Tuesday, March 28, 2023
Homeటాప్ స్టోరీస్కేసీఆర్ ర‌ణ దుందుభి

కేసీఆర్ ర‌ణ దుందుభి

కేంద్రం అసంబద్ధ వైఖరిపై సమరశంఖం
స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న సీఎం కేసీఆర్‌
హైద‌రాబాద్‌, జూలై 15:
తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు మ‌రోసారి త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. కేంద్రం అనుస‌రిస్తున్న అసంబంద్ధ వైఖ‌రిపై స‌మ‌ర శంఖాన్ని పూరించ‌నున్నారు. ఆ దిశ‌గా అడుగులు వేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. కలిసివచ్చే అన్నిరాష్ట్రాల విపక్ష పార్టీలను సమన్వయం చేసుకుంటూ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వంపై ప్రజాస్వామిక సమరశంఖాన్ని పూరించాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు.

దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్ ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత్నాలకు మరింత పదును పెట్టే దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలోకి దేశాన్ని నెట్టివేస్తున్న కేంద్ర వైఖరిని తేటతెల్లం చేసేలా కసరత్తు చేస్తున్నారు.

పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని బిజెపి కేంద్ర ప్రభుత్వ దమనీతి పై పోరాటం ప్రారంభించాల‌ని కేసీఆర్ దృఢ నిశ్చ‌యంతో ఉన్నారు. బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామిక దమననీతిని తీవ్రంగా ఖండిస్తూ.. దేశవ్యాప్త నిరసనలతో కేంద్రం అసలు స్వరూపాన్ని నగ్నంగా నిలబెట్టేందుకు సన్నద్ధమౌతున్నారు. ఇందుకోసం ఆయ‌న దేశంలోని వివిధ‌ రాష్ట్రాల విపక్ష నేతలతో ఫోన్లో మంతనాలు ప్రారంభించారు.

శుక్రవారం నాడు పలువురు ముఖ్యమంత్రులతో మాట్లాడారు. జాతీయ నేతలతో చర్చలు కొన‌సాగిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీతో.,ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తో., తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సన్నిహితులతో, బీహార్ ఆర్జెడీ నేత తేజస్వీయాదవ్ తో ., యుపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్ తో., శరద్ పవార్ సహా ఇతర జాతీయ విపక్ష నేతలతో స్వయంగా ఫోన్లో కేసీఆర్ స్వయంగా మాట్లాడారు.

కేంద్రంపై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా సిఎం కెసిఆర్ ప్రతిపాదనలకు వివిధ‌ రాష్ట్రాల విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు.


కేంద్రం మెడలువంచి దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడే దిశగా అన్ని విపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగే దిశ‌గా మంతనాలు సాగుతున్నాయి.

అటు వరదలనుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మంత్రులు అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూనే ఇటు బిజెపి అప్రజాస్వామిక విధానాల విపత్తునుంచి దేశాన్ని కాపాడేందుకు పార్లమెంట్ వేదికల పై పోరాటానికి సమాయత్తమ‌వుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ