బ్రాహ్మణ సదన్ దేశానికే ఆదర్శం కావాలి

Date:

ధార్మిక సమాచార కేంద్రంగా భాసిల్లాలి
సమీక్షలో కె.సి.ఆర్. ఆకాంక్ష
హైదరాబాద్, మే 27 :
తెలంగాణ ప్రభుత్వం, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘బ్రాహ్మణ సదన్’ దేశంలోనే మొట్టమొదటిదని ముఖ్యమంత్రి కె.సి.ఆర్. పేర్కొన్నారు. దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా ఇది నిలవాలని, సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేసే కేంద్రంగా రూపుదిద్దుకోవాలని కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు.
హైద్రాబాద్ గోపనపల్లిలో తొమ్మిదెకరాల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తిచేసుకుని ఈ నెల 31న ప్రారంభానికి ‘తెలంగాణ బ్రాహ్మణ్ సదన్’ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భవన్ ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా… తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు, సభ్యులతో సిఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…చండీయాగం, సుదర్శన యాగం నిర్వహణ, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే బ్రాహ్మణ సంఘాల నాయకులు, పీఠాధిపతులు, అర్చకులు, వేదపండితులకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి సిఎం అడిగి తెలుసుకున్నారు.
ఈ సమీక్షా సమావేశంలో..పరిషత్ అధ్యక్షుడు డా.కేవీ రమణాచారి, ఉపాధ్యక్షులు వనం జ్వాలా నరసింహారావు, సభ్యులు..డా సముద్రాల వేణుగోపాలాచారి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వి మృత్యుంజయ శర్మ, పురాణం సతీష్, మరుమాముల వెంకట రమణ శర్మ, బోర్పట్ల హనుమంతా చారి, అష్టకాల రామ్మోహన్, భధ్రకాళి శేషు, సుమలతా శర్మ, సువర్ణ సులోచన, జోషి గోపాల శర్మ, పరిషత్ సభ్య కార్యదర్శి వి. అనిల్ కుమార్, పాలనాధికారి రఘురామశర్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ… అర్చక పౌరహిత్యమే జీవనాధారంగా చేసుకుని, నిత్యం భగవత్ సేవలో నిమగ్నమౌతూ, సమస్త లోక క్షేమాన్ని కాంక్షిస్తూ తమ జీవితాలను ధారపోసే బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్య సమాజం మీద వున్నదని సిఎం అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధామ్యంగా ఎంచుకుని పలు పథకాలు అమలు చేయడం వెనక ఇదే తాత్వికత ఇమిడి వున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. నేడు తెలంగాణ ఆధ్యాత్మిక తెలంగాణ గా మారిందని, దేవాలయాల పునరుజ్జీవంతో రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు విస్తరించాయన్నారు. దాంతో ఇతర రాష్ట్రాలనుంచి తెలంగాణ రాష్ట్రానికి ఉపాధికోసం అర్చకులు పురోహితులు వేద పండితులు వలస వస్తున్నారని సిఎం తెలిపారు. అన్ని వర్గాలతో పాటు నేడు తెలంగాణ బ్రాహ్మణుకూ ఉపాథి కేంద్రంగా మారిందన్నారు.

బ్రాహ్మణ సమాజానికి భరోసా దొరికిందన్నారు.
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుతెన్నులను సిఎం కేసీఆర్ కు పరిషత్ అధ్యక్షులు ఈ సందర్భంగా వివరించారు. సంక్షేమ పరిషత్ ఏర్పడిన నాటినుంచి నేటి వరకు సుమారు 6500 కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని తెలిపారు. కాగా ప్రస్థుతం అమలు చేస్తున్న పథకాలకు అధనంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను పేద బ్రాహ్మణులకు ఆసరా అందించేలా రూపొందించాలని సిఎం అన్నారు.ఈ దిశగా చర్యలు చేపట్టాలని పరిషత్ సభ్యులకు సిఎం కేసీఆర్ సూచించారు.
తెలంగాణ బ్రాహ్మణ సదన్ దేశానికే ఆదర్శవంతమైన రీతిలో సమగ్రరీతిలో సమస్త ఆధ్యాత్మిక ధార్మిక సమాచార కేంద్రంగా పరిఢవిల్లాలని సిఎం తెలిపారు. ఆధ్యాత్మాక సాహిత్యానికి, క్రమతువులకు సంబంధించిన సమాచారాన్ని దేశం నలుమూలల నుంచి సేకరించి పుస్తకాలు,డిజిటల్ రూపంలో భధ్రపరచి అందరికి అందుబాటులో వుంచాలని సిఎం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రాష్ట్ర సంపద పెంపునకు ఎం.ఎస్.ఎం.ఈ. పాలసీ-2024

విధానం లేకుండా అభివృద్ధి అసాధ్యంపాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిహైదరాబాద్,...

యువ వికాసానికి ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహం

ప్రజా పాలనా దినోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్హైదరాబాద్, సెప్టెంబర్ 17 :...

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...

Anti- defection laws need a review

(Dr Pentapati Pullarao) There is much news when MLAs or...