీళ్లు లేకుండా చేశారు.
రీడిజైన్ పేరుతో వేల కోట్ల దోపిడీపై చర్చ జరగకుండా ఉండాలనే కేసీఆర్ నల్లగొండలో సభ పెట్టుకున్నారు.


ప్రజల ముందు తన బండారం బయటపడుతుందనే నల్లగొండలో కేసీఆర్ సభలో మాపై ఎదురుదాడికి దిగారు.
చావు నోట్లో తలకాయ పెట్టానని కేసీఆర్ కోటి ఒకటవసారి అబద్ధం చెప్పారు.
కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అయితే శాసనసభలో చర్చకు ఎందుకు రాలేదు..
మీరు చేసిన నిర్వాకంపై సభలో ఆధారాలతో సహా బయటపెట్టాం.


మేడిగడ్డ సందర్శనకు రావాలని మా మంత్రి గారు లేఖ రాశారు.
మీకు తేదీపై అభ్యంతరం ఉంటే మీరు చెప్పిన తేదీనే వెళదామని చెప్పాం..
కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్.. నల్లగొండ సభకు ఎలా వెళ్లారు..
నల్లగొండ దూరమా? అసెంబ్లీ దూరమా?
నాలుగైదు పిల్లర్లు కూలాయని కేసీఆర్ చులకనగా మాట్లాడుతున్నారు..
మీ లక్ష కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలై పోయింది.
మేడిగడ్డ ఇష్యూను చులకన చేసి మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం.
KRMB పై తాను సలహాలు ఇచ్చేవాడినని కేసీఆర్ అంటున్నారు.
సభకు వచ్చి సలహాలు ఇవ్వొచ్చని మేం ముందునుంచీ చెబుతున్నాం..


తీర్మానంలో లోపాలు ఉంటే హరీష్ రావు ఎలా మద్దతు ఇచ్చారు..
అందుకే వారి మాటలకు విలువ లేదని కేసీఆర్ సభకు రావాలని మేం కోరాం..
నల్లగొండ సభలో దిక్కుమాలిన మాటలు మాట్లాడటం కాదు.. శాసనసభకు రండి..
కేసీఆర్ మమ్మల్ని వెంటాడుతాం.. అంటూ బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు.
కాళేశ్వరంపై చర్చకు రావడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు
మీ కార్యదర్శి మీ అనుమతి లేకుండానే లేఖ రాశారా?


నీ అబద్దాలు నమ్మడానికి తెలంగాణ సమాజం ఇంకా సిద్ధంగా ఉందనుకుంటున్నారా?
కేసీఆర్ ను ఈ వేదికగా ఆహ్వానిస్తున్నా…
రేపు ఉదయం సభకు రండి… బడ్జెట్ తో పాటు, సాగునీటి రంగంపై చర్చలో పాల్గొనండి..
అన్ని పాపాలకు కారణం కేసీఆరే..


స్వార్ధం కోసం కాకుండా ఒక్కసారైనా ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చండి.
మెడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు స్పష్టంగా కమిపిస్తున్నా.. చిన్న సంఘటనగా కేసీఆర్ చెబుతున్నారు.
చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాళేశ్వరంపై జరిగిన అవకతవకలపై మీ వైఖరేంటో శాసన సభలో చెప్పండి..
కుర్చీ పోయిందనే.. కుర్చీని వెతుక్కుంటూ నల్లగొండ పోయిండు..


పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతితో ఓట్లు పొందాలని కేసీఆర్ ఎత్తుగడ…
భయపడనని ప్రగల్భాలు పలకడం కాదు… వచ్చి సభలో మాట్లాడు..


కాళేశ్వరం అవినీతి చర్చకు రాకుండా ఉండెందుకే నల్లగొండలో కేసీఆర్ సభ పెట్టుకున్నారు.
కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉంది..
కేసీఆర్ కాళేశ్వరానికి కాదు..ఇక కాశీకి వెళ్లి సన్యాసం పుచుకోవాల్సిందే..
బీజేపీ, బీఆరెస్ ఇంకా ఎన్నాళ్లు చీకట్లో పొత్తు పెట్టుకుంటారు?


మేడిగడ్డ సందర్శనకు బీజేపీ వాళ్లు వస్తారనుకున్నాం.
కేసీఆర్ అవినీతిపై విచారణ చేపట్టాలన్న బీజేపీ.. ఇప్పుడు ఎందుకు రాలేదు..


బీజేపీ వైఖరేంటో ఇప్పటికైనా స్పష్టంచేయాలి..
కేసీఆర్ అవినీతికి సహకరిస్తారో… అవినీతిపై విచారణ చేసే మా ప్రభుత్వానికి సహకరిస్తారో చెప్పాలి..


కేసీఆర్ అవినీతిని బయటపెట్టడానికి ఈ పర్యటన కీలకం..
అలాంటి మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Modi’s Kurukshetra of 4 states

(Dr Pentapati Pullarao) The great Mahabharat war between Pandavs...

Kejriwal: Noble past and uncertain future

(Dr Pentapati Pullarao) Just today Kejriwal announced his future....

BJP ‘s mistakes messing up 2024 elections?

(Dr Pentapati Pullarao) There is hardly one month left for...

భలే పింగళి – పాతాళభైరవి

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ) పాతాళభైరవి… ఈ పేరే...