Tuesday, June 28, 2022
HomeAP Newsజ‌గ‌న్ ప్ర‌భుత్వానికి బాల‌కృష్ణ వార్నింగ్‌

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి బాల‌కృష్ణ వార్నింగ్‌

అధికారం కోసం కులాల‌ను రెచ్చ‌గొడుతున్నారు
గుళ్ళో లింగాన్ని సైతం మింగుతున్నార‌ని ఆరోప‌ణ‌
నిమ్మ‌కూరు, తెనాలి, మే 28:
శ‌త‌జ‌యంతి వేడుక వేదిక‌గా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ప్ర‌ముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ వార్నింగ్ ఇచ్చారు. కులాల‌ను రెచ్చ‌గొడుతున్నార‌నీ, కొంచెం ఆలోచించుకోవాల‌నీ కోరారు. గుడినీ, గుళ్ళో లింగాన్నీ మింగే ప్ర‌భుత్వం ఇద‌ని విమ‌ర్శించారు. అధికారం కోసం కులాల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని ఆరోపించారు. ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంవ‌త్స‌రం సంద‌ర్భంగా కృష్ణా జిల్లా నిమ్మ‌కూరులో ఏర్పాటైన కార్య‌క్ర‌మంలో బాల‌కృష్ణ ప్ర‌సంగించారు. దేశమంటే మ‌ట్టికాదోయ్‌…దేశ‌మంటే మ‌నుషులోయ్ అనేది ఒక‌ప్ప‌టి నినాదం ఇప్పుడు దేశమంటే మ‌నుషులు కాదు మ‌ట్టోయ్ గా మారింద‌ని బాల‌కృష్ణ ఆవేద‌న వ్య‌క్తంచేశారు. ఓటు అంటే నోటు కాద‌ని తెలుసుకోవాల‌ని కోరారు. ప్ర‌జ‌లు ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఓటును త్వ‌ర‌బ‌డి దుర్వినియోగం చేసుకోవద్ద‌న్నారు. ఒక్క చాన్స్ అని జ‌గ‌న్ అడిగారు… మీరొక త‌ప్పిదం చేశారు. అనుభ‌విస్తున్నారు…ఓటును స‌ద్వినియోగం చేసుకుంటేనే నీకు గుడి…బ‌డి అంటూ ప్ర‌జ‌లనుద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు వారి ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన వ్య‌క్తి ఎన్టీఆర్ అని ప్ర‌శంసించారు. మ‌రోప‌క్క హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ఫిల్మ్ న‌గ‌ర్‌లో శ్రీ‌కృష్ణుని రూపంలో త‌యారుచేసిన ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు, సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments