ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాలు

Date:

ముహుర్తానికి ఓకే చెప్పిన సీఎం జ‌గ‌న్‌
కొత్త జిల్లాల‌పై స‌మీక్ష‌లో అధికారుల‌కు ఆదేశాలు
అమరావతి, మార్చి 30:
ఆంధ్ర ప్ర‌దేశ్‌లో నూత‌న జిల్లాల అవ‌త‌ర‌ణ‌కు రంగం సిద్ధ‌మైంది. అందుకు అనుగుణంగా ఏమేం చ‌ర్య‌లు చేప‌ట్టాలి? ఎలాంటి నిర్మాణాలు అవ‌స‌రం, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ప‌రిపాల‌న స‌ముదాయాల నిర్మాణం, త‌దిత‌ర అంశాల‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బుధ‌వారం త‌న క్యాంప్ కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. ఏప్రిల్ 4న ఉద‌యం 9.05 నుంచి 9.45 నిముషాల మ‌ధ్య కొత్త జిల్లాల‌ను ప్రారంభించేందుకు నిర్ణ‌యించిన ముహుర్తానికి ఏపీ సీఎం జ‌గ‌న్ ఆమోదం తెలిపారు. ఏప్రిల్‌ 6న వాలంటీర్ల సత్కారం, ఏప్రిల్‌ 8న వసతి దీవెన కార్యక్రమాలు చేప‌డ‌తారు.


కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి వివరాలను సీఎస్‌ సహా, ఇతర ఉన్నతాధికారులు సీఎంకు నివేదించారు. కొత్త జిల్లాలపై 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని వారు తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశామని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతనే కలెక్టర్లు సిఫార్సులు చేశారన్నారు. సిబ్బంది విభజన, వారికి పోస్టింగుల్లో సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులు.. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నామని వివ‌రించారు. వీటిని పరిగణలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనా యంత్రాంగం నిర్మాణం, పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు రూపొందించామ‌ని అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు.


అవ‌స‌ర‌మైన చెక్ లిస్ట్ సిద్ధం
కొత్త జిల్లాలకు సిబ్బంది వెళ్లేలోగా అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడానికి ఒక చెక్‌లిస్టు కూడా తయారుచేశామని అధికారులు సీఎంకు వివ‌రించారు. కొత్త జిల్లాలకు సంబంధించి ఏర్పాట‌వుతున్న నూతన వెబ్‌సైట్లు, కొత్త యంత్రాంగాలకు అనుగుణంగా ప్రభుత్వం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు.. తదితర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని తెలిపారు. కొత్త జిల్లాల సమాచారంతో హ్యాండ్‌ బుక్స్‌ కూడా తయారు చేశామ‌ని తెలిపారు.


క్యాంప్ కార్యాల‌య‌లు ఖ‌రారు
కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను ఖరారుచేశామని తెలిపారు. సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ భవనాలను ఎంపిక చేశామని, లేనిచోట ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకున్నామ‌ని వివ‌రించారు.
ఆర్థిక ప్ర‌గ‌తి ల‌క్ష్యాల‌ను అనుసంధానించాలి: సీఎం
సుస్థిర ఆర్థిక ప్రగతికోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాలకోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలన్నారు. కనీసంగా 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని సూచించారు. కలెక్టర్‌తోపాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఉండేలా చూసుకోవాల‌న్నారు. వీరి క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా తగిన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలని సీఎం చెప్పారు. పదికాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలని కోరారు. ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకున్న జిల్లాల్లో.. కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్ప‌ష్టంచేశారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి, ప్లానింగ్‌ సెక్రటరీ వి విజయకుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Maharashtra: A battle between individuals

(Dr Pentapati Pullarao) Maharashtra is the second largest and richest...

Hurricane claims 50 lives in Florida

Washington: At least 50 people were killed, many injured,...

మన మౌనం ధర్మ వినాశనానికి దారివ్వకూడదు: పవన్ కళ్యాణ్

విజయవాడ, సెప్టెంబర్ 24 : తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన...

తిరుపతి లడ్డు వివాదం ..సమాధానం చెప్పవలసింది ఎవరు?

అపరిమిత అధికారాలిచ్చిన ఫలితం ఇది…(శివ రాచర్ల)సీఎం చంద్రబాబు గారు ఆరోపణలు చేశారు....