హీరోల‌తో పోటీగా అద్భుతంగా న‌టించిన కైకాల‌

Date:

స‌త్య‌నారాయ‌ణ భౌతిక కాయానికి కేసీఆర్ నివాళులు
కైకాల కుటుంబానికి ప‌రామ‌ర్శ‌
ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌ల‌కు ఆదేశం
హైద‌రాబాద్‌, డిసెంబ‌ర్ 23:
ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటని సీఎం కేసిఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.


నవరస నట సార్వభౌమునిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల అనేక అవార్డులు అందుకున్నారని, తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడుగా, లోక్ సభ సభ్యునిగా దివంగత కైకాల సత్యనారాయణ చేసిన కళాసేవ, ప్రజా సేవ గొప్పదని సీఎం అన్నారు. కైకాలతో తనకున్న అనుబంధాన్ని సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు.


సినీ నటుడు మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ చేసిన సేవలకు గౌరవంగా, ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.


కాగా… బంజారా హిల్స్ లోని కైకాల నివాసానికి వెళ్ళిన సిఎం కేసీఆర్ సినీనటుడు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. వారి కుమారులను కుమార్తెల‌ను కుటుంబ సభ్యులను సిఎం ఓదార్చారు. వారికి ధైర్యవచనాలు చెప్పి కాసేపు పరామర్శించారు. అనంతరం అక్కడే వున్న మీడియా ముందుకు వచ్చి నటుడుగా ఎంపీ గా కైకాలతో తనకున్న అనుబంధాన్ని సిఎం స్మరించుకున్నారు.


ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…


‘‘ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు గొప్ప వ్యక్తి. వారు మరణించడం చాలా బాధాకరం. సినీ హీరోలతో పోటీపడుతూ చాలా అద్భుతంగా నటించే వారాయన. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో నటించి, అద్భుతమైన పేరు తెచ్చుకున్న వ్యక్తి. నేను కొంతకాలం వారితో కలిసి పనిచేయడం కూడా జరిగింది. ఆ కాలంలో వారితో కొన్ని అనుభవాలను కూడా పంచుకున్నాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సీనియర్ నటుడు కైకాల గారిని కోల్పోవడం బాధాకరం..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


పరామర్శ సందర్భంగా.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెంట, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు ఎస్.మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, బాల్క సుమన్, తో పాటు వేణు గోపాల చారి, దాసోజు శ్రవణ్, ఆంజనేయులు గౌడ్, పతాని రామకృష్ణ గౌడ్ తదితరులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...

Anti- defection laws need a review

(Dr Pentapati Pullarao) There is much news when MLAs or...

Onam the festival of Colors and Flowers

(Shankar Raj) Kerala in many ways is a strange state....

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...