రైతాంగ సంక్షేమంలో స్వ‌ర్ణ‌యుగానికి బాట‌లు

Date:

కిసాన్ దివ‌స్ సంద‌ర్భంగా రైతుల‌కు కేసీఆర్ శుభాకాంక్ష‌లు
దండుగ‌న్న చోటే వ్య‌వ‌సాయాన్ని పండుగ చేశాం
సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవ‌త‌రించిన తెలంగాణ‌
హైద‌రాబాద్‌, డిసెంబ‌ర్23:
తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ళ స్వల్పకాలంలోనే, వ్యవసాయరంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలు, దేశ రైతాంగ సంక్షేమంలో స్వర్ణయుగానికి బాటలు వేసిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. “జాతీయ రైతు దినోత్సవాన్ని” (కిసాన్ దివస్) పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రాష్ట్ర, దేశ రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులకు నేటి స్వరాష్ట్రంలోని రైతు సంక్షేమం వ్యవసాయం పరిస్థితులకు హస్తిమశకాంతరం వున్నదన్నారు. వ్యవసాయరంగం పై ఆధారపడి జీవిస్తున్న రైతుల జీవితాలను గుణాత్మక దిశగా అభివృద్ధి పరిచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు అత్యద్భుత ఫలితాలనిస్తున్నాయన్నారు. మునుపెన్నడూ లేని రీతిలో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ముందు ఆ తర్వాత అనేంతగా, దేశ వ్యవసాయరంగ నమూనా మార్పున‌కు తెలంగాణ వ్యవసాయ రంగాభివృద్ధి బాటలు వేసిందని కేసీఆర్ తెలిపారు.
దండుగలా మారిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని నేడు పండుగలా మార్చడంతో పాటు,నేడు దేశానికే అన్నపూర్ణ గా, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ అవతరించడం వెనుక ఎంతో శ్రమ, మేధో మథనం దాగి ఉన్నదని సీఎం తెలిపారు
ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణకు అడుగడుగునా అడ్డుపుల్ల వేస్తూ, కేంద్రం తన రాజ్యాంగబద్దమైన బాధ్యతను విస్మరించి, తెలంగాణకు ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టిస్తున్నా, లెక్కచేయకుండా మొక్కవోని పట్టుదలతో అడ్డంకులను అధిగమిస్తూ రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. రైతుబంధు పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు.
వ్యవసాయరంగంలో సాధించే ప్రగతి సమస్త రంగాలకు చోదకశక్తిగా పనిచేస్తుందని, తద్వారా మాత్రమే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. వ్యవసాయరంగంలో అభివృద్ధిని సాధించడం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలు పటిష్టమై గ్రామీణార్థిక వ్యవస్థ బలోపేతమౌతుందని, అది “స్పిన్ ఆఫ్ ఎకానమి” కి దారి తీసి తద్వారా సుస్థిరాభివృద్ధి’ జరుగుతుందని సిఎం అన్నారు.
ప్రాథమికరంగమైన వ్యవసాయరంగంలో చోటు చేసుకునే ప్రగతి ద్వారా, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగుతుందని, దాని ప్రభావం, ద్వితీయ, తృతీయరంగాలయిన పరిశ్రమలు తదితర ఉత్పత్తి రంగాలకు, సేవారంగాలకు విస్తరిస్తుందని సిఎం వివరించారు. ఇదే సూత్రాన్ని అనుసరించి
సమస్త రంగాల్లో వృద్ధిరేటు వూహించని రీతిలో నమోదవుతూ, అటు తలసరి ఆదాయం, ఇటు జిఎస్డీపీ పెరుగుదల కు దోహదం చేసిందన్నారు.
విద్యుత్తు, వ్యవసాయం, సాగునీటి రంగంతో పాటు పలు వృత్తుల అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం వెచ్చించే ఖర్చు, సామాజిక పెట్టుబడిగా పరిణామం చెందుతుందనే శాస్రీయ ఆర్థిక విధానాన్ని తన కార్యాచరణ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించిందన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న ఇటువంటి రైతు సంక్షేమ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సిఎం కెసీఆర్ వివరించారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ఫలితాలను సాధిస్తున్న తెలంగాణ స్పూర్తితో దేశంలో కిసాన్ సర్కార్ అధికారంలోకి రావాల్సిన అవసరమున్నదని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్ ద్వారా మాత్రమే దేశ రైతాంగం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు అసలైన పరిష్కారం లభిస్తుందని సీఎం కేసిఆర్ పునరుద్ఘాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఒకే విడతలో రూ. 2 లక్షల రుణ మాఫీ: రేవంత్

తుమ్మల, పొంగులేటి ఇచ్చేది మాత్రమేఅధికారిక సమాచారంకాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎంహైదరాబాద్, జూన్...

అమరావతి ఆంధ్రుల ఆశల ఆకృతి

(వాడవల్లి శ్రీధర్)అ) అమరావతి (ఆ) ఆంధ్రప్రదేశ్ రెండూ అక్షర క్రమంలో రాజధాని...

రెండు ఫైల్స్ పై పవన్ తొలి సంతకాలు

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణవిజయవాడ, జూన్ 19 : రాష్ట్ర ఉప...

Immediate challenges to BJP and Modi

(Dr Pentapati Pullarao) There is no challenge to the Narendra...