జాతీయ పతాకాన్ని ఎగరేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 2: ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచారు. అనంతరం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రగతి భవన్ నుండి బయలుదేరి వెళ్ళరు. అమర వీరులకు నివాళులు అర్పించారు.








