అజిత్ కుమార్ హీరోగా, బోనీ కపూర్ నిర్మించిన ‘వాలిమై’ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 24న గ్రాండ్ రిలీజ్

Date:

అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియా గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్‌ ‘వాలిమై’ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో  సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయాల్సింది, అయితే విడుదల చేయాలనుకున్న భారీ సినిమాలు కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా నానా ఇబ్బందులు ఎదుర్కొంది. కాస్త  సానుకూల వాతావరణం ఏర్పడటంతో ఫిబ్రవరి 24న విడుదలకు ప్లాన్ చేసారు   జీ స్టూడియోస్‌ సంస్థ,  బేవ్యూ ప్రాజెక్ట్స్‌ సంస్థలు.   బోనీకపూర్‌ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని హెచ్. వినోద్  దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుద‌ల చేస్తున్నారు.(Valimai by Bonnie Kapoor and starring Ajith Kumar)
ఈ సంద‌ర్భంగా నిర్మాత బోనీ కపూర్మా(Boney Kapoor) ట్లాడుతూ: “కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా నానా ఇబ్బందులు ఎదుర్కొంది. కాస్త  సానుకూల వాతావరణం ఏర్పడటంతో ఫిబ్రవరి 24న విడుదలకు ప్లాన్ చేసాము.  తమిళ్ తో పాటు హిందీ, తెలుగు కూడా ఒకే సారి విడుదల చేస్తున్నాం.  అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే  గ్రాండ్ విజువల్స్ తో చిత్రం ఆద్ధ్యంతం  ఉంటుంది.  తెలుగులో ‘ఖాకి’గా విడుదల అయిన కార్తీ తమిళ సినిమా ‘థీరన్ అధిగారం ఒండ్రు’ సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్  దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది.  అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు.  ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.  ఓ  పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపిస్తాడు.  హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారు కూడా! అయినా సరే ఏ మాత్రం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు. యాక్షన్ సీన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనేది చిత్రం చూసిన తరువాత  ఆడియ‌న్స్‌కు  అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ కీలక మైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా,  అయన తన శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకున్నారు” అన్నారు.        
ఈ చిత్రం లో నటీనటులు: అజిత్ కుమార్, కార్తికేయ గుమ్మడకొండ,  హ్యుమా ఖురేషి,  గుర్బాని జడ్జి, సుమిత్ర, యోగిబాబు, సెల్వ, జి ఎం సుందర్, అచ్యుత్ కుమార్, చైత్ర రెడ్డి, తదితరులు నటిస్తున్నారు.

ALSO READ: సుధీర్ వ‌ర్మ , అభిషేక్ నామా ‘రావణాసుర’ సెట్‌లో అడుగు పెట్టిన మాస్ మహారాజ రవితేజ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రాష్ట్ర సంపద పెంపునకు ఎం.ఎస్.ఎం.ఈ. పాలసీ-2024

విధానం లేకుండా అభివృద్ధి అసాధ్యంపాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిహైదరాబాద్,...

యువ వికాసానికి ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహం

ప్రజా పాలనా దినోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్హైదరాబాద్, సెప్టెంబర్ 17 :...

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...

Anti- defection laws need a review

(Dr Pentapati Pullarao) There is much news when MLAs or...