కాబూల్‌లో జంట పేలుళ్ళు: 90మంది దుర్మ‌ర‌ణం

0

నాలుగు దేశాల‌కు ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు
ఉగ్ర‌వాద దాడులు జ‌ర‌గొచ్చ‌ని సంకేతాలు
కాబూల్‌, ఆగ‌స్టు 26:
కాబూల్ ఎయిర్‌పోర్ట్ వెలుప‌ల గురువారం సాయంత్రం సంభ‌వించిన పేలుడు యావ‌త్ప్రపంచాన్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల సంఖ్య‌పై ఇంత‌వ‌ర‌కూ స్ప‌ష్ట‌త రాలేదు. ఈ పేలుడును పురస్క‌రించుకుని నాలుగు దేశాల‌కు ప్ర‌మాద హెచ్చ‌రిక‌ల‌ను పంపాయి. హ‌మీజ్ క‌ర్జాయ్ ఎయిర్‌పోర్ట్ గేట్ల వ‌ద్ద ఈ పేలుడు సంభవించింది. ఈ సంఘ‌ట‌న‌కు ముందు ఇట‌లీ జెట్‌కు నిప్పంటుకుంది. పేలుడు స‌మ‌యంలో విమానాశ్ర‌యంలో వేలాదిమంది ఉన్నారు. ఈ సంఘ‌ట‌న‌తో విమానాశ్ర‌యంలో ఆందోళ‌న‌క‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంది. పెంట‌గాన్ పేలుడు ఘ‌ట‌న‌ను నిర్థారించింది. భార‌త్ తాజా ప‌రిణామాల‌ను సునిశితంగా గ‌మ‌నిస్తోంది. భార‌త్ స‌హా యుకె, యుఎస్‌, ఇట‌లీ దేశాల‌పై ఉగ్ర‌వాద దాడులు జ‌ర‌గొచ్చ‌నీ, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పెంట‌గానే హెచ్చరిక‌లు జారీ చేసింది. ఈ పేలుడు ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. మొద‌టి పేలుడు ఒక హొట‌ల్ వ‌ద్ద సంభ‌వించింది. రెండోది ఎయిర్‌పోర్ట్ గేటు వ‌ద్ద చోటుచేసుకుంది. పేలుళ్ళ‌లో 90మంది మ‌ర‌ణించారు. మృతుల‌లో అమెరిక‌న్లు కూడా ఉన్న‌ట్లు పెంట‌గాన్ నిర్థారించింది. వీరిలో 13మంది అమెరిక‌న్లు. పేలుళ్ళ క్ర‌మంలో అమెరికన్ల త‌ర‌లింపును ఆపేది లేద‌ని అధ్య‌క్షుడు జో బిడెన్ స్ప‌ష్టంచేశారు. త‌మ పౌరుల మృతికి ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని స్ప‌ష్టంచేశారు.పేలుళ్ళు ఐసిస్ ప‌నేనని తాలిబ‌న్లు ఆరోపిస్తున్నారు. ఈ పేలుళ్ళ‌లో త‌మ ప్ర‌మేయం లేద‌ని చెప్పడానికి వారు ప్ర‌య‌త్నిస్తున్నారు. యుకె సైన్యం ఉంటున్న హొట‌ల్ ముందు పేలుడు జ‌ర‌గ‌డంతో తాలిబ‌న్ల‌కు సంక‌టంగా మారింది. అమెరికా సైతం ఐసిస్ హ‌స్తాన్ని అనుమానిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here