Tuesday, March 21, 2023
HomeArchieveపాత్రికేయంలో త‌గ్గుతున్న విలువ‌లు

పాత్రికేయంలో త‌గ్గుతున్న విలువ‌లు

పోటీతో పాటే విశ్వసనీయత
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ రాజ‌శుక ఆందోళ‌న‌
తెలుగు యూనివ‌ర్శిటీ కీర్తి పుర‌స్కారాలు అందుకున్న మాడ‌భూషి, రాజ‌శుక‌
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)

సమాచార సేకరణలో పోటీతత్వంతో వేగం పెరుగుతున్న కొద్దీ పాత్రికేయంలో ప్రమాణాలు, విశ్వసనీయత తగ్గుతోందని, పాత్రికేయల విలువలు పడిపోతున్నా యని సీనియర్ పాత్రికేయుడు జి.రాజశుక ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాధ్యమాల సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తరపున కీర్తి పురస్కా రాలు-2018 కింద ‘పత్రికా రచన’ విభాగంలో తాపీ ధర్మారావు స్మారక పుర స్కారాన్ని మంగళవారం నాడు స్వీకరించారు. సమాచాన విప్లవంలో మాధ్యమం బహు ముఖంగా విస్తరించడం శుభపరిణామమే అయినా ప్రమాణాలు పాటించ డం అత్యంత ముఖ్యమని అన్నారు. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మాధ్యమాల అస్తిత్వానికే భంగం వాటిల్లే ఆస్కారం ఉందని అన్నారు. ముఖ్యంగా యువ పాత్రికేయులు అధ్యయనం పట్ల శ్రద్ధ చూపాలని సూచిం చారు. రాజశుక తండ్రి జి.కృష్ణ ప్రఖ్యాత పాత్రికేయులు.ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ పత్రికలు సహా వివిధ పత్రికలలో ఐదు దశాబ్దాలకుపైగా సేవలు అందించారు.


మాన‌వ‌తా హ‌క్కుల మూర్తి రామానుజాచార్య: ఆచార్య శ్రీ‌ధర్‌
‘ఆధ్యాత్మిక సాహిత్యం’ విభాగంలో బాదం సరోజాదేవి స్మారక పుసస్కారం స్వీకరించిన ఆచార్య మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ, సమసమాజ స్థాపన కోసం వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు పరితపించి, ఆ దిశలో అలుపెరుగని కృషి చేశారని, కొందరికే పరిమితమైన మంత్రరాజం అందరికి చేరువకావాలని అభిలషించిన ’మానవత హక్కుల మూర్తి’ అని కొని యాడారు. అష్టాక్షరీ మంత్రం ఉపదేశించేందుకు రామానుజులను గురువు పద్దె నిమిదిసార్లు తిప్పుకున్నారని,అయినా ఆయన పట్టువీడలేదని, మంత్రోపదే శమైన వెంటనే దానిని జనాబాహుళ్యానికి బహిరంగపరిచారని చెప్పారు. విద్యార్థి దశలో ఆయన గురించి చదివిన తాను రామానుజ సహస్రాబ్దిని పురస్కరించుకొని ’రామానుజ మార్గం’ గ్రంథాన్ని వెలువరించినట్లు చెప్పారు. తన తండ్రి ఎం.ఎస్.ఆచార్య తరపున 28 ఏళ్ల క్రితం ఇదే విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం అందుకున్న తాను తిరిగి ఆధ్యాత్మిక సాహిత్య విభాగంలో పురస్కారాన్ని స్వీకరించడం విచిత్ర సన్నివేశమని అన్నారు.


న్యాయస్థానాలలో వాద ప్రతివాదనలు తప్పనిసరిగా ప్రజల భాషలోనే జరగాలని ఎస్.హెచ్.ఆర్.సి. చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య అభిలషించారు. న్యాయశాస్త్ర గ్రంథాల అనేకం ఆంగ్లంలో ఉండడం వల్లే న్యాయ వ్యవహారాలు మాతృభాషలో సాగడంలేదని, న్యాయగ్రంథాల కోసం తెలుగులో పరిశోధన జరగవలసిన అవసరం ఉందని అన్నారు.విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య టి. కిషన్ రావు అధ్యక్షతన జరిగిన సధస్సలో తెలుగు సాహిత్యంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 23 మంది ఈ పురస్కారాలు స్వీకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ