Tuesday, March 28, 2023
HomeArchieveపోయి రావమ్మా! ఓ కూనలమ్మ

పోయి రావమ్మా! ఓ కూనలమ్మ

(డా విడి రాజగోపాల్, 9505690690)
భారతీయ చిత్రసీమలో ఓ గాన కోకిల
దాదాపు ఓ ఏడు దశాబ్దాలకు పైగా
ఎన్ని రాగాలు పలికెనో
ఎన్ని మధుర గీతాలు ఆలపించెనో,
గొంతు విప్పిందంటే
ఆ రాగాల ఝరి మనల్ని
మైమరపింపజేస్తుంది,
భాష ఏదైతేనేం,
అంటూ అన్ని భారతీయ భాషల్లో పాడారు,
ఓ అర లక్ష పాటలంటే మాటలా,
గిన్నిస్ రికార్డు లాంటి ఎన్నో రికార్డులు తన సొంతం,
ఈ భారత నైటింగేల్ భారతరత్నతో సహా లెక్కకు లేనన్ని అవార్డులు పొందారు
గత సంవత్సరం ఈ కరోనా
మన బాలును పొట్టన పెట్టుకుంది,


ఈ సంవత్సరం ఈ గానలమ్మను వదలలేదు,
విధి వీరిని మన నుండి దూరంచేసినా,
వారి మధుర గాన దొంతరలు
వారిని మననుండి దూరం చేయగలవా?
వారి పాటలు విన్నప్పుడల్లా
మనందరి మదిఫలకంలో కనపడక మానదు


ఈ గానలమ్మ
అయినా మనసంతా విరిగింది
కన్నీటి బొట్టు జలజలా రాలింది
నా సిరాను నింపింది
నాచే రాయించింది ఈ నాలుగు మాటలు
లతమ్మ పోయిరావమ్మా! కన్నీటి వీడ్కోలు మీకు ఓ కూనలమ్మా!
కభీ కభీ మేరేదిల్ మే రహుంగా!
(క‌విత ర‌చ‌యిత రిటైర్డ్ డైరెక్ట‌ర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాల‌జీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ