దేశాభివృద్ధికి ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళికే శ‌రణ్యం

Date:

రాజ‌కీయ పార్టీల ఏకీక‌ర‌ణ‌కు కేసీఆర్ య‌త్నం
అన్ని రంగాల్లో సంస్క‌ర‌ణ‌ల‌కు పిలుపు
ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌పై కేంద్ర ప్రభుత్వాల వ్యూహాత్మ‌క దాడి
రాష్ట్రాల అధికారాల‌ను పున‌ర్నిర్వచించాలి
దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న తెలంగాణ సీఎం
(వ‌నం జ్వాలా న‌ర‌సింహారావు, 8008137012)
తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు ఒక స్ప‌ష్ట‌మైన ప్ర‌త్యామ్నాయ అజెండాను రూపొందించుకున్నారు. ఆ అంశం ఆయన‌ చేస్తున్న ఢిల్లీ, త‌దిత‌ర రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌లో వెల్ల‌డైంది. త‌న‌లాగే ఆలోచించే రాజ‌కీయ నేత‌ల‌ను క‌ల‌వ‌డం, స‌హ‌కారాత్మ‌క స‌మాఖ్య‌ను రూపొందించుకునే ఉద్దేశం దీని వెనుక క‌నిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో త్వ‌ర‌లోనే సంచ‌ల‌నం న‌మోద‌వుతుంద‌ని త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో నాయ‌కుల‌ను క‌లుస్తున్న సంద‌ర్భంలో సూచ‌నప్రాయంగా చెబుతున్నారు. కొత్త విధానాల‌ను అమలు చేసేట‌ప్పుడు రాష్ట్రాల‌ను కేంద్రం సంప్ర‌దించాల్సిన అవ‌స‌రాన్ని కేసీఆర్ నొక్కి చెప్పారు. కో ఆప‌రేటివ్ ఫెడ‌రలిజ‌మ్ (స‌హ‌కార స‌మాఖ్య విధానం) స్ఫూర్తి పెంపొందాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని కేసీఆర్ సూచిస్తున్నారు. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించే వెసులుబాటును రాజ్యాంగం కేద్రం ప్ర‌భుత్వానికి క‌ల్పించింది. అవ‌స‌ర‌మైతే రాష్ట్రాల‌ను సంప్ర‌దించ‌డం అవ‌స‌రం లేని ప‌క్షంలో ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యించ‌డం చేయ‌వ‌చ్చు. కొంత‌కాలంగా మ‌న దేశం ఉదార‌మైన స‌హ‌కార స‌మాఖ్య వైపు కాకుండా ఏక‌ప‌క్ష విధానాల వైపే ఎక్కువ‌గా మొగ్గు చూపుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.


ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌పై అనుస‌రించిన విధానం ఇప్పుడు అనుస‌రిస్తున్న‌దీ భిన్నంగా ఉన్నాయి. మోడీ అప్పుడు అనుస‌రించి వైఖ‌రి స‌మంజ‌స‌మైన‌ది. మ‌న‌కు కావాల్సింది నిర్బంధ స‌మాఖ్య కాదు స‌హ‌కార స‌మాఖ్య అనేది అప్ప‌ట్లో ఆయ‌న త‌న నినాదంగా మ‌లుచుకున్నారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి అయిన త‌ర‌వాత త‌న వైఖ‌రిని మార్చుకున్నారు. అంతా కేంద్రానిదే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక సంద‌ర్భాల‌లో అనేక‌ వేదిక‌ల‌పై స‌హకార ఫెడ‌ర‌లిజ‌మ్ ఈ దేశానికి అవ‌స‌ర‌మ‌ని ఎలుగెత్తి చాటారు. కో ఆప‌రేటివ్ ఫెడ‌ర‌లిజ‌మ్‌ ప్ర‌తీకాత్మ‌కంగా ప‌రిణామం చెందాల్సిన అవ‌స‌రాన్ని ప్ర‌స్తుత దేశ ప‌రిస్థితులు చాటిచెబుతున్నాయి. వివిధ సంద‌ర్భాల‌లో రుజువైన నిష్క్రియాశీల‌మైన ఒర‌వ‌డిని తునుమాడాల్సి ఉంది.


స‌హకార ఫెడ‌ర‌లిజానికి చారిత్రాత్మ‌క‌మైన పునాదులున్నాయి. రాజ్యాలు మ‌నుగ‌డ‌లో ఉన్న కాలంలో దేశం స‌మాఖ్య విధానాల‌ను క‌చ్చితంగా అనుస‌రించింది. ఆ స‌మ‌యంలో స్థానిక వ్య‌వ‌హారాల్లో రాజ్యాధికారం చలాయించేవారు కాదు. బ్రిట‌న్ ప్ర‌భుత్వం సైతం ఈస్ట్ ఇండియా వ్య‌వ‌హారాల‌ను అదుపుచేసేది త‌ప్ప‌, దాని అధికారాల్లో ఎన్న‌డూ జోక్యం చేసుకోలేదు. భార‌త ప్ర‌భుత్వ చ‌ట్టం 1919 కూడా ద్వంద్వ ప్ర‌భుత్వానికే మొగ్గుచూపింది. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సైతం రాష్ట్రాల‌తో సంప్ర‌దింపులు, స‌హ‌కారం అనే నీతిని పాటించారు. స‌హ‌కార స‌మాఖ్య అనే లక్ష్యంతోనే అప్ప‌టి ప్ర‌భుత్వం భార‌త యూనియ‌న్‌ను క‌లిపి ఉంచింది.


ఇప్పుడేం జ‌రుగుతోంది?
కానీ భార‌త్‌లో ఇప్పుడేం జ‌రుగుతోంది? రాష్ట్రాల‌కు సంబంధించిన కీల‌క‌మైన వ్య‌వ‌హారాల‌లో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకుంటూనే ఉంది. కేంద్రం కేవ‌లం విదేశీ వ్య‌వ‌హారాలు, ర‌క్ష‌ణ‌, జాతీయ ర‌హ‌దారుల నిర్వ‌హ‌ణ వంటి అంశాల‌కే రాష్ట్రాల‌లో ప‌రిమితం కావాలి. దేశ భ‌ద్ర‌త‌పైనే కేంద్రం దృష్టి కేంద్రీక‌రించాలి. విద్య‌, వైద్యం, గ్రామీణ అభివృద్ధి, స్థానిక సంస్థ‌లు, త‌దిత‌ర అంశాల బాధ్య‌త‌ల‌ను రాష్ట్రాల‌కే విడిచిపెట్టాలి.
రాజీవ్ గాంధీ హ‌యాం నుంచి ప్ర‌స్తుత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ వ‌ర‌కూ స్థానిక సంస్థ‌ల‌కు నిధుల‌ను నేరుగా బ‌దిలీ చేస్తూ, రాష్ట్రాల‌ను న‌మ్మ‌కుండా వ్య‌వహ‌రిస్తూ వ‌స్తున్నారు. ఇది తుచ్ఛ‌మైన ప‌ని. అంటూ ఇటీవ‌ల నిర్వ‌హించిన ఓ స‌మీక్ష స‌మావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా విమ‌ర్శించారు. ఇది రాష్ట్రాల‌ను అవ‌మానించ‌డ‌మేన‌న్నారు. జ‌వ‌హ‌ర్ రోజ్‌గార్ యోజ‌న‌, పీఎమ్ గ్రామ్ స‌డ‌క్ యోజ‌న‌, ఎన్ఆర్ఇజిఎ (ఉపాధి హామీ) వంటి ప‌థ‌కాల‌కు ఢిల్లీ నుంచి నేరుగా స్థానిక సంస్థ‌ల‌కు నిధుల‌ను బ‌ద‌లాయించ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు మ‌ద్ద‌తునిచ్చే చ‌ర్య కాదు. కేంద్రం కంటే రాష్ట్రాల‌కే స్థానిక స‌మ‌స్య‌లపై అవ‌గాహ‌న అధికంగా ఉంటుంది. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ సంస్థ‌లు ఇప్ప‌టికీ క‌రెంటు స‌ర‌ఫ‌రా వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాయి. ప్ర‌జ‌లు ఇంకా అంధ‌కారంలోనే ఉండాల్సి వ‌స్తోంది. మంచి నీటి స‌ర‌ఫ‌రా కోసం, సాగునీటి అవ‌స‌రాల కోసం ప్ర‌జ‌లు ఇంకా రోడ్లు ఎక్కాల్సి వ‌స్తోంది. విద్య‌, ఉద్యోగ రంగాల్లో అంచ‌నాకు అనుగుణంగా ఇప్ప‌టివ‌ర‌కూ అభివృద్ధిని సాధించ‌లేక‌పోయాం. కేంద్రం ఇలాంటి కీల‌క‌మైన అంశాల‌పై దృష్టి పెట్ట‌కుండా రాష్ట్రాల వ్య‌వ‌హారాల్లో త‌ల దూరుస్తుండ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం కాదు.


ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ఒక ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌తో ముందుకొస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఒకే ఆలోచ‌న క‌లిగిన రాజ‌కీయ శ‌క్తుల‌ను ఏకం చేయ‌డానికీ, దేశాన్ని అభివృద్ధి బాట ప‌ట్టించ‌డానికీ వీలుగా ఈ అజెండా ఉంటుంద‌నేది ఆయ‌న ప్ర‌క‌ట‌న సారాంశం. రాజ‌కీయ పార్టీల‌తో చ‌ర్చ‌ల అనంత‌రం అజెండాను రూపక‌ల్ప‌న చేసే అవ‌కాశ‌ముంది. ఇందులో ఆర్థికవేత్త‌లు, సామాజిక శాస్త్రవేత్త‌లు, రైతులు, ప్ర‌జ‌లు… ఇలా అన్ని వ‌ర్గాల వారి స‌హ‌కార‌మూ తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ మార్పు ప్రారంభ‌మ‌వుతుంద‌న‌డంలో ఎటువంటి సందేహ‌మూలేదు. వాస్త‌వ‌మైన‌ స‌హ‌కార స‌మాఖ్య విధానం గురించి కేసీఆర్ ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలను ప్రారంభించారు. స్థానిక అవ‌స‌రాలు, ఆకాంక్ష‌లు, జ‌నాభా వంటి రంగాల‌లో విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు రాష్ట్రాల ప‌రిధిలోనే ఉండేలా అజెండా ఉంటుంద‌నేది నిస్సందేహం.


తెలంగాణ బాట‌లోనే భార‌త్ కూడా కొత్త విధానాల‌ను అనుస‌రించాల్సింద‌నేది కేసీఆర్ అభిప్రాయం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనుస‌రిస్తున్న ఉత్త‌మ విధానాల‌పై అధ్య‌య‌నం చేసి, భార‌త ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వాటిని మ‌లుచుకోవాల‌ని కేసీఆర్ సూచిస్తున్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అంచ‌నా వేసి, ఒక విధాన‌ప‌ర‌మైన వ్య‌వ‌స్థ‌ను రూప‌క‌ల్ప‌న చేయడానికి వీలుగా భార‌త్ ఎక్క‌డ వెనుక‌బ‌డి ఉండో తెలుసుకోవ‌డం త‌క్ష‌ణ క‌ర్త‌వ్య‌మ‌ని కేసీఆర్ అంటున్నారు. వీట‌న్నింటిని దృష్టిలో ఉంచుకునే దేశానికి ప్ర‌త్యామ్నాయ అభివృద్ధి వ్య‌వ‌స్థ లేదా ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవాల్సి ఉంద‌ని కేసీఆర్ దృఢంగా అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ సంద‌ర్భంలోనే వివిధ రాష్ట్రాల అవ‌స‌రాలు, స‌మాజంలోని వివిధ వ‌ర్గాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకోవాల‌ని అంటున్నారు.


రాజ్యాంగాన్ని వ్య‌వ‌స్థ‌కు అనుగుణంగా మార్చాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. రిజ‌ర్వేష‌న్లు వంటి అంశాలపై రాష్ట్రాల‌కే నిర్ణ‌యాధికారం ఉండాలి. రాష్ట్ర ప్ర‌జ‌ల అవ‌స‌రాలు స్థానిక ప్ర‌భుత్వాల‌కే బాగా తెలుస్తాయి క‌న‌క ఈ అధికారం వాటికే ఉండాల‌నేది కేసీఆర్ ఆకాంక్ష‌. రాష్ట్రం అంటే ఏమిటి…స‌మాఖ్య ప్ర‌భుత్వం అంటే ఏమిటి అనే అంశాన్ని పున‌ర్నిర్వ‌చించాల్సిన స‌మ‌యం కూడా ఇదేన‌ని అంటున్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి. రాష్ట్రాల‌ను బ‌లోపేతం చేయ‌డం.. ఎక్కువ అధికారాల‌ను ఇవ్వ‌డం తప్ప‌నిస‌రి అంటున్నారు. కేంద్రం నుంచి ఎక్కువ అధికారాలు రాష్ట్రాల‌కు బ‌దిలీ కావాల‌నేది ఆయ‌న నిశ్చిత అభిప్రాయం. స‌హ‌కార స‌మాఖ్య అంటే అస‌లైన ఉద్దేశం లేదా ల‌క్ష్యం ఇదే. ఈ మేర‌కు రాజ్యాంగంలో మార్పులు చేయాలి. కేంద్ర రాష్ట్ర సంబంధాల‌లో అనేక సంస్క‌ర‌ణ‌లు చేయాల‌ని నిపుణులు ప్ర‌తిపాదించిన‌ప్ప‌టికీ, వాటిని కేంద్ర ప్ర‌భుత్వాలు ఉద్దేశ‌పూర్వ‌కంగా ప‌క్క‌న‌పెట్టి, ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి విఘాతం క‌లిగించాయి. తెలంగాణ ప్ర‌భుత్వం అభివృద్ధిలో అనేక ల‌క్ష్యాల‌ను చేరింది. సంక్షేమ‌, మౌలిక వ‌స‌తులు, వంటి రంగాల‌లో ఇది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప‌థ‌కాలు, సృజ‌నాత్మ‌క కార్య‌క్ర‌మాలు కేంద్రానికీ, ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలిచాయి. ఇవే అన్నిచోట్లా వివిధ రూపాల‌లో ప్ర‌తిబింబిస్తున్నాయి. తెలంగాణలో అమ‌లవుతున్న రైతుల‌కు ఎక‌రానికి ప‌దివేల రూపాయ‌ల సాగు పెట్టుబ‌డి ప‌థ‌కం…రైతు బంధును జాతీయ స్థాయిలో చేప‌ట్టి 40కోట్ల మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుస్తున్నారు. రైతు బీమా, ద‌ళిత బంధును కూడా దేశ‌వ్యాప్తంగా అమ‌లుచేయ‌వ‌చ్చు.


రాష్ట్రాల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ప‌థ‌కాల‌ను రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంది. సామాజిక‌, న్యాయ‌, రాజ్యాంగ‌, ప‌రిపాల‌న రంగాల‌లో నిర్మాణాత్మ‌క‌మైన మార్పుల‌ను తేవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. ఆర్థిక రంగాన్ని బ‌లోపేతం చేయ‌డం ద్వారా ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌వ‌చ్చు. మూలుగుతున్న న‌ల్ల ధ‌నాన్ని వెలికితేవ‌డానికి మార్గాల‌ను అన్వేషించాలి. ప‌న్నుల విధానంలో మ‌రిన్ని ప్రోత్సాహ‌కాలుండాలి. ప్ర‌క‌టిత ఆదాయాన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు లేదా మౌలిక వ‌స‌తుల రంగాల‌లో పెట్టుబ‌డి పెట్టేలా ఒక సుల‌భ‌సాధ్య‌మైన వ్య‌వ‌స్థ ఉండాలి. దీనివ‌ల్ల ప్ర‌భుత్వ రంగాల‌కు పెట్టుబ‌డులు వెల్లువ‌లా వ‌చ్చే అవ‌కాశ‌ముంటుంది. ఈ ర‌క‌మైన చ‌ర్య జిడిపి స్థాయిని పెంచి, ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి తోడ్ప‌డుతుంది.


పార్ల‌మెంటు, రాష్ట్ర అసెంబ్లీల ప్రాధాన్య‌త ఇందులో నిస్సందేహంగా కీల‌క‌పాత్ర వ‌హిస్తాయి. ఈ దారిలో ఎదుర‌య్యే ఆటంకాలను స‌మ‌ర్థంగా ఎదుర్కొనాలి. అవ‌స‌ర‌మైతే న్యాయ‌, త‌దిత‌ర రంగాల‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు వెనుకాడి పారిపోకూడ‌దు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌నం అనుస‌రిస్తున్న అంతా బాగుంది అనే విధాన‌మే దేశాన్ని స‌మ‌స్య‌ల కూపంలోకి నెట్టేస్తోంద‌నే వాస్త‌వాన్ని గుర్తించాలి. ఎన్నికైన ప్ర‌భుత్వ‌మే దేశానికి కీల‌కం. దాన్ని ఎన్నుకునే వ్య‌క్తులకూ, దేశాన్ని ఏలే వారికి మ‌ధ్య వ్య‌త్యాసం ఉంటుంది. ఈ వ్య‌త్యాసాన్ని గుర్తించాలి. ఏదేమైనా ఎన్నికైన ప్ర‌భుత్వానిదే తుది నిర్ణ‌య‌మ‌వుతుంది. ప్ర‌భుత్వాలు తీసుకునే నిర్ణ‌యాలు ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అనేది చ‌ర్చ‌నీయాంశం.


అనేక సంద‌ర్భాల‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌ను తాను రుజువు చేసుకున్నారు. రాజ‌కీయంలో తేడాను చూపించారు. అతీతంగా ఆలోచించి, ల‌క్ష్యాల‌ను సాధించి, ఏ నాయ‌కుడు సాధించ‌న‌న్ని విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు. ప్ర‌జా నాయ‌కుడిగా కేసీఆర్ త‌న తెగువ‌ను ప్ర‌ద‌ర్శించారు. స‌మ‌ర్థుడైన ప‌రిపాల‌కునిగా ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు. జాతీయ స్థాయిలో త‌న ఆలోచ‌న‌ల‌ను ఇటీవ‌లి కాలంలో కేసీఆర్ వెల్ల‌డిస్తున్నారు. స‌మాఖ్య స్ఫూర్తి, స‌హ‌కార స‌మాఖ్య వంటి అంశాల‌లోనూ, కేంద్ర‌, రాష్ట్రాల సంబంధాలు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఆయ‌న ప్ర‌స్తుతం చేస్తున్న ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక దేశంలో స‌హ‌కార స‌మాఖ్య‌ను క‌చ్చితంగా బ‌లోపేతం చేస్తుందన‌డంలో సందేహం లేదు. అదే ప్ర‌స్తుత త‌రుణంలో కీల‌కం. ఒకే ఆలోచ‌న తీరు క‌లిగిన రాజ‌కీయ పార్టీలు కేసీఆర్ ఆలోచ‌న‌లను స‌మ‌ర్థించాల్సిన స‌మ‌య‌మిదే. భ‌విష్య‌త్తుకు బాట‌లు వేసేది ప్ర‌త్యామ్నాయ జాతీయ ప్ర‌ణాళిక‌…అనేది నిస్సందేహం. (వ్యాస ర‌చ‌యిత తెలంగాణ సీఎం సీపీఆర్ఓ)

Jwala Narasimharao Vanam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...

ఐ.పి.ఎల్. బాటలో ఎస్.పి.ఎల్.

ఇండియన్స్ చేతిలో స్మాషర్స్ స్మాష్(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)క్రికెట్ ఇండియాలో ఒక ప్యాషన్. ఐదేళ్ల...

Fulfil drinking water needs of Hyderabad: CM

Revanth warns Millers and Traders of cancelling license  Hyderabad:  Chief...

“Who killed the rule of law?”: Highlighting Points

Book Written by Justice R.C. Chavan, Former Judge Bombay...