Tuesday, March 21, 2023
HomeArchieveశ్రీకాంత్ కోతలరాముడు ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల !!!

శ్రీకాంత్ కోతలరాముడు ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల !!!

శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కోతల రాయుడు’. వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1గా కొలన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ‘కృష్ణాష్టమి’ ఫేం డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృద్వి, మురళి శర్మ, సత్యం రాజేష్, పోసాని కృష్ణమురళి, సుడిగాలి సుధీర్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో కామెడీ, ఫైట్స్ బాగున్నాయి. ఫ్యామిలీలో ఉన్న అందరూ కలిసి చూడదగ్గ అంశాలు ఉన్నాయని, శ్రీకాంత్ పాత్ర అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని దర్శకుడు సుధీర్ రాజు తెలిపారు. మంచి సినిమా ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని  కోతలరాయుడు సినిమా మా అందరికి మంచి పేరు తెచ్చిపెడుతుందని నిర్మాతలు ఏ.ఎస్.కిషోర్,  కొలన్ వెంకటేష్ తెలిపారు.

నటీనటులు:శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, షియాజి షిండే, పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్,  సత్యం రాజేష్, పృద్వి, చంద్రమోహన్, సుధ, హేమ, శ్రీ లక్ష్మీ, జయవాణి, తాగుబోతు రమేష్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ