Thursday, March 23, 2023
Homeక్రీడలుక్రొయేషియా చ‌రిత్ర సృష్టిస్తుందా!

క్రొయేషియా చ‌రిత్ర సృష్టిస్తుందా!

బ్రెజిల్‌ను మ‌ట్టిక‌రిపించి సెమీస్ చేరిన జ‌ట్టు
(శివ రాచ‌ర్ల‌)

Congratulations Croatia
ఇది గత వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా రాసిన పోస్ట్ ఇది..ఆ ఫైనల్ లో క్రోయేషియా ఓడిపోయింది.
ఈ రోజు జరిగిన quarter final లో క్రోయేషియా బ్రెజిల్ ను ఓడించి సెమీస్ కు చేరింది,wish them a greatest success .
అర్జెంటీనా తరువాత నా ఫేవరేట్ టీమ్ క్రోయేషియా..
–/////————-/////—–////—–
క్రొయేషియా- యుగోస్లోవియా-సాకర్ వరల్డ్ కప్ ఫైనల్
1991లో క్రొయేషియా ఏర్పడిన తరువాత తొలిసారి ఆ జట్టు సాకర్ వరల్డ్ కప్ ఫైనల్లో ప్రవేశించింది . ఇది వారి అత్యుత్తమ ప్రదర్శన గతంలో 1998లో సెమీ ఫైనల్ చేరారు.
మార్షల్ టీటో పేరు తెలుసా?
మదర్ థెరిస్సా పుట్టిన దేశం ఏది?
నెహ్రు ప్రవేశపెట్టిన “అలీన” విధానంలో మనకు ప్రధాన మిత్రపక్ష దేశాల పేర్లు గుర్తున్నాయా?
మోనికా సెలెస్ మొదట ఏదేశం తరుపున టెన్నిస్ ఆడారో తెలుసా?
వింబుల్డన్ గెలిచినందుకే ఆ ఆటగాన్ని దేశ అధ్యక్షుడిని చెయ్యాలని ప్రజలు కోరిన దేశం తెలుసా?

యుగోస్లోవియా అనే దేశం గురించి ఎంతమందికి గుర్తుంది?
రెండవ ప్రపంచ యుద్దంలో (హిట్లర్)నాజీల నుంచి యుగోస్లోవియా విముక్తి పోరాటానికి నాయకత్వం వహించిన జనరల్ “టీటొ”ది గొప్ప చరిత్ర. రెండో ప్రపంచ యుద్దం సమయంలో సహచర కమ్యునిస్ట్ నేత అయిన రష్యా స్టాలిన్ తో స్నేహం నెరిపిన టీటో యుగోస్లోవియా పునరేకికరణ, జర్మన్ ఆక్రమిత ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం , ఇటలీ, గ్రీక్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల స్వాధీనం తదితర అంశాలలో వచ్చిన బేదాభిప్రాయాల వలన స్టాలిన్ తో విబేధాలు వొచ్చాయి. యుద్దం ముగిసిన తరువాత కూడ టీటో మీద అనేక హత్యా ప్రయత్నాలు జరిగాయి.
ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత నెహ్రు ప్రతిపాదించిన అలీన విధానాన్ని టీటో సమర్ధించి ఈజిప్ట్ నేత నాసర్ తో పాటు అనేక దేశాలను అలీన విధానంలోకి తీసుకొచ్చారు. అనేక జాతుల సమూహం అయిన యుగోస్లోవియా అధ్యక్షుడిగా నాలుగు దశాబ్ధాలపాటు సమైక్యంగా ఉంచిన టీటో 1980లో చనిపోయారు. అప్పటి నుంచి యుగోస్లోవియా దేశాలలో జాతుల వైరం, ఆర్ధిక సంక్షోభం పెరిగాయి.
సోవియట్ యూనియన్ పతనానికి సరిగ్గా 6 నెలల ముందు అంటే జూన్ 1991లో “యుగోస్లోవియా” విచ్చిన్నమై ప్రస్తుత క్రొయేషియా, స్లోవేనియా స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. 1992 ఏప్రిల్లో బోస్నియా & హెర్జెగొవీనా మరియు మెసడోనియా యుగోస్లోవియా నుంచి విడిపోవటంతో సెర్బియా మరియు మొంటెనెగ్రో మాత్రమే యుగోస్లోవియాలో మిగిలాయి.2003లో యుగోస్లోవియా పేరును సెర్బియా మొంటెనెగ్రో సంయుక్త రాజ్యంగా మార్చుకున్నారు.2006లో సెర్బియా నుంచి మొంటెనెగ్రో స్వతంత్రం ప్రకటించుకుంది. కొసావో పాక్షిక స్వాతంత్ర్య దేశంగా కొనసాగుతుంది. యూరప్లో బోస్నియా, కొసావో,ఐర్లాండ్ దేశాల స్వాంతంత్ర సాయుధ పొరాటాల మీద అనేక సినిమాలు వొచ్చాయి.


రెండవ ప్రపంచ యుద్దంలో నాజీలకు చిక్కి ఉరికంబం మీద నుంచి “Death to fascism, freedom to the people” అని నినదించిన 26 సంవత్సరాల యుగోస్లోవియా కమాండర్ “Stjepan Filipović” ధిక్కారానికి ప్రతిరూపం.
మదర్ థెరిసా యుగోస్లోవియాలో పుట్టారు.
టెన్నిస్ లో 80వ దశకం ద్వితీయార్ధంలో జర్మనీకి చెందిన స్టెఫి గ్రాఫ్ ఒక సంచలనం, అప్పటి వరకు ఒక వెలుగు వెలిగిన మార్టీనా నవ్రతిలోవా శకం స్టెఫి గ్రాఫ్ రాకతో ముగిసింది.
1991లో యుగోస్లోవియాకు చెందిన “మోనికా సెలెస్” ఆస్ట్రేలియా, ఫెంచ్, అమెరికా ఓపెన్స్ గెలవటంతో స్టెఫికి గట్టి పొటీ ఎదురైంది. 1991-1996 మధ్య గ్రాండ్ శ్లాం పోటీలలో స్టెఫి, మోనికా ప్రధాన ప్రత్యర్ధులయ్యారు. 1993లో హాంబర్గ్ (జర్మనీ)లో జరిగిన ఒక మాచ్లో స్టెఫి దురభిమాని మోనికా సెలెస్ మీద కత్తితో దాడి చేశాడు. గాయాలతో దాదాపు 2 సంవత్సరాలు టెన్నిసుకు దూరం అయిన మోనికా అమెరికా పౌరసత్వం తీసుకోని 1996లో ఆస్ట్రేలియా ఓపెన్ గెలవటం మినహా పెద్ద విజయాలు సాధించలేదు.
నాది టెన్నిస్ రాకెట్ కూడా చూడని గ్రామీణ బాల్యం కాని టెన్నిస్ అంటే వివరీతమైన ఇష్టం ఉండేది. బాల్ బ్యాడ్మింట‌న్ బ్యాటుతో టెన్నిస్ అని ఫీల్అయ్యి ఆడటం చిన్న సరదా.
స్టెఫిగ్రాఫ్, అగస్సి, సంప్రస్ లను అభిమానించేవాడిని. ఆట మధ్యలో డీహైడ్రేషనుతో వాంతులు చేసుకోని కూడ 5 సెట్ల మాచ్ గెలిచిన సంప్రాస్ ఆత్మవిశ్వాసం ఎన్నో పాఠాలు నేర్పింది.


క్రొయేషియాకు చెందిన గోరాన్ ఇవాని సెవిచ్ పవర్ గేముకు చిరునామాలాంటివాడు.టెన్నిస్ కెరీర్ మొత్తంలో గెలిచింది ఒకే ఒక గ్రాండ్ శ్లాం. కాని టెన్నిస్ అభిమానులుకు గుర్తుండిపోయే ఆటగాడు. గ్రాండ్ శ్లాములలో 3 ఫైనల్స్, 3 సెమి ఫైనల్, 7 క్వార్టర్స్ చేరిన ఇవాని సెవిచ్ ఆటలో కోపాన్ని అదుపులో పెట్టుకోలేక అనేకసార్లు ఓడిపోయాడు. ఒక మ్యాచ్లో అన్ని రాకెట్లు అన్ని విరగొట్టుకొని ఆడటానికి రాకెట్ లేక ఓటమిని అంగీకరించి తప్పుకున్నాడు.
ఇవాని సెవిచ్ 2001లో వింబుల్డన్ గెలిచారు. క్రొయేషియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత ఆదేశం పేరు ప్రపంచానికి పరిచయం చేసిన విజయం కావటంతో క్రొయేసియన్లు ఇవాని సెవిచ్ ను దేశ అధ్యక్షుడిని చెయ్యాలని డిమాండ్ చేశారు.
ఇంక సాకర్లోకి వస్తే, రేఫు ఆదివారం సెమీ ఫైనలో క్రొయేసియా, ఫ్రాన్స్ జట్లు తలబడుతున్నాయి. రెండు బలమైన జట్లు. ఫ్రాన్స్ గతంలో 1998లో కప్ గెలిచి 2006లో ఫైనల్లో ఓడిపోయింది. 2006 ఫైనల్ మాచ్లో ఇటలీ ఆటగాడు మోటర్జి ఫ్రెంచ్ స్టార్ ఫ్లేయర్ జిదానేను తిట్టటం, ప్రతిగా జిదానె మోటర్జిని తలతో కొట్టటంతో రెఫరి రెడ్ కార్డ్ ఇచ్చాడు. దీనితో ఫ్రాన్స్ గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. పెనాల్టి షూటులో ఇటలీ 5-3 గోల్సుతో గెలిచింది.పెనాల్టి షాట్స్ expert అయినా జిదానే ఉండిఉంటే ఫలితం ఫ్రాన్సుకు అనుకూలంగా ఉండి ఉండటానికి అవకాశం ఎక్కువ.
Final it is any ones game…గత చరిత్ర, ప్రస్తుత బలాబలాలు ఇవేమి పెద్దగా లెక్కలోకి రావు… క్రొయేషియా ఫైనలుకు రావటమే పెద్ద సంచలనం, గెలుపుతో క్రొయేషియన్లు చరిత్ర సృష్టిస్తారా?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ