Tuesday, June 28, 2022
HomeAP Newsనేడు విక్ర‌మ్ రెడ్డి నామినేష‌న్‌

నేడు విక్ర‌మ్ రెడ్డి నామినేష‌న్‌

ఆత్మ‌కూరు స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్‌
అమ‌రావ‌తి, జూన్ 2:
నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు శాస‌న స‌భా స్థానానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి గురువారం నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వ‌హించాల్సి వ‌చ్చింది. మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి కుమారుడైన గౌత‌మ్ రెడ్డి దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొని వ‌చ్చిన అనంత‌రం అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కార్డియాక్ అరెస్ట్ కార‌ణంగా ఆయ‌న క‌న్నుమూశారు.

గౌత‌మ్ రెడ్డి సోద‌రుడే విక్ర‌మ్ రెడ్డి. విక్ర‌మ్ రెడ్డి బుధ‌వారం నాడు ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసి, త‌న‌కు టికెట్ కేటాయించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆయ‌న‌కు సీఎం బి ఫార‌మ్ అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ నేత‌లు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర‌రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, కాకాని గోవ‌ర్ధ‌న రెడ్డి పాల్గొన్నారు. విక్ర‌మ్ రెడ్డిని సీఎం జ‌గ‌న్ అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments