శివ నుంచి వ‌ర్మ ట్వీట్ దాకా

0

(కూచిమంచి వీఎస్ సుబ్ర‌హ్మ‌ణ్యం)
1989 డిసెంబ‌ర్ 8, విజ‌య‌వాడ‌లోని రాజ్ థియేట‌ర్‌. శివ సినిమాకు ముగ్గురు క‌లిసి వెళ్ళారు. వారిలో ఇద్ద‌రు కాబోయే దంప‌తులు. మ‌రొక‌రు పెళ్ళికుమార్తె చెల్లెలు క‌ల్యాణ ల‌క్ష్మి. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ. సినిమా చూసి ముగ్గురు ఆనందించారు. క‌ట్ చేస్తే…2020 డిసెంబ‌ర్ 8, న‌లుగురు క‌ల‌సి హైద‌రాబాద్‌లో ఓ ఇంట‌ర్వ్యూకు వెళ్ళారు. వారిలో ఇద్ద‌రు 1989 డిసెంబ‌ర్ 8న శివ సినిమాను చూసిన కాబోయే దంప‌తులు. మిగిలిన ఇద్ద‌రూ వారి కుమారుడు కోడ‌లు. ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వెళ్ళింది ఎవ‌రినో కాదు శివ సినిమా ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌నే. ఇది యాదృచ్ఛిక‌మే కానీ.. అనుకుని జ‌రిగింది కాదు. ఆ ఇద్ద‌రం ఎవ‌ర‌మో కాదు.. నేను (కూచిమంచి వీఎస్ సుబ్ర‌హ్మ‌ణ్యం) నా భార్య వైజ‌యంతి. మాతో వ‌చ్చింది మా అబ్బాయి సూర్య ప్ర‌కాశ్‌, కోడ‌లు శ్రీ‌విద్య‌. ఇంట‌ర్వ్యూ చేసింది వైజ‌యంతి.
ఇంట‌ర్వ్యూ శివ సినిమాతో మొద‌లై దేవుడు, మిథ్య‌, రామాయ‌ణం వ‌ర‌కూ సాగింది. హృద్యంగా సాగిన ఆ ఇంట‌ర్వ్యూ అనంత‌రం, రామ్ గోపాల్ వ‌ర్మ గారు కోరిన కోరిక‌.. మేడ‌మ్ మీతో ఒక ఫొటో తీయించుకుంటా.. అవాక్క‌వ‌డం మా వంతైంది. అదేంటి సార్‌. మేమే మీతో ఫొటో తీయించుకోవాల‌నుకున్నాం అన్నాం. సంప్ర‌దాయ దుస్తుల‌లో వ‌చ్చి ఇంట‌ర్వ్యూ చేసిన మొట్ట‌మొద‌టి మ‌హిళ మీరు అంటూ కాంప్లిమెంట్‌. ఫొటో తీసిన త‌రువాత త‌న‌కు పంప‌మ‌ని కోరారు వ‌ర్మ‌. ఏ సంస్థ‌కోసం ఇంటర్వ్యూ చేశారో అడిగారు. మా వెబ్ సైట్ పేరు చెప్పాం. ఫొటోను ఆయ‌న‌కు వాట్సాప్ చేశాం. ఇంటికొచ్చి సిస్టం ఆన్ చేసే స‌రికి ట్విట‌ర్‌లో వ‌ర్మ‌గారి ట్వీట్ చూసి, ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌మయ్యాం. ఆ ట్వీట్‌ను ఇక్క‌డ పొందుప‌రుస్తున్నాం.


వ‌ర్మ‌గారు ఇంట‌ర్వ్యూలో ఏం చెప్పార‌నే ఆస‌క్తి ఉండ‌డం స‌హ‌జం. ఇంత‌వ‌ర‌కూ సాగిన వ‌ర్మ గారి ఇంట‌ర్వ్యూలు ఒక ఎత్తు. మా వ్యూస్ ఇంట‌ర్వ్యూ ఒక ఎత్తు అని మా భావ‌న‌. అది నిజ‌మా కాదా ప్రేక్ష‌కులు నిర్థారించుకోవ‌డానికి కొంత కాలం ఆగాల్సిందే. ఈ వీడియోను చూడ‌డానికి మా వ్యూస్ యూ ట్యూబ్ చానెల్‌ను స‌బ్ స్క్ర‌యిబ్ చేయండి. వ్యూస్ వెబ్ సైట్‌ను సంద‌ర్శించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here