వీర సైనిక స్థైర్యానికి సాక్ష్యం
(శ్రీధర్ వాడవల్లి – హైదరాబాదు)
కార్గిల్ విజయ్ దివస్ తేదీ: జులై 26
కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించి నేటికి ఇరవైఐదేళ్లు
కార్గిల్ యుద్ధ కాలం : 3 మే – 26 జూలై 1999 (2 నెలల, 3 వారాల 2 రోజులు)
ఆపరేషన్ పేరు : ఆపరేషన్ విజయ్
కీలక స్థానాలు : ద్రాస్, కార్గిల్, బటాలిక్, టైగర్ హిల్
ఫలితం: భారత విజయం. కార్గిల్‌న స్వాధీనం
భారతీయ ప్రాణనష్టం : 527 అమరులయ్యారు. 1,363 మంది గాయపడ్డారు.
కార్గిల్ పేరు చెపితే శత్రు దేశం పాకిస్తాన్ గుండె గుభిల్లుమంటుంది. ఆ వీర గాధ వింటే తలచుకుంటే దేశభక్తితో ఛాతీ ఉప్పొంగుతుంది. భారత పదాతి దళం, వాయు సేన సంయుక్తంగా యుద్ద డ్రిల్ నిర్వహించాయి. పర్వత ప్రాంతం అనుకూలించని వాతావరణంలో భీకర రణం సాగించారు. దాయాది కుతంత్రం పారలేదు. భారత యుద్ద తంత్రం ఫలించింది.
కర్తవ్య దీక్షతో పరాక్రమంతో ప్రాణ త్యాగంతో సాధించిన భారత సైన్యం సాధించిన విజయం ఇది. జోహరు ఓ సైనిక నీ ఘనకీర్తి కి ప్రతీక మన త్రివర్ణపతాక.
కార్గిల్ విజయానికి పాతికేళ్ళు
Date: