Saturday, March 25, 2023
HomeArchieveమ‌న‌సుకు హ‌త్తుకునే చెన్నూరి ర‌చ‌న‌లు

మ‌న‌సుకు హ‌త్తుకునే చెన్నూరి ర‌చ‌న‌లు

ప‌సిడి మ‌న‌సులు
గ్రంథ స‌మీక్ష‌
(స‌మీక్ష: వైజ‌యంతి పురాణ‌పండ‌)

ఆకాశవాణి కేంద్రంలో పనిచేసేవారికి సరస్వతీ కటాక్షం సిద్ధించటం సర్వసాధారణం. అక్కడకు వచ్చే సరస్వతీపుత్రుల కారణమో, కార్యక్రమాల రూపకల్పనలో భాగంగానో సాహిత్యాభిలాష పెరుగుతుంది. చెన్నూరు సీతారాంబాబుగారికి ఆకాశవాణితో మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం. స్వతహాగా సాహిత్య పిపాసి కూడా కావటంతో, అనేక కవితలు, కథానికలు, కథలు రచించటం దినచర్యగా మారిపోయింది. అలా అడపాడదపా రచించిన 72 కవితలను, 20 కథలను పసిడి మనసులు అనే పేరున రెండు పుస్తకాలుగా ప్రచురించారు.
భయమేస్తోంది
వెలుగుండాల్సిన కళ్లలో
కామం జీరలతోకనిపించే
మగాళ్లను చూస్తుంటే
భయమేస్తోంది.

దేహాన్ని మురికి నదిని చేసి
వేటాడే మృగమైన వికృత మగాళ్ల
ఉనికి
ఇసుక తుఫానులా గుండెను తాకుతుంటే
భయమేస్తోంది…
మెతుకు ముట్టుకుంటే చాలు అన్నం ఉడికిందో లేదో తెలుస్తుంది. అంతేకాని అన్నమంతా పట్టుకుని చూడక్కర్లేదు. సి. ఎస్‌. రాంబాబు గారి కవితలలో మచ్చుకి ఒక్కటి చూస్తే చాలు, ఆయనకు సమాజం పట్ల ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది. వారి రచనలు కూడా అలాగే ఉంటాయని తెలుస్తుంది.
ఈ పుస్తకాలను కొని చదవండి.


పుస్తకాలు: పసిడి మనసులు
రచన: చెన్నూరు సీతారాంబాబు
వెల: ఒక్కో పుస్తకం 100 రూపాయలు (కవితల పుస్తకం, కథల పుస్తకం)
పేజీలు: కవితల పుస్తకం 96 పేజీలు, కథల పుస్తకం 168 పేజీలు
దొరుకుచోటు:
చెన్నూరు సీతారాంబాబు
202, కీర్తన హోమ్స్‌
11 – 1 – 530
మైలారగడ్డ
సీతాఫల్‌ మండి
హైదరాబాద్‌ – 500 061
ఫోన్‌: 8374818961

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ