Tuesday, March 21, 2023
Homeతెలంగాణ వార్త‌లుకేసీఆర్‌తో కూసుకుంట్ల భేటీ

కేసీఆర్‌తో కూసుకుంట్ల భేటీ

కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మునుగోడు ఎమ్మెల్యే
అభినందించిన ముఖ్య‌మంత్రి
హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 07:
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

తనకు అవకాశమిచ్చి తన విజయానికి కారణమైనందుకు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ., సిఎం కెసిఆర్ గారికి కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల కు శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్ శాలువాతో ఆయనను సత్కరించి దీవించారు.


కాగా…మునుగోడు అభ్యర్థి విజయం కోసం కృషి చేసినందుకు పార్టీ నేతలను సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా అభినందించారు. పార్టీ మీద, నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని సిఎం పేర్కొన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యాచరణలో పెట్టేందుకు పూనుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. సంబంధిత శాఖల మంత్రులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని సిఎం కెసిఆర్ ఆదేశించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జి. జగదీశ్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రతినిధులు పలుపురు పార్టీ నేతలు సిఎం కెసిఆర్ ను కలిసారు.

సిఎం ను కలిసిన వారిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునిత, బొల్లం మల్లయ్య యాదవ్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, పైల్ల శేఖర్ రెడ్డి, సైదిరెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎం.సి కోటిరెడ్డి, పార్టీ నేత సోమా భరత్ కుమార్, ఉమా మాధవరెడ్డి చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు, మేడె రాజీవ్ సాగర్, ఎ. సందీప్ రెడ్డి, మందాడి సైదిరెడ్డి చాడా కిషన్ రెడ్డి, వేంరెడ్డి నర్సింహారెడ్డి, శంకర్ తదితరులున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ