Sunday, October 2, 2022
Homeటాప్ స్టోరీస్చంద్ర కుమార్తె చిత్ర‌క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌

చంద్ర కుమార్తె చిత్ర‌క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌

హైద‌రాబాద్‌, జూలై 3: చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాల‌రీలో శ్రీమతి లాలిమ నాయిర్ చిత్రకళా ప్రదర్శన ప్రారంభ‌మ‌య్యింది. ప్రదర్శనలో 20 వర్ణ చిత్రాలను ఉంచారు. శ్రీమతి లాలిమ దివంగత ప్రఖ్యాత చిత్రకారులు చంద్ర రెండో కుమార్తె. వివాహానంతరం భర్త శ్యామ్ నాయిర్‌తో కలిసి టోక్యోలో స్థిర పడ్డారు. ఈమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వీరు హైదరాబాద్ లో చిత్ర క‌ళా ప్రదర్శన ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి.

చిత్రాలను చూస్తూ వుంటే తండ్రి వారసత్వం వచ్చినట్లే అనిపిస్తుంది.

ఆంగ్లంలో పిల్లల కధలు రాయటం, ఆ కధలకు బొమ్మలు వేయటంలో కూడా సిద్ధహస్తురాలని చెప్పుకోవచ్చు. ఈమె కుమార్తె కుమారి ఆద్య కూడా తాత‌, తల్లుల మార్గంలో బాగా అభిరుచి కన‌బరచడం అభిననందించ తగ్గ విశేషం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ