సచివాలయం సొగసు చూడతరమా!

Date:

3డీ యానిమేషన్లో తెలంగాణ సచివాలయం
విజనరీ సీఎం కేసీఆర్ నిర్మిస్తోన్న అత్యంత సొగసైన సచివాలయం తెలంగాణాకు తలమానికంగా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వచ్చే ఏప్రిల్ 30 వ తేదీన సమీకృత కొత్త సచివాలయం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అద్భుతమైన గ్రీనరీ, వాటర్ ఫౌంటెన్లతో ఇక్కడి ల్యాండ్ స్కేప్ చూపరులకు కనువిందు చేయనుంది. ఎత్తైన ప్రహరీ, విశాలమైన పార్కింగ్ ప్లేస్, హెలిపాడ్లతో సహా అన్ని ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ ను నిర్మించారు. ఉద్యోగుల కోసం, సందర్శకుల కోసం క్యాంటీన్, పోస్ట్ ఆఫీస్, బ్యాంకు, ప్రత్యేకమైన పార్కింగ్ లాంటి సకల సౌకర్యాలను కూడా ఇక్కడ ఒక పద్దతి ప్రకారం కల్పించారు.


ఆరో అంతస్తులో కేసీఆర్ కొలువు
బిల్డింగు 6 వ అంతస్తులో ముఖ్యమంత్రి, ఆయన సిబ్బంది కొలువుదీరనున్నారు. సీఎం ఛాంబర్ కు అనుసంధానంగా ఒక భారీ మీటింగ్ హాలును ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రధాన కార్యదర్శి, సంబంధిత సిబ్బంది ఛాంబర్లు కూడా ఇదే అంతస్తులో ఉండనున్నాయి. మొదటి అంతస్తును సాధారణ పరిపాలన, ఆర్థికశాఖలకు కేటాయించారు. ఇక క్యాబినెట్ సమావేశాలు నిర్వహించడానికి వీలుగా విశాలమైన హాలు, ఒక బాంక్వెట్ హాలు, మరో పెద్ద ఆడిటోరియం, దేశవిదేశాల నుంచి ముఖ్య అతిథులు, ప్రతినిధులు వస్తే అక్కడే భేటీ అయ్యేలా ఏర్పాట్లు, ప్రతి అంతస్తులో మంత్రుల ఛాంబర్లకు అనుసంధానంగా సమావేశ మందిరాలను కూడా ఏర్పాటు చేశారు. విశిష్ట అతిథులు వస్తే సమావేశం అయ్యేలా తూర్పు వైపు పోర్టికో పై భాగంలోని మధ్య గుమ్మటంలో హుస్సేన్ సాగర్ లేక్ వ్యూతో ఏర్పాటు చేసిన మీటింగ్ హాలు కొత్త సచివాలయానికి హైలైట్.


శాశ్వత విద్యుత్తు దీప కాంతులు
ఇక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, జాతీయ పండుగల సందర్భంగా సౌధం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో వెలిగించడానికి జాతీయజెండా, ఇతర లైటింగులను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విశ్వనగరం హైదరాబాదులో పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో నభూతో నభవిష్యతి అన్న చందంగా తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న పరిపాలనాసౌధం 3 డీ యానిమేషన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Young India Skill university a role model for country

CM Revanth Appeals to Industrialists to play a key...

రాష్ట్ర సంపద పెంపునకు ఎం.ఎస్.ఎం.ఈ. పాలసీ-2024

విధానం లేకుండా అభివృద్ధి అసాధ్యంపాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిహైదరాబాద్,...

యువ వికాసానికి ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహం

ప్రజా పాలనా దినోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్హైదరాబాద్, సెప్టెంబర్ 17 :...

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...