లార్డ్స్ టెస్ట్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం

0

లార్డ్స్‌, ఆగ‌స్టు 16: ఇంగ్లండ్-భార‌త్ మ‌ధ్య జ‌రిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. 272 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ వ‌రుస‌గా వికెట్ల‌ను కోల్పోయింది. ఒక ద‌శ‌లో భార‌త్ విజయం ఖాయ‌మ‌నుకున్నారు. కానీ ఈ జోడీ విజ‌యానికి అడ్డుగోడ‌గా నిలిచింది. బుమ్రా ఈ జోడీని విడ‌దీసి, విజ‌యాన్ని ఖాయం చేశాడు. తొలి ఇన్నింగ్సులో భార‌త్ 364 ప‌రుగులు చేయ‌గా ఇంగ్లండ్ 391 ప‌రుగులు చేసి, 27 ప‌రుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్సులో భార‌త్ 8 వికెట్ల న‌ష్టానికి 298 ప‌రుగులు చేసి, డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్ 129, రోహిత్ 83 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచారు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో రూట్ 183 ప‌రుగుల చేశారు. రెండో ఇన్నింగ్సులో బుమ్రా, సిరాజ్ మూడేసి వికెట్లు ఇషాంత్ శ‌ర్మ‌, రెండేసి వికెట్లు, ష‌మీ ఒక వికెట్ ప‌డగొట్టారు. వ‌రుస బంతుల్లో సిరాజ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టి, భార‌త్ విజ‌యం సాధించేస్తుంద‌నే ఆశ క‌ల్పించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here