Saturday, December 10, 2022
HomeAP Newsకృష్ణ‌కు నివాళులు అర్పించ‌నున్న జ‌గ‌న్‌

కృష్ణ‌కు నివాళులు అర్పించ‌నున్న జ‌గ‌న్‌

హైద‌రాబాద్‌కు బుధ‌వారం ప‌య‌నం
అమ‌రావ‌తి, న‌వంబ‌ర్ 15:
సినీ న‌టుడు సూప‌ర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించ‌డానికి ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బుధ‌వారం హైద‌రాబాద్ వెడుతున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 11.20 గంటలకు పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకుంటారు. అక్కడ సూపర్‌స్టార్‌ కృష్ణ పార్ధివ దేహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. తొలుత మంగ‌ళ‌వారం జ‌గ‌న్ త‌న దిగ్భ్రాంతిని వ్య‌క్తంచేశారు. ఆయ‌న ఆంధ్ర జేమ్స్‌బాండ్‌గా పేరుపొందిన కృష్ణ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో కాలం ప‌నిచేశార‌న్నారు. అల్లూరి సీతారామ‌రాజు చిత్రంలో ఆయ‌న న‌ట‌న నిరుప‌మానమన్నారు. ఆయ‌న మృతికి జ‌గ‌న్ సంతాపం తెలిపారు. కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి వ్య‌క్తంచేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ