21న టిఆర్ఎస్ ఎల్‌పి స‌మావేశం

Date:

వేస‌వి వ‌రి కొనుగోలు చేయాల్సిందే
పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు, జిల్లా అధ్య‌క్షులు
జ‌డ్పీ చైర్మ‌న్ల‌కూ ఆహ్వానం
నిర్ణ‌యించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌
ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌కు స‌మావేశంలో రూప‌క‌ల్ప‌న‌

హైద‌రాబాద్‌, మార్చి 19: ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ళ మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభలో, రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్ సిఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం కెసిఆర్ వివరించారు. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలు పై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టిఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతున్నందున ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం స్పష్టం చేశారు.
మ‌ల్లు స్వ‌రాజ్యం మృతికి సంతాపం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, పీడిత ప్రజల పక్షపాతి, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర సంతాపం తెలిపారు.
నాటి రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అని సీఎం అన్నారు. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన మల్లు స్వరాజ్యం జీవన గమనం గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తి దాయకం అని సీఎం తెలిపారు. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటని సీఎం అవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...

గాంధీ గారి కుర్చీ

(డా నాగసూరి వేణుగోపాల్, 9440732392)2024 సెప్టెంబర్ 9వ తేదీన నేను మద్రాసులో...

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుస్తాం

మా డిమాండ్ నెరవేరిస్తే కేంద్రానికి సహకరిస్తాంఫైనాన్స్ కమిషన్ సమావేశంలో రేవంత్ ప్రకటనహైదరాబాద్,...

పర్యావరణ హితంగా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి

ముందుకు వస్తున్న ప్రముఖ కంపెనీలుమౌలిక సౌకర్యాల కల్పన వేగిరపరచాలిఫార్మా సిటీ ప్రణాళికలపై...