(ఎలిశెట్టి సురేష్ కుమార్, 9948546286)
వంగవీటి..ఎంత ధాటి..
ఆ ఇంటి పేరులోనే
ఉందేమో ఆవేశం..
నమ్మిన సిద్ధాంతం కోసం
రాజీపడని పోరాటం..
మము కావగ రావే వరదా
బెజవాడ ఇలా పిలిస్తే
ఒకనాడు రాధా..
పిదప ప్రతి గుండె గుడిలో రంగ..రంగా..
అన్నదమ్ముల కీర్తి..
అన్యాయాలకు వ్యతిరేకంగా నిలిచిన స్ఫూర్తి..
దాటింది ఎల్లలు..
సాహసాల కథలు కోకొల్లలు..
చావును సైతం
లెక్కచేయని ధైర్యం..
ప్రతి పొద్దు ఓ ఘనకార్యం..
వెన్ను చూపని శౌర్యం..
చూసి ఓర్వలేకపోయింది
శత్రువుల క్రౌర్యం..
ఒంటరిని చేసి
అన్నను మట్టుపెట్టి
శత్రుకూటమి మెలేసింది మీసం
ఆ చితి మంట సాక్షిగా ఉవ్వెత్తున ఎగసిపడింది
రంగన్న రోసం..
వస్తూనే అయ్యాడు
బెజవాడ బెబ్బులి..
అణచివేసి ముష్కరమూకల
దురహంకార ఘోరకలి..
ప్రతి అడుగు జనం పక్షమై..
ఇంతింతై..మహా వృక్షమై..
అన్యాయం గుండెల్లో నిద్ర..
పేదల పాలి పెన్నిధి..అదే ముద్ర
పడింది పెద్దల కన్ను..
పేలింది అక్రమాల గన్ను..
బాధితుల పనుపున దీక్ష..
పురి విప్పిన పెత్తందార్ల కక్ష..
కుట్రలు తెలుసు..
అయినా రాజీ పడనంది
సమరమే తెలిసిన మనసు..
మాటువేసి అర్ధరాత్రి కాటు
ప్రజా పోరాట వేదికే
స్మశానవాటిక..
నిరాహారంగా ఉన్నా
ఆగని సంహారం…
ఉవ్వెత్తున ఎగసిన నిరసనే
ఆ మహానేత కంఠంలో
నిలిచిన శాశ్వత మణిహారం..
విప్లవం మరణించదు..
వీరుడు మరణించడు..
వేయివేల రూపాల
వెలుగుతుంది విప్లవాగ్ని..!
జోహార్ రంగా..!!
(వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా)