(అమర్నాథ్ వాసిరెడ్డి)
నేరం చేసేవారికి
1. తమపై శక్తియుక్తులపై అతివిశ్వాసం ఉంటుంది .
- అవతలి వారి {అంటే పోలీస్ లు … సమాజం} శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తారు.
సింపుల్ గా చెప్పాలి అంటే అతి తెలివి…
కొన్ని నెలల క్రితం హనీమూన్ మర్డర్ జరిగింది .
భర్తను చంపించిన భార్య.. చివరకు చిప్పకూడు పాలయ్యింది .
ఇప్పుడు రాజస్థాన్లో హనీ మూన్ మర్డర్ 2.0
పెళ్లి కాకముందే … ప్రేమ … ప్రియుడు .
అక్కడిదాకా ఓకే .
హాయిగా ప్రియుడితోనే లివ్ ఇన్ లేదా పెళ్ళో చేసుకోవచ్చుగా ?
వేరే వ్యక్తితో పెళ్లి.
పెళ్లయిన కొన్ని రోజులకే ప్రియుడి సాయంతో భర్త హత్య .
ఇప్పుడు టెక్నాలజీ బాగా అభివృద్ధి అయ్యింది.
ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్ లు గూగుల్ లొకేషన్ లాంటి వాటి ఆధారంగా సులభంగా నేరం చేసినవారిని పట్టుకోవచ్చు. వాట్సాప్ లో చాట్ డెలీట్ చేసినా దాన్ని రిట్రీవ్ చెయ్యొచ్చు .
ఏదో ఆవేశంలో నేరం జరిగిపోతే అదొక లెక్క.
పక్కాగా ప్లాన్ చేసి మర్డర్ చేసి … చివరకు దొరికి ఏళ్ళ తరబడి దోమ కాట్లు, చిప్ప కూడు బతుకు బతకడమెందుకు?
ఎందుకంటే తాము మహా స్మార్ట్ … ఎవడికీ దొరకము … క్రైమ్ చేసేసి హ్యాపీగా బతికేయొచ్చు అనే అతితెలివి ఆలోచన.
ఇప్పుడు బూతు పాట యువ జీరో వివాదానికి వద్దాం
ఇదేదో యాదృచ్చికంగా జరిగింది కాదు.
తండ్రి టీవీ రంగంలో అపార అనుభవం ఉన్నవాడే.
“మామూలుగా అయితే జనాలు పెద్దగా పట్టించుకోరు … ఎంత వివాదం అయితే అంత పబ్లిసిటీ” అని ప్లాన్ చేసి చేపట్టిన చర్య.
ఇప్పుడు హింస … బూతు సినిమాల యుగం నడుస్తోంది .
మార్కోస్, యానిమల్, కెజిఫ్ – 2 …
పెద్ద హీరోనే కుర్చీని మడతపెట్టాడు.
సోషల్ మీడియా మొత్తం బూతులు.
రాజకీయనాయకులు కూడా…
ఇలాంటి స్థితిలో ఇంకో మెట్టు ఎక్కి సంచలనం సృష్టించాలి అనే ఆలోచన.
బహుశా తండ్రిదే కావొచ్చు.
లేదా కొడుక్కి కూడా ఇలాంటి ఐడియా పుట్టి ఉండొచ్చు.
పెద్ద తరం వారైతే బాధపడుతున్నారు కానీ … మొబైల్ ఫోన్లో మునిగి తేలుతున్న బుర్ర తక్కువ తరం జెన్ జెడ్ కు ఇది మామూలే.
జెన్ జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టినవారు.
అంటే 14 – 29 వయసున్న వారు.
యూత్ అమ్మా యూత్ …
వీరిలో 100 కి 95 మంది మొబైల్ ఫోన్ బానిసలు.
ఇదేదో అభిప్రాయం కాదు.
సైంటిఫిక్ గా ఋజువయ్యింది.
వారి మెదడులో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఆంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ న్యూక్లియస్ అకంబెన్స్ లాంటి మెదడు భాగాల్లో మొబైల్ అతి వినియోగం మార్పు తెచ్చింది.
సినిమాటిక్ గా చెప్పాలి అంటే చిన్న మెదడు చితికింది.
ఇంగిత జ్ఞానం చచ్చింది.
భావోద్వేగాలు అదుపు చేసుకోలేరు.
అతికి మించిన సూపర్ అతి కావాలి. నిముషం నిముషం సంచలనం కావాలి.
సినిమాలు చూసేది ఎక్కువగా ఈ తరమే.

వీరిదో లోకం.
వీరిని చూసి బాధ పడి… మార్పు కోసం ప్రయత్నించే వారు కొందరు.
సంఘ సేవ మనకెందుకు?
అవకాశాన్ని సొమ్ము చేసుకొందాము అనుకొనే వారు ఎందరో !
అందుకే బూతు వీడియోలు … సంచలన వీడియో లు.. హింసాత్మక సినిమాలు.. బూతు కామెంట్స్ { మీరు గమనించండి .. పచ్చి బూతులు కొంత మంది కామెంట్స్ కాలమ్ లో పోస్ట్ చేస్తారు . దాన్ని ఆ యూట్యూబ్ ఛానల్ వాడు .. వీడియో / పోస్ట్ పెట్టిన వాడు డిలీట్ చెయ్యడు . ఎందుకంటే ఎంత వివాదం అయితే అంత పబ్లిసిటీ }
మన అదృష్టం ఏమిటంటే ఇంకా మంచి బతికే ఉంది .
2017లో ఒక సినిమా వచ్చింది.
దాన్ని చూసి చాలామంది వాంతి చేసుకొన్నారు.
సినిమా హిట్ అయ్యింది.
కరోనా ముందే అంత వికారాన్ని నెత్తిన వేసుకొన్న సమాజం మనది. మరి కరోనా తరువాత?
ఆ సినిమా హీరో మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి. మంచి పర్సనాలిటీ కూడా. ఆ సినిమా హిట్ అయినా దానితో సొంతం చేసుకున్న ఆ నెగటివ్ ఇమేజ్ వదిలించుకోలేక పోయాడు.
అటు తరువాత హిట్ సినిమాలు లేకపోవడానికి ఇదొక కారణం.
అన్ని వర్గాలను సొంతం చేసుకొన్నవాడే హీరోగా ఎదుగుతాడు. అన్ని వర్గాలను ఆకట్టుకున్న సినిమా నే హిట్ అవుతుంది. అప్పుడప్పుడూ మినహాయింపులు ఉంటాయి.
ఇప్పుడు రోత హీరో గా సంచలనం సృష్టించాలి అనుకొన్న జెన్ జెడ్ జీరో గాడికి అంత ఇంగిత జ్ఞానం ఉండకపోచ్చు.
సగం గడ్డం నెరిసిన తండ్రికైనా ఉండొద్దా?

(వ్యాస రచయిత ప్రముఖ విద్యావేత్త)

