మైనారిటీల సంక్షేమానికి పదేళ్లలో 12 వేల కోట్లు

Date:

ఇఫ్తార్ విందులో తెలంగాణ సీఎం కె.సి.ఆర్.
హైదరాబాద్, ఏప్రిల్ 12 :
చిత్తశుద్దితో గట్టి సంకల్పంతో కార్యాన్ని ప్రారంభించినప్పుడు గమ్యాన్ని చేరుకోవడానికి కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యం అవుతుండవచ్చగానీ గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఖాయం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పోరాడినట్లుగానే ఉజ్వల భారతదేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి లక్ష్యం చేరుకోవడం తథ్యమని..‘ అల్లా కే ఘర్ దేర్ హై లేకిన్ అంధేర్ నహీ’ అని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు ఎల్బీ స్టేడియం కు చేరుకున్న సీఎం కేసీఆర్ తొలుత అనాధ పిల్లలతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు, వారి చదువు వివరాలను సిఎం అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో ఇంగ్లీషు భాషలో సంభాషిస్తుంటే ఆనందిస్తూ వారితో ముచ్చటించారు. వారి ఇంగ్లీషు భాషా పరిజ్జానాన్ని సిఎం అభినందించారు. ఇంకా గొప్పగా చదవి ఉన్నతస్థాయికి చేరుకోవాలని భుజం తట్టారు. వారితో చేయి చేయి కలిపి వారి ఆనందాన్ని పంచుకున్నారు.


సభా వేదికను అలంకరించిన సీఎం కు మైనార్టీస్ వెల్ఫేర్ కమిషనర్ షఫీ ఉల్లా, మైనార్టీస్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎ.కె.ఖాన్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఘన స్వాగతం పలికి, జ్ఞాపికతో పాటు భారతదేశ పటంలో సీఎం కేసీఆర్ గారిని చిత్రించిన ఫోటోను బహుకరించారు. అనంతరం ముస్లిం మత పెద్దలను పేరు పేరునా పలకరించి అభివాదాలు తెలిపారు.
అప్పటికే ఎల్ బీ స్టేడియం సభా ప్రాంగణానికి భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రసంగంతో సభ ప్రారంభం అయింది. అనంతరం మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగించారు. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తన సందేశాన్ని అందించారు.


రోజా’ (ఉపవాస దీక్ష) విడిచే సమయానికి సిఎం ప్రసంగం ముగిసింది. అజాన్ పిలుపు తర్వాత ఇస్లాం సాంప్రదాయం పద్దతిననుసరించి తనతో పాటు ఆశీనులైన పలువురికి ఇఫ్తార్ విందును అందించి సిఎం కేసీఆర్ రోజా’ను విరమింపజేశారు. అనంతరం ప్రముఖులతో కలిసి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి వైస్ ఛైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, అంబర్ పేట కాలేరు వెంకటేష్, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎ.కె.ఖాన్, సీఎస్ శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్, మైనార్టీస్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, సీఎం సెక్రటరీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మైనార్టీస్ వెల్ఫేర్ కమిషనర్ షఫీ ఉల్లా, పలువురు కార్పోరేషన్ల చైర్మన్లు, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగంలోని ముఖ్యాంశాలు
• పెద్దలకు, ముస్లిం సోదరులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు
• ప్రతీ యేడు లాగే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది
• మీరందరి రాకతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. మీ అందరికీ ధన్యవాదాలు
• తొమ్మిది పదేళ్ళ క్రితం మనల్ని వెనుకబడినవారిగా పరిగణించేవారు. కానీ నేడు అల్లా దయతో, మీ అందరి ప్రార్థనలతో తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే పోటీ అనేది లేదు. ఇది నేను చెప్తున్నది కాదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
• దేశంలోనే మరే రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,17,115. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పెద్ద పెద్ద రాష్ట్రాలకంటే మనం ముందంజలో ఉన్నాం.


• తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తలసరి విద్యుత్ వినియోగం 1000 … 1050 యూనిట్లు ఉండేది. నేడది రెండింతలు పెరిగి 2100 యూనిట్లకు చేరుకున్నది. దేశంలోనే మనం అత్యున్నత స్థానంలో నిలిచాం.
• పరిశ్రమలు, ఐటి రంగంలో పురోగమిస్తున్న తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారు.


• అసదుద్దీన్ ఓవైసి తదితరులు కోరిన మేరకు అనీస్ ఉల్ గుర్బా ను అత్యద్భుతంగా నిర్మించుకున్నాం.
• బిఆర్ఎస్ కు పూర్వం ఈ ప్రాంతాన్ని 10 సంవత్సరాలపాటు కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఈ పదేళ్ళ కాలంలో వారు దాదాపు 1200 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశారు.
• బిఆర్ఎస్ ఈ పదేళ్ల కాలంలో 12000 కోట్ల రూపాయలను ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేసింది. ఇవి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెలువరించిన గణాంకాలు. అసెంబ్లీ, సెక్రటేరియట్ తో పాటు మైనార్టీ వెల్ఫేర్ సైట్ లో ఈ వివరాలను చూడవచ్చు.
• గతంలో లాగా రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు లేవు. జీవన పోరాటం లో భాగంగా బయటి రాష్ట్రాలకు వెళ్ళిన రైతులు నేడు వారి వారి ఊళ్లకు తిరిగి వచ్చారు.


• నేడు తెలంగాణ రాష్ట్రంలో 94 లక్షల ఎకరాల్లో వరి పంటను పండించుకున్నామని నేను గర్వంతో చెప్తున్నాను. మొత్తం దేశంలో సాగుచేసిన 66 లక్షల 40 ఎకరాల వరి సాగు విస్తీర్ణం కంటే ఒక తెలంగాణలోనే పండించిన వరి సాగు విస్తీర్ణం చాలా ఎక్కువ.
• త్రాగునీరు, కరెంటు సమస్యలు నేడు లేవు
• నిరుద్యోగ సమస్యను కూడా మెల్లమెల్లగా తొలగించుకుంటున్నాం.


• మనం ముందుకు సాగుతున్నాంన కానీ దేశం వెనుకబడిపోతున్నది. ఈ విషయాన్ని చెప్పేందుకు నేను ఇబ్బంది పడటం లేదు.
• కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం తీరుగా శ్రమిస్తే దేశ జిడిపి కనీసం మరో 3 లక్షల నుంచి 4 లక్షలు పెరిగేది. ఈ విషయంలో మనం దెబ్బతిన్నాం.
• ఈ రోజు దేశం అగమ్యగోచర స్థితిలో పయనిస్తున్నది. ఈ విషయం మనందరికీ తెలుసు.
• భారతదేశం మనందరిదీ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం మన దేశాన్ని కాపాడుకోవాలని నేను పెద్దలను, యువతను కోరుతున్నాను.
• చిన్న చిన్న కష్టాలు వస్తూనే ఉంటాయి.
• మీ సహకారం ఉంటే చివరి వరకు పోరాడుతూనే ఉందాం.
• ఇది తాత్కాలిక దశ. ఈ సమయంలో ఒనగూరేదేం ఉండదు. తుదకు న్యాయమే గెలుస్తుంది.

• దేవుని వద్ద ఆలస్యం కావచ్చు కానీ చేరుకోవడం తథ్యం (అల్లా కే ఘర్ మే దేర్ హే లేకిన్ అంధేర్ నహీ హే). తెలంగాణ కోసం పోరాడినట్లుగానే ఉజ్వల భారతదేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి లక్ష్యం చేరుకోవడం తథ్యం.

• ఈ దేశం మనందరిది. మనం ముందుకు సాగుదాం. ఈ దేశాన్ని సురక్షితంగా కాపాడుకుందాం. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుదాం. కానీ రాజీ పడే ప్రసక్తే లేదు.
• ఈ దేశ గంగా జమున సంస్కృతిని, ఆచార, సాంప్రదాయాలను ఎవరూ మార్చలేరు. అలా ప్రయత్నించిన వారు అంతమవుతారు. కానీ దేశం ఎన్నటికీ నిలిచే ఉంటుంది. నా మాటల పై నమ్మకం ఉంచండి.
• సమయం వచ్చినప్పుడు దేశాన్ని రక్షించుకోవడానికి శక్తిని కాకుండా యుక్తిని ప్రయోగించాలి.
• దేశాన్ని రక్షించుకోవాలని నేను మీకు విన్నవిస్తున్నాను.
• ప్రస్తుతమున్న దేశ రాజకీయ పరిస్థితులను మార్చేందుకు నేను దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాను.
• మహారాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. నా అంచనాలకు మించి ప్రజాదారణ లభిస్తున్నది
• ఈ దేశం సరైన నాయకునికి కోసం, పార్టీ కోసం వేచి చూస్తున్నదనేది స్పష్టమైంది.
• ఈ దేశాన్ని రక్షించుకునేందుకు మేం శాయశక్తుల కృషి చేస్తాం.
• యావత్ ముస్లిం సమాజానికి హృదయపూర్వకంగా మరోమారు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ ప్రసంగాన్ని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Modi’s Kurukshetra of 4 states

(Dr Pentapati Pullarao) The great Mahabharat war between Pandavs...

Kejriwal: Noble past and uncertain future

(Dr Pentapati Pullarao) Just today Kejriwal announced his future....

BJP ‘s mistakes messing up 2024 elections?

(Dr Pentapati Pullarao) There is hardly one month left for...

భలే పింగళి – పాతాళభైరవి

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ) పాతాళభైరవి… ఈ పేరే...