జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు

Date:

తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణ‌యం
ప్ర‌జారోగ్యంపై సీఎం ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌
హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 17:
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 తారీకు నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి కంటి వెలుగు కార్యక్రమ అమలు తీరు, నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నమూనాల పరిశీలన, ప్రజారోగ్యం వైద్యం అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…‘‘ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. ముఖ్యంగా తమ కంటి చూపు కోల్పోయిన పేదలైన వృద్ధులకు కంటి వెలుగు పథకం ద్వారా కంటి చూపు అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి కండ్లజోడు లు అందించింది. తద్వారా వారు పొందిన ఆనందానికి అవధులు లేవు.

పేదల కన్నుల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం. గతంలో అందించిన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి కావాల్సిన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు అందిస్తాం…’’ అని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన సిబ్బందిని కండ్లద్దాలు పరికరాలు తదితర అవసరమైన వ్యవస్థ‌లను ఏర్పాటు చేసుకోవాలని సిఎం సూచించారు.
ఈ సమీక్షలో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్ రెడ్డి, బాల్క సుమన్, కంచర్ల భూపాల్ రెడ్డి, జి.విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనా చారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, హెల్త్ సెక్రటరీ రిజ్వి, డీఎంఈ రమేశ్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ శ్వేతా మహంతి., ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...

నష్టం అపారం … కావాలి కేంద్ర ఆపన్న హస్తం : రేవంత్

ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలికేంద్రం తక్షణ సాయం అందించాలిప్రాథమిక అంచనాల ప్రకారం...