జోరుగా హుషారుగా షికారు పోదమ…

Date:

ఈ మాటలు వినగానే ఏ ఎన్‌ ఆర్‌ పాట గుర్తుకు వస్తుంది.
అవును
ఆ పాటే ఈ సినిమా పేరు.
అక్కినేని శతజయంతి అంటే సెప్టెంబర్‌ 20, బుధవారం, 2023 న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఆవాస హోటల్‌ జరిగింది.
ఈ సినిమాలో జోరు, హుషారులతో పాటు భారతదేశమంతా షికారు చేసి వస్తాం. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.
ఎం ఆర్‌ ప్రొడక్షన్స్‌..
ఈ పేరు వినగానే అందరికీ మంచి లఘుచిత్రాలు గుర్తుకు వస్తాయి.
విలువలతో కూడిన క్లీన్‌ చిత్రాలు తీయటం వీరి ప్రత్యేకత.


ఈ బ్యానర్‌ మీద –
సుభాష్‌ చంద్ర, ధీరజ్‌ రాజ్‌ జంటగా వంద లఘుచిత్రాలు తీసి యువతకు చేరువయ్యారు.
ఇప్పుడు వెండితెర మీదకు అడుగు పెడుతున్నారు.
సుమారు నాలుగు సంవత్సరాల క్రితం ఈ చిత్రానికి తొలి అడుగు వేశారు.


ఈ నాలుగేళ్లలో ఆ తొలి అడుగు అనేక అడుగులు వేసింది.
మధ్యలో కోవిడ్‌ కారణంగా అసలు అడుగులు వేయలేకపోయినా… ధైర్యం కోల్పోకుండా ప్రారంభించిన పనిని విజయవంతం చేసుకున్నారు.
ఈ చిత్రానికి ప్రవీణ్‌ నిర్మాతగా ఉన్నారు.
విజయవాడ సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో చదువుకుని, అమెరికాలో స్థిరపడిన ప్రవీణ్‌ మంచి నిర్మాతగా చలన చిత్రరంగంలో తొలి రూపాయి ఖర్చు చేస్తున్నారు.

నాగవంశీ…
ఎం ఆర్‌ ప్రొడక్షన్స్‌ తీసిన లఘుచిత్రాలకు సంగీతం అందించారు. వీరు తీసిన పెళ్లి పుస్తకం లఘుచిత్రం పాటలు అందరి మనసులను అలరించాయి. ఇప్పుడు ఈ వెండి తెర చిత్రానికి బంగారంలాంటి సంగీతం సమకూర్చారు.


సంతోష్‌ శోభన్, ఫల్గుణి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ ఫస్ట్‌ లుక్‌ను ప్రముఖ దర్శకులు క్రిష్‌ రిలీజ్‌ చేశారు.
ఈ సినిమా మళ్లీ పాత రోజులను గుర్తుకు చేస్తుందని దర్శకుడు సుభాష్‌ చంద్ర ఆనందంగా చెబుతున్నారు.


ఈ కార్యక్రమానికి సుమ కనకాల ప్రయోక్తగా వ్యవహరించారు.
విలక్షణంగా…
భారతదేశ పటం వచ్చి, దాని మీదుగా ఎంఆర్‌ ప్రొడక్షన్స్‌ అని రాసిన బస్సు ప్రయాణిస్తున్నట్లుగాను, రైలు, విమానం, ఎయిర్‌ బెలూన్, రైలు టిక్కెట్స్‌… అన్నీ చూస్తుంటే మనం ప్రయాణిస్తున్న భావన కలిగింది.


ఎక్కడా కొత్త దర్శకుడు అనే భావన కలుగకుండా, ఎంతో అనుభవం కలిగిన దర్శకుడిగా కనిపిస్తున్న సుభాష్‌ చంద్ర, తనకు ‘కె. విశ్వనాథ్‌’ గారంటే ఇష్టమని చెబుతున్నారు. ఈ యువ దర్శకుడి నుంచి కూడా అటువంటి చిత్రాలే వస్తాయని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...

Anti- defection laws need a review

(Dr Pentapati Pullarao) There is much news when MLAs or...

Onam the festival of Colors and Flowers

(Shankar Raj) Kerala in many ways is a strange state....

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...