‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’

Date:

విశ్వ‌క్‌సేన్ మూవీ మే 6న గ్రాండ్ రిలీజ్‌
హైద‌రాబాద్‌, ఏప్రిల్ 17:
‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను మే6 విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
‘‘‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ ప్ర‌మోష‌న్స్‌ను డిఫ‌రెంట్‌గా చేస్తున్నాం. విశ్వక్ సేన్ పాత్ర యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌కు భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అల్లం అర్జున్ కుమార్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో పాటు పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు మెచ్చేలా హిలేరియ‌స్‌గా ఉంటుంది’’ అని మేకర్స్ తెలిపారు.
ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ చిత్రానికి.. సూప‌ర్ హిట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం. విద్యా సాగ‌ర్ చింతా చిత్రాన్ని తెర‌కెక్కించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విప్ల‌వ్ ఎడిట‌ర్‌. ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కుల గణనకు ఏక సభ్య కమిషన్: రేవంత్

60 రోజుల్లో నివేదిక : ఆ తరవాతే ఉద్యోగ నోటిఫికేషన్లుకులగణన కమిటీలతో...

Wiki for All: Empowering Voices, Expanding Horizons

Hyderabad, October 08: The Wikimedia Technology Summit 2024 successfully...

Maharashtra: A battle between individuals

(Dr Pentapati Pullarao) Maharashtra is the second largest and richest...

Hurricane claims 50 lives in Florida

Washington: At least 50 people were killed, many injured,...