Tuesday, March 28, 2023
HomeArchieveరాజ‌కీయాల‌కు బ‌లైన ఆచార్య‌?

రాజ‌కీయాల‌కు బ‌లైన ఆచార్య‌?

వ‌య‌సుకు త‌గ్గ పాత్ర కాక‌పోవ‌డ‌మే ప్రోబ్లం
న‌క్స‌ల్స్ ఇతివృత్తంతో ఇప్పుడు సినిమానా!
(ఇల‌పావులూరి ముర‌ళీమోహ‌న‌రావు)

రాజకీయాలకు ఆచార్యుడు బలైపోయినట్లుంది. చిరంజీవి సినిమా గురించి ఇంత ఘోరమైన ప్రచారం చూడటం ఇదే మొదటిసారి కావచ్చు. ట్రోల్స్ దారుణంగా ఉన్నాయి. (ఒక విదేశీయుడి స‌మీక్ష వీడియో రూపంలో ఈ వ్యాసం మ‌ధ్య‌లో ఉంది.)
తండ్రీకొడుకులు కలిసి నటిస్తున్నారంటే తండ్రి పాత్ర కొంచెమైనా వృద్ధాప్య ఛాయలు కలిగి ఉండాలి. సినిమాలో వారు తండ్రీకొడుకులు కాకపోవచ్చు. ప్రేక్షకులు ఇప్పుడు నిజజీవిత సంబంధాలను కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు.


చిరంజీవి డెబ్బై సంవత్సరాలకు అతి చేరువలో ఉన్నారు. ఈ వయసులో ఆయన కొడుకు పాత్ర కన్నా కుర్రతనంతో కనిపించాలనుకోవడం పొరపాటు. స్టెప్పులు, డాన్సులు వెయ్యడంలో చిరంజీవి అగ్రస్థానంలో ఉన్నారు ఒకప్పుడు. వయసు, కాలంతో పాటు శైలిని కూడా మార్చుకోవాలి. మలయాళం, తమిళ హీరోలు పాత్రను బట్టి మేకప్పులు మార్చుకుంటారు. మన తెలుగు హీరోలు ఎనభై ఏళ్ళ వయసులో కూడా కుర్రాళ్ళలా కనిపించాలని తాపత్రయపడుతుంటారు.


దానికితోడు రాజకీయ శత్రుత్వాలు. ఇప్పుడు లేకపోవచ్చు కానీ, చిరంజీవి మొన్నటిదాకా రాజకీయనాయకుడే. జగన్ పట్ల విపరీతమైన ద్వేషాన్ని కుమ్మరించారు ఒకప్పుడు. ఇక ఆయన తమ్ముళ్ల సంగతి చెప్పాల్సిన పనిలేదు. అవసరాల రీత్యా జగన్‌తో చిరంజీవి సఖ్యతను ప్రదర్శిస్తున్నప్పటికీ ఆయనను తమవాడిగా భావించడంలేదు వైసిపి పార్టీవారు. ఆ కోపంతో వారు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలను ద్వేషిస్తున్నారు.
ఇక నందమూరి అభిమానుల విషయం చెప్పాల్సిన పనిలేదు. వారు ఎట్టిపరిస్థితుల్లోనూ మెగా ఫ్యామిలీ సినిమాలు చూడరు. ఇటీవల మోహన్ బాబుతో వచ్చిన విబేధాల కారణంగా ఆయన వర్గం వారు కూడా చిరు సినిమాలకు దూరం.


ఒకప్పుడు ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటించిన సినిమాలు, అక్కినేని నాగేశ్వరావు..నాగార్జున నటించిన సినిమాలు, మోహన్ బాబు..విష్ణు నటించిన సినిమాలు కూడా విజయం సాధించలేదు. కొడుకులు కుర్ర హీరోలుగా ఉంటారు. వారికోసం తండ్రులు కొంచెమైనా గ్లామర్ ను త్యాగం చెయ్యాలి. మన వృద్ధ తండ్రులు ఆ పని చెయ్యరు.


చిరంజీవి సినిమాలు చూసి ఆనందించిన తరం వారు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పటి యువత యువహీరోలను ఇష్టపడ్తున్నారు తప్ప వృద్ద హీరోలను ఇష్టపడటం లేదు. అందువల్లనే రజనీకాంత్, కమల్ హాసన్ కూడా దెబ్బ తిన్నారు. అరవై ఏళ్ళు దాటిన బాలకృష్ణ తన వయసుకు తగిన పాత్రను ఎంచుకోవడంతోనే అఖండ సినిమా సూపర్ హిట్ అయింది. ఒక్క కుర్ర గెటప్‌లో మాత్రమే కనిపించి ఉన్నట్లయితే అది కూడా విఫలం అయ్యేది.


పైగా ఈరోజుల్లో నక్సల్స్ సమస్య ఏమిటి? ఈనాటి వారికి నక్సల్స్ గురించి పెద్ద అవగాహన లేదు. ఎప్పుడో ముప్ఫయి నలభై ఏళ్ళ క్రితమే నక్సల్స్ కథావస్తువులుగా అనేక సినిమాలు వచ్చాయి. కొన్ని విజయం సాధించాయి. ప్రస్తుత ఆధునిక కాలంలో ఇలాంటి సబ్జెక్ట్స్ తో సినిమాలు కష్టమే.
ఆచార్య ఫలితం ఇప్పటికే అర్ధం అయినప్పటికీ కమర్షియల్ గా ఎలా ఉంటుందో తెలియాలంటే నాలుగు రోజులు ఆగాలి. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ విశ్లేష‌కుడు, ర‌చ‌యిత‌)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ