Saturday, March 25, 2023
Homeటాప్ స్టోరీస్నెల‌ల బాలునికి పెన్ను బ‌హుమ‌తి

నెల‌ల బాలునికి పెన్ను బ‌హుమ‌తి

బాలుణ్ణి ముద్దాడిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌
పి. గ‌న్న‌వ‌రం, జూలై 26:
ఓ చిన్నారికి ఓ పెద్ద మ‌నిషి జేబులోని ఓ వ‌స్తువు బాగా న‌చ్చేసింది. అంతే చ‌టుక్కున దానిని తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. అంతే ఆ ప‌రిణామంతో ముచ్చ‌ట‌ప‌డిన ఆ పెద్ద మ‌నిషి వెంట‌నే ఆ బాలుణ్ణి త‌న చేతిలోకి తీసుకున్నారు.

కాసేపు ఆడించి, ఆ పెన్నును ఆ బాలునికి బ‌హుమ‌తి ఇచ్చేశారు. ఈ సంఘ‌ట‌న అక్క‌డి వారిని ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేసింది. ఇంత‌కీ ఆ పెద్ద మ‌నిషి ఎవ‌రో కాదు.. ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. కోన‌సీమ జిల్లాలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలో ఈ ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది.

పెద‌పూడిలంక గ్రామంలో ఓ ఎనిమిది నెల‌ల బాలుణ్ణి జ‌గ‌న్ ఎత్తుకున్నారు. ఆ స‌మ‌యంలో ఆ బాలుడు జేబులోని పెన్ను తీసుకుని నోట్లోపెట్టుకున్నాడు. ఆ బాలునికే పెన్నును బ‌హుమ‌తిగా ఇచ్చి, బుగ్గ‌ల‌పై ముద్దాడారు ముఖ్య‌మంత్రి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ