హైదరాబాద్, ఆగస్టు 1: ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హఠాత్తుగా మరణించారు. ఈ సంఘటనతో ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమెది అసహజ మరణంగా భావిస్తున్నారు. ఉమామహేశ్వరి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని కొన్ని టీవీ చానెల్స్ చెబుతున్నాయి. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నటుడు బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి వెళ్ళారు.
ఎన్టీఆర్ కుమార్తె హఠాన్మరణం
RELATED ARTICLES