నేనున్నాన‌నీ… నీకేం కాద‌ని…

Date:

చిన్నారి వైద్యానికి సీఎం జ‌గ‌న్ బాస‌ట‌
త‌ల్లిదండ్రుల మొర ఆల‌కించిన ఏపీ ముఖ్య‌మంత్రి
అధికారుల‌కు ఆదేశాలు జారీ
కడప, డిసెంబర్ 02 :
నిరుపేద బిడ్డ … లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని … మీరు నిశ్చితంగా ఉండాలంటూ తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చిన ఘటన శుక్రవారం సీఎం స్వంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో చోటుచేసుకుంది. ఈ సన్నివేశం బిడ్డ తల్లిదండ్రుల కంట ఆనందబాష్పాలు తెప్పించగా , సీఎం తక్షణ స్పందనకు అక్కడున్న ప్రజాప్రతినిధులు , అధికారులను ఆక‌ట్టుకున్నాయి. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకర రెడ్డి దంపతుల కుమారుడు యుగంధర్ రెడ్డికి మూడున్నర సంవత్సరాల చిరు ప్రాయంలోనే లివర్ దెబ్బతింది. చాలామంది వైద్యుల వద్దకు తిరిగారు. వైద్యుల సూచనలతో బెంగుళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రికి వెళ్లారు. ఏడు నెలలపాటు తిరిగి అన్ని పరీక్షలు చేయించారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని , పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలియజేశారు . పేదలైన దివాకర్ రెడ్డి కుటుంబం అంత పెద్ద మొత్తంలో వెచ్చించలేని స్థితి . ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని వెంకట్రామిరెడ్డిని కలిశారు . ఆయన శుక్రవారం లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు బాధిత కుటుంబాన్ని తీసుకుని వచ్చారు. దివాకర రెడ్డి దంపతులు తమ కుమారుడి అనారోగ్య పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని, మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వారికి భరోసా ఇచ్చారు . తక్షణమే బాలుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజును ఆదేశించారు. దీంతో దివాకర్రెడ్డి దంపతులు ఆనంద బాష్పాలతో ముఖ్యమంత్రికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

BJP’s southern strategy

(Dr Pentapati Pullarao) In the six southern states of Karnataka,...

తెలంగాణాలో మూడు ఫార్మా విలేజెస్

లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్ ప్రకటనహైదరాబాద్,...

I.N.D.I.A. Alliance unity going ahead  

(Dr Pentapati Pullarao) After losing the 2014 and 2019 parliament...

షావుకారు పోస్టరు వెనుక కధ

(డా. పురాణపండ వైజయంతి) మన సినిమాలలో కథానాయకుడికే ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కథానాయకుడు...