విత్త‌నం నుంచి పంట అమ్మ‌కం వ‌ర‌కూ రైత‌న్న‌కు తోడు

Date:

వ్య‌వ‌సాయం మెరుగున‌కు ప‌నిముట్లు ఆర్బీకేల్లో అందుబాటులో
ఆర్బీకేల‌కు 3800 ట్రాక్ట‌ర్ల అంద‌జేత‌
320 కంబైన్ హ‌ర్వెస్ట‌ర్ల పంపిణీ ఆరంభం
వైయ‌స్ఆర్ యంత్ర సేవా ప‌థ‌కానికి శ్రీ‌కారం
గుంటూరు, జూన్ 7:
వైయస్సార్‌ యంత్ర సేవా పథకాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం గుంటూరులో ప్రారంభించారు. వైయస్సార్‌ యంత్రసేవాపథకం రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీలో భాగంగా 3800 ఆర్బీకే స్ధాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్‌ స్ధాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీని ఆరంభించారు. మెగా పంపిణీని జెండా ఊపి సీఎం ప్రారంభించారు. దీనితో పాటు 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175 కోట్ల స‌బ్సిడీని సీఎం జమ చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ప్ర‌సంగించారు. విత్త‌నం నుంచి పంట అమ్మ‌కం వ‌ర‌కూ ప్ర‌తి ద‌శ‌లోనూ రైతుకు తోడుగా ఉండేందుకు గాను రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ నిర్మించామ‌ని చెప్పారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఆర్బీకేలు ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా ఉంటూ.. విత్తనం సరఫరా నుంచి పంట కొనుగోలు వరకూ తోడుగా నిలబడుతున్నాయని చెప్పారు.


సీఎం ప్ర‌సంగ పాఠం
10,750 రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయం ఇంకా మెరుగుపర్చేందుకు, రైతుకు కావాల్సిన పనిముట్లన్నీ కూడా ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే, అదే గ్రామాల్లోనే తక్కువ ధరలోనే వారికి అందుబాటులో వచ్చేందుకు రైతులతోనే గ్రూపులు ఏర్పాటు చేసి ఆ రైతులకే ప్రభుత్వం తరపున 40 శాతం రాయితీ ఇస్తున్నాం. మరో 50 శాతం రుణాలు తక్కువ వడ్డీకే బ్యాంకులతో మాట్లాడి మంజూరు చేయిస్తున్నాం. రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు.. వాళ్లకు గ్రామంలో వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లతో సహా ఉపకరణాలన్నీ కూడా ఆర్బీకే పరిధిలోనే సరసమైన ధరలకే అందుబాటులో ఉంచే గొప్ప కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టామ‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఇందులో భాగంగానే ఈరోజు రూ.2016 కోట్లతో ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ రూ.15 లక్షలు విలువగల 10,750 వైయస్సార్‌ యంత్రసేవా కేంద్రాలను స్ధాపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామ‌ని తెలిపారు. ఇవి కాక వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కోక్కటి రూ.25 లక్షలు విలువ గల కంబైన్ హార్వెస్టర్లతో కూడిన 1615 క్లస్టర్‌ స్ధాయి యంత్రసేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్న‌ట్లు వివ‌రించారు.


రాబోయే రోజుల్లో 10,750 ఆర్బీకేల్లోనూ సేవలు…
ఇవాళ ఆర్భీకే స్ధాయి యంత్రసేవాకేంద్రాలకు 3800 ట్రాక్టర్లను అందజేస్తున్నాం. రాబోయే రోజుల్లో 10,750 రైతు భరోసా కేంద్రాలన్నింటికీ కూడా ఈ సేవలన్నీ విస్తరిస్తాం. అందులో భాగంగా ఈ రోజు 3,800 ట్రాక్టర్లతో పాటు 1140 ఆర్బీకే స్ధాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ యంత్రపరికరాలను కూడా అందిస్తున్నామ‌ని చెప్పారు. క్లస్టర్‌ స్దాయి యంత్రసేవా కేంద్రాలకు 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.


స‌బ్సిడీ బ్యాంకు ఖాతాల్లోకి..
5,260 రైతు గ్రూపుల బ్యాంకుల ఖాతాల్లోకి రూ.590 కోట్లు విలువచేసే సామాన్లుకు సంబంధించిన…. రూ.175 కోట్ల సబ్సిడీని కూడా ఈ కార్యక్రమంలోనే వారి ఖాతాల్లోకి బటన్‌ నొక్కి జమ చేస్తున్నట్లు జ‌గ‌న్ చెప్పారు.


రాష్ట్ర వ్యాప్తంగా నేడు పంపిణీ చేస్తున్న వ్యవసాయ యంత్రపరికరాలన్నీ కలిపి ఇప్పటికి 6780 ఆర్బీకేల్లోకి, మరో 391 క్లస్టర్‌ స్దాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లకు దాదాపు రూ.700 కోట్ల విలువ గల ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసినట్లవుతుందన్నారు.


రాబోయే రోజుల్లో సంవత్సరం తిరక్క మునుపే రూ.2016 కోట్ల విలువ చేసే వ్యవసాయ పరికరాలను ఆర్బీకేల పరిధిలో రైతుల చేతుల్లో పెడ‌తామ‌ని తెలిపారు. ఒక చిన్న తేడాను గమనించమని ప్రతి రైతన్నను కోరుతున్నాను. ఇదే కార్యక్రమంలో భాగంగా గతంలో చంద్రబాబునాయుడు గారి హయాంలో అరకొర ట్రాక్టర్లు ఇచ్చారు. అవి కూడా రైతులు ఎవరూ కూడా వాళ్లు ట్రాక్టర్ల ఆర్డర్లు ప్లేస్‌ చేయలేదు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబునాయుడు గారు అంతా కలిసికట్టుగా ట్రాక్టర్ల డీలర్లతో స్కామ్‌లు చేశారు. అప్పటికీ ఇప్పటికీ తేడాను గమనించండి. ఈ రోజు ట్రాక్టర్‌ దగ్గర నుంచి ఏ పనిముట్టు కావాలన్నా నేరుగా రైతు ఇష్టానికి వదిలిపెట్టాం. రైతు ఏ ట్రాక్టర్‌నైనా తనకు నచ్చిన కంపెనీ, తనకు నచ్చిన పనిముట్టు తానే ఆర్డర్‌ ప్లేస్‌ చేస్తాడు. సబ్సిడీ ప్రభుత్వం రైతుకు ఇస్తుందని జ‌గ‌న్ వివ‌రించారు.


అవినీతి లేకుండా..
అందులో భాగంగానే ఇవాళ రూ.175 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామ‌నీ, అవినీతి లేకుండా ఏ రకంగా వ్యవస్ధను క్షాళ‌న‌ చేస్తున్నామో… గమనించాల‌ని తెలిపారు. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా గ‌మ‌నించాల‌ని రైతుల‌ను జ‌గ‌న్ కోరారు. ఇవాళ 175 ట్రాక్టర్ల మోడళ్లలో రైతులకు నచ్చిన మోడల్‌ కొనుగోలు చేసే అవకాశం క‌ల్పించామ‌ని చెబుతూ సీఎం వైయస్‌.జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...

ఐ.పి.ఎల్. బాటలో ఎస్.పి.ఎల్.

ఇండియన్స్ చేతిలో స్మాషర్స్ స్మాష్(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)క్రికెట్ ఇండియాలో ఒక ప్యాషన్. ఐదేళ్ల...