సంక్షేమ‌మే ఆలంబ‌నగా బ‌డ్జెట్‌

Date:

నిరుద్యోగం, ద్ర‌వ్యోల్బ‌ణం
బ‌డ్జెట్ దృష్టి పెట్టే అంశాలివే
న్యూఢిల్లీ, ఫిబ్ర‌వ‌రి 1:
ఈ రోజు ఫిబ్ర‌వ‌రి 1, 2022 న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. నిరుద్యోగ స‌మ‌స్య‌, ద్ర‌వ్యోల్బ‌ణం, సోమ‌రిత‌నం అంశాల ఆధారంగా ఈ బ‌డ్జెట్ రూపొంద‌నుంద‌ని ప్ర‌క‌టించారు. కొద్ది రోజుల్లోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో ఈ బ‌డ్జెట్ ప్ర‌ధానంగా సంక్షేమ‌, రైతు, అల్ప ఆదాయ వ‌ర్గాలకు సంబంధించిన‌దిగా ఉంటుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కేవ‌లం వాటి మీద మాత్ర‌మే ఆధార‌ప‌డితే భార‌త‌దేశం ఆర్థికంగా పుంజుకోవ‌టం క‌ష్ట‌మే. వ్యాపారాలు తిరిగి కోలుకోవ‌టానికి ఇవి ఉప‌యోగ‌ప‌డ‌వు.
పీక‌ల్లోతు ఆర్థిక క‌ష్టాల్లో కూరుకుపోయిన భార‌తదేశాన్ని బ‌య‌ట‌కు తీసుకురావటానికి ప్ర‌స్తుత ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ స‌మ‌తుల్యం పాటించి తీరాలి.

Madan Sabnavis


ఈ విష‌య‌మై బ్యాంక్ ఆఫ్ బ‌రోడా చీఫ్ ఎకాన‌మిస్టు మ‌ద‌న్ స‌బ్న‌విస్‌…
ఈ బ‌డ్జెట్ భార‌తదేశంలోని ఆదాయ ఖ‌ర్చుల మ‌ధ్య ఉన్న దూరాన్ని త‌గ్గిస్తూ, గ్రోత్‌రేట్‌ను పెంచేలా రూపొందించాలి… అన్నారు.
ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ జ‌న‌వ‌రి 31, 2022 సోమ‌వారం నాడు పార్ల‌మెంటులో వార్షిక ఆర్థిక స‌ర్వే గురించి చెబుతూ, 2022 – 2023 ఆర్థిక సంవ‌త్స‌రంలో అభివృద్ధి 8 – 8.5 శాతం ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే ఇది అంత సులువు కాదంటున్నారు ఆర్థిక‌వేత్త‌లు.

Kaushik Basu


మ‌న ముందున్న స‌వాళ్లు…
భార‌త‌దేశంలో ఉన్న స్థూల ఆర్థిక వ్య‌వ‌స్థ ఇంకా కోలుకోనునే ద‌శ‌లోనే ఉంది… అంటున్నారు భార‌త మాజీ చీఫ్ ఎక‌న‌మిక్ అడ్వ‌యిజ‌ర్ కౌశిక్ బ‌సు. కొత్త ఉద్యోగాల క‌ల్పించి, చిన్న వ్యాపారుల‌కు సాయ‌ప‌డ‌డం పెద్ద ప‌ని అన్నారు.
దేశంలో య‌థాలాపంగా చేసే చిన్న‌చిన్న వ్యాపారాలపై జ‌నాభాలో అధిక‌శాతం మందికి ఉపాధి క‌ల్పిస్తున్నాయి. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆ వ్యాపారాన్నే క‌రోనా మ‌హ‌మ్మారి దారుణంగా దెబ్బ‌తీసింది. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు త‌గ్గుతున్న ద‌శ‌లో ఉన్న‌ప్పటికీ, ఇంకా నిబంధన‌లు కొన‌సాగుతుండ‌డంతో స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ను అడ్డుప‌డుతున్నాయి. దీనికి అధిక ధ‌ర‌లు తోడ‌య్యాయి. ఇది వినియోగ‌దారు అవ‌స‌రాన్ని దెబ్బ‌తీస్తున్నాయి.

Prof Jayathi Ghosh


మోడీ పాల‌న‌లో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ఎలా దెబ్బ‌తింది?
క‌నిపిస్తున్న దానికంటే దేశంలో ఉద్యోగాల సంక్షోభం చాలా తీవ్రంగా ఉంది. 2021లో దేశాన్ని కుదిపేసిన క‌రోనా రెండో వేవ్ మ‌ధ్య త‌ర‌గ‌తి జ‌వ‌జీవాల‌ను కుదేలు చేసింది. వారి బ్యాంకు బ్యాలెన్సుల‌ను క‌రిగించేసింది. ఆర్థిక అస‌మాన‌త‌ల‌ను పెంచేసింది. ఉద్యోగాలు పోవ‌డం, నిరుద్యోగాలు పెరుగుతుండ‌డం ప‌రిస్థితిని మ‌రింత దిగ‌జార్చింది. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఉన్న చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు ఉపాధి క‌ల్ప‌న‌లో ఇప్పుడు కీల‌కంగా మారాయ‌ని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దుర‌దృష్ట‌వశాత్తు ప్ర‌భుత్వం ఆ రంగంలో దృష్టి సారించ‌లేద‌ని యూనివ‌ర్శిటీ ఆఫ్ మాసాచూసెట్స్ ఎక‌న‌మిక్స్ ప్రొఫెస‌ర్ జ‌య‌తీ ఘోష్ చెబుతున్నారు. స‌ర‌ఫ‌రా ప్యాకేజితో మాత్ర‌మే చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ను పున‌రుద్ధ‌రించ‌లేమ‌ని, వాటికి డిమాండ్ లేక‌పోవ‌డ‌మే అస‌లు స‌మ‌స్య అనీ అంటున్నారామె. ప్ర‌జ‌లు తీవ్రంగా గాయ‌పడి ఉన్నారు. వారి చేతుల్లో డ‌బ్బు పెట్ట‌డ‌మే ఇప్పుడు ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌ని అంటూ స‌ల‌హా ఇచ్చారు జ‌య‌తీ ఘోష్‌.
ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలోని మొద‌టి ఎనిమిది నెల‌ల్లో భార‌త ఆదాయం 67శాతం పెరిగిందని ఎక‌న‌మిక్ స‌ర్వే పేర్కొంది. ప్ర‌భుత్వం ఎక్కువ ఖ‌ర్చు పెట్ట‌డానికి ఇది అవ‌కాశం ఇస్తుంద‌న‌డంలో సందేహం లేదు. కానీ, ఆర్థిక నిపుణుల అంచ‌నా ప్ర‌కారం సొమ్ములు అధిక శాతం ఉచిత ప‌థ‌కాల‌కు వెళ్ళిపోతాయి. కార‌ణంగా ముందు ఎన్నిక‌లు ఉండ‌డ‌మే.

Dr RaghuRam Rajan


ఈ బ‌డ్జెట్ ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుందా?
రైతుల ఆందోళ‌న‌ల‌తో ప్ర‌వేశ‌పెట్టిన ఏడాది త‌ర‌వాత వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, వివాదాస్ప‌ద సంస్క‌ర‌ణ‌ల‌ ఉపసంహ‌రించుకుంది న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం. 2014త‌ర‌వాత రైతు ఆందోళ‌న‌ల రూపంలో మోడీకి ఎదురైన అతి పెద్ద స‌వాలు ఇది. మోడీ ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌లు రైతుల‌లో ఆగ్ర‌హాన్నీ, ఆక్రోశాన్ని ర‌గిలించాయి. వాస్త‌వానికి మోడీ పెద్ద ఓటు బ్యాంకు రైతులే. ప్ర‌స్తుత బ‌డ్జెట్‌కు ప‌ది రోజుల త‌ర‌వాత రెండు అతి పెద్ద రాష్ట్రాలు ఉత్త‌ర ప్ర‌దేశ్‌, పంజాబ్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. పంజాబ్ రైతు నిర‌స‌న‌ల‌కు కేంద్రంగా నిల‌బ‌డింది. మ‌రొక అంశం ఏమిటంటే ఈ ఏడాది అంటే 2022నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాన‌ని మోడీ హామీ ఇచ్చారు. కానీ అది ఇప్ప‌టి వ‌ర‌కూ నెర‌వేర‌లేదు స‌రికదా… కుదించుకుపోయాయి. ఇటీవ‌లి సంవ‌త్స‌రాల‌లో మోడీ కార్పొరేట్ ర‌క్ష‌కుడిగా మారడంతో విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ త‌ర‌హా మార్పు కార‌ణంగా ఉత్ప‌త్తి రంగం దెబ్బ‌తింది. ఎగుమ‌తుల‌లో కొద్దిపాటి వృద్ధి మాత్ర‌మే న‌మెదైంది. వాస్త‌వానికి ఆర్థికవేత్త‌లు సైతం మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు రావాల‌ని పిలుపునిచ్చారు. పెరుగుతున్న నిరుద్యోగం, కొనుగోలు శ‌క్తి త‌గ్గిపోవ‌డం, చిన్న వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక లేమి పెరిగిపోయాయ‌ని ఆర్జీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ‌రాజ‌న్ చెప్పారు. ఇవ‌న్నీ భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మ‌చ్చ‌లుగా మారాయ‌నీ, ఐటీ రంగం ఉవ్వెత్తున అభివృద్ధి చెందుతుండ‌డం మాత్ర‌మే ఆశాకిర‌ణంగా ఉంద‌నీ అన్నారు. కొత్త‌గా బిలియ‌న్ డాల‌ర్ విలువైన స్టార్ట‌ప్ సంస్థ‌లు పుట్టుకురావ‌డం ఉత్సాహాన్ని క‌లిగిస్తోంద‌న్నారు. అభివృద్ధి రంగం కుదేలు కాకుండా బ‌డ్జెట్ ఏదో ఒక‌టి చేయాలి అని ర‌ఘురామ‌రాజ‌న్ అంటున్నారు. (బిబిసి సౌజ‌న్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...

Anti- defection laws need a review

(Dr Pentapati Pullarao) There is much news when MLAs or...

Onam the festival of Colors and Flowers

(Shankar Raj) Kerala in many ways is a strange state....

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...