Monday, September 26, 2022
Homeటాప్ స్టోరీస్తిమ్మ‌క్క స‌మ‌క్షంలో ఆకుప‌చ్చ‌ని వీలునామా ఆవిష్క‌ర‌ణ‌

తిమ్మ‌క్క స‌మ‌క్షంలో ఆకుప‌చ్చ‌ని వీలునామా ఆవిష్క‌ర‌ణ‌

సాలుమ‌ర‌ద‌కు తొలి కాపీని అందించిన సీఎం కేసీఆర్‌
ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో తిమ్మ‌క్క‌కు సీఎం స‌త్కారం
హైద‌రాబాద్‌, మే 18: పచ్చదనం పెంపొందించే దిశగా, అడవుల సంరక్షణ మొక్కల పెంపకం పై తెలంగాణ ప్రభుత్వ కృషి, హరితహరం కార్యక్రమం స్ఫూర్తిగా గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి కార్యక్రమాల ద్వారా జరుగుతున్న పర్యావరణ కృషిపై .. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరీ గౌరీశంకర్ సంపాదకత్వంలో,పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం.. ‘ఆకుపచ్చని వీలునామా’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బుధ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఆవిష్కరించారు.

తొలి కాపీని పర్యావరణ పరిరక్షకురాలు పద్మశ్రీ సాలుమరద తిమ్మక్కకు సీఎం కేసిఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతూ… మొక్క నాటడమనేది ఒక కార్యక్రమం కాదని, అది మనల్ని, మన భవిష్యత్తు తరాలను బ్రతికించే మార్గమని అన్నారు.

ఆ బాధ్య‌త కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు. ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. మంచి పని లో నిమగ్నమైతే, గొప్పగా జీవించ వచ్చని, మంచి ఆరోగ్యం తో ఉంటారనటానికి పద్మశ్రీ తిమ్మక్క నిలువెత్తు నిదర్శనమని, అందరూ ఆ బాటలో నడవాలని కేసిఆర్ ఆకాంక్షించారు.


ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాహిత్య అకాడెమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


స‌మీక్ష స‌మావేశానికి తిమ్మ‌క్క‌
అంత‌కుముందు ప‌ల్లె ప్ర‌గ‌తి స‌మీక్షా స‌మావేశానికి తిమ్మ‌క్క‌ను సీఎం కేసీఆర్ తోడ్కొని వెళ్ళారు. స‌మావేశంలో పాల్గొన్న మంత్రులు,ఉన్న ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. వారందరి సమక్షంలో సీఎం కేసీఆర్ ఆమెను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తిమ్మ‌క్క ఈ సంద‌ర్భంగా ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నార‌ని తిమ్మ‌క్క అన్నారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి మొక్కలు కావాలంటే తాను అందజేస్తానని తిమ్మక్క గారు సీఎం కు తెలుపడం, పర్యావరణ పరిరక్షణ కోసం తిమ్మక్క పడుతున్న తపన,సమావేశంలో పాల్గొన్న వారిలో స్ఫూర్తిని నింపింది.


తిమ్మ‌క్క అంటే ఎవ‌రు?
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు,ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బిబిసి ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. 25 సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోవడంతో మొక్కల్నే పిల్లలుగా భావించి, మొక్కలే పిల్లలు గా, పచ్చదనం పర్యావరణ హితం కోసం తాను పనిచేస్తున్నారు.

తిమ్మక్క అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ