25మందితో టీటీడీ పాల‌క‌మండలి

0

మైహోం రామేశ్వ‌ర‌రావుకు రెండోసారి స‌భ్య‌త్వం
ఏఈ నుంచి కాట‌సాని, గొల్ల‌, మ‌ధుసూద‌న్‌ల‌కు స్థానం
తిరుమల, సెప్టెంబ‌ర్ 15:
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి పాల‌క‌మండ‌లిని నియ‌మించారు. 25మంది స‌భ్యుల‌తో ఏపీ ప్ర‌భుత్వం ఒక జాబితాను విడుద‌ల చేసింది. పాల‌క‌మండ‌లిలో తెలంగాణ‌కు చెందిన రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌ముఖుడు జూప‌ల్లి రామేశ్వ‌రరావు రెండోసారి చోటు ద‌క్కించుకున్నారు.

హెటిరో డ్ర‌గ్స్ పార్థ‌సార‌ధి, మారంశెట్టి రాములు, వేమిరెడ్డి, ప్ర‌శాంతి రెడ్డి, ముంబ‌యికి చెందిన రాజేశ్ శ‌ర్మ‌, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీ‌నివాస‌న్ కూడా రెండోసారి టీటీడీ పాల‌క‌మండ‌లిలో స్థానాన్ని ద‌క్కించుకున్నారు.

వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, యంయస్ యన్ ల్యాబ్స్ జీవన్ రెడ్డి, కోల్ కత్తాకి చెందిన సౌరభ్ స‌భ్యులుగా నియ‌మితుల‌య్యారు. వీరితో పాటు డాక్టర్ కేతన్ దేశాయ్, కర్నాటక నుంచి శశిధర్,శంకర్‌ల‌కు కూడా పాల‌క‌మండలిలో చోటు ద‌క్కింది. ఏపి నుంచి పోకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కాటసాని, గొల్ల బాబూరావు, మధుసూదన్ యాదవ్, కల్వకుర్తి విద్యాసాగర్‌ల‌కు స‌భ్య‌త్వం ద‌క్కింది. తమిళనాడులోని వెల్లూరు ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య, కర్నాటక నుంచి ఎమ్మెల్యే విశ్వనాధ్ రెడ్డి ల‌ను కూడా టీటీడీ పాల‌క‌మండ‌లిలో స‌భ్యులుగా నియ‌మించారు. బుద‌వారం సాయంత్రం ఈమేర‌కు జాబితా విడుద‌లైంది. టీటీడీ చైర్మ‌న్‌గా రెండోసారి వైవీ సుబ్బారెడ్డి నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here