ఇది రైల్వే కలి

Date:

ప్రయాణికుల జీవితాల్లో మూడు రైళ్ల బీభత్సం
గాల్లో కలిసిన వందలాది ప్రాణాలు
కదిలి వచ్చిన మానవత
బారులు తీరిన రక్త దాతలు
నిరంతరాయంగా సహాయ చర్యలు
క్షణ క్షణానికి పెరుగుతున్న మృతుల సంఖ్య
రంగంలోకి ప్రధాని మోడీ
ఉదయం నుంచి ప్రమాద స్థలిలోనే రైల్వే మంత్రి
మమతా బెనర్జీ కుట్ర రాగం
భారత రైల్వే చరిత్రలో ఇదొక దుర్దినం. ఒక బ్లాక్ డే. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తే సరిపోతుందా. ఆ డబ్బులు మనసులకు అయినా గాయాలను మానుస్తాయా? ఈ ప్రమాదానికి కారకులు ఎవరు? హేతువు ఏమిటీ? ఇవన్నీ తేలేలోగా బాధిత కుటుంబాలు, క్షతగాత్రుల గుండెలు అవిసిపోతాయి. కన్నీరు ఇంకిపోతుంది. గొంతులు పిడచకట్టుకుపోతాయి.

తప్పు ఎవరిదైనా అనుభవిస్తున్నది ప్రయాణీకులు. ఇంత ఘోరమైన ప్రమాదం ఇటీవలి కాలంలో ఇదే ప్రధమం. పడుకున్నవారు పడుకున్నట్టే కన్నుమూశారు. ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద సంభవించిన ఈ రైల్వే (ఘోర) కలి అందర్నీ కదిలించింది. చెన్నై నుంచి వచ్చాయీ కోరమాండల్ ఎక్స్ప్రెస్ తొలుత అదే లోనులో వస్తున్న గూడ్సును ఢీకొంది. పట్టాలు తప్పింది.

మరో లైన్లో వస్తున్న యస్వంతపూర్ హౌరా ఎక్స్ప్రెస్ పట్టాలపై పది ఉన్న బోగీలను ఢీ కొట్టింది. స్థానికులు రంగంలోకి దిగారు. కొద్దిసేపటికి అధికారులు కూడా వచ్చారు. చకచకా సహాయ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. గడిచిన 20 గంటలుగా కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ దగ్గరుండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.


ప్రధాని మోడీ సంఘటన స్థలాన్ని సందర్శించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా విచ్చేసారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి నుంచి ప్రమాద స్థలంలో ఉంది సహాయ చర్యలను పరిశీలిస్తున్నారు.


ప్రమాదానికి కారణం ఏమిటీ?
ఇంత ఘోరప్రమాదానికి కారణం ఏమిటి? సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమా.. సాంకేతిక వైఫల్యమా? మానవ తప్పిదమా? ఇది తేలాలంటే ఎంతో కాలం పడుతుంది. కొన్నేళ్ల క్రితం రైళ్లు ఎదురెదురుగా ఢీకొనే ప్రమాదాన్ని తప్పించడానికి రూపొందిన సాఫ్ట్ వేర్ ను రైల్వే శాఖ ఉపయోగిస్తోంది. ఒక వేళ మానవ తప్పిదం లేదా, సిగ్నలింగ్ వ్యవస్థ లోపం వల్ల ఒకే ట్రాక్ పై రైళ్లు ఎదురెదురుగా వస్తే డ్రైవర్లను అప్రమత్తం చేసే సాఫ్ట్ వేర్ ఇది.

ప్రస్తుత ప్రమాదాన్ని బట్టి అది విఫలమైనట్టా లేక ఆ సమయంలో డ్రైవర్లు నిద్రపోతున్నారా? సిగ్నలింగ్ వైఫల్యం అయి ఉంటే ఇప్పటికే ఆ విషయం బయట పడి ఉండేది. ఈ రెండు వ్యవస్థలూ సక్రమంగా పనిచేసినా ప్రమాదం చోటుచేసుకుంది అంటే… ఇది తేలడానికి లోతైన పరిశోధన సాగాలి.


హాహారావాలు… శవాల కుప్పలు
సహాయ సిబ్బంది తీస్తున్న కొద్దే మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. మద్యం నాలుగంటల సమయానికి మృతుల సంఖ్య 280 . క్షతగాత్రులు వందల్లో ఉన్నారు. వారందరికీ వైద్యం అందచేసేందుకు భువనేశ్వర్, బాలాసోర్, పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సేవలను రైల్వే శాఖ వినియోగించుకుంటోంది. ప్రమాద స్థలిలో ఇప్పటికే కుళ్ళిన వాసన వస్తోంది. ప్రమాదం జరిగి ఇంచుమించు 24 గంటలు అయ్యింది. మృతదేహాలు కుళ్ళి పోవడం ప్రారంభమైనందునే ఈ వాసన వస్తోంది.


ఘటన స్థలిలో మోడీ
నాలుగు గంటల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘంటానా స్థలికి చేరుకున్నారు. భువనేశ్వర్ నుంచి ఆయన హెలీకాఫ్టర్లో అక్కడికి వచ్చారు. రైల్వే మంత్రి ప్రధానికి ప్రమాదం గురించి వివరించారు. అంతకు ముందు ఢిల్లీలో ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.


భారత్ లో జరిగిన పది ఘోర రైలు ప్రమాదాలు
Bihar train disaster (June 6, 1981): 500-800 deaths
Firozabad rail disaster (August 20, 1995): 358 deaths
Collision of Awadh–Assam Express and Brahmaputra Mail (August 2, 1999): 268 deaths
Khanna rail disaster (November 26, 1998): 212 deaths
Gyaneshwari Express train derailment (May 28, 2010): 170 deaths
Pamban-Dhanuskodi passenger train (December 23, 1964): 150 deaths
Gaisal train disaster (August 2, 1999): 285 deaths
2002 Rajdhani Express accident (September 9, 2002): 200 deaths
Pamban Bridge accident (1964 Rameswaram cyclone): 150+ deaths
Jnaneswari Express train derailment (May 28, 2010): 148 deaths

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...

Uddhav Thackeray: Congress riding Shiv sena tiger?

(Dr Pentapati Pullarao) In November 2019, Uddhav Thackeray broke of...

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...

శిల్ప చేసిన భగీరథ విఫల యత్నం

త్వరలో సమస్య పరిష్కారానికి HMWSSB ఎం.డి. హామీ (కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ఎవరికైనా వ్యక్తిగతంగా...