విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా..’ చిత్రం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఉండే స్నేహాన్ని గురించి చెప్పే లిరికల్ సాంగ్ ‘పాఠశాలలో..’ రిలీజ్

Date:

వైవిధ్య‌మైన పాత్ర‌లు, చిత్రాల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ స్టార్ విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా, మిథిలా పాల్క‌ర్, ఆశా భ‌ట్ హీరోయిన్స్‌గా న‌టిస్తోన్న న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఓరి దేవుడా’. ఒక‌వైపు కంటెంట్ బావుంటే మినిమం బ‌డ్జెట్ చిత్రాల‌నైనా, బలుపు వంటి భారీ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌నైనా, ఊపిరి వంటి ఎమోష‌న‌ల్ ఎంటర్‌టైన‌ర్స్ అయినా, మ‌హ‌ర్షి వంటి మెసేజ్ ఓరియెంటెడ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌నైనా నిర్మిస్తూ టాలీవుడ్‌లో బ‌డా నిర్మాణ సంస్థ‌గా ఇమేజ్ సంపాదించుకున్న పి.వి.పి సినిమా బ్యాన‌ర్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ‘ఓరిదేవుడా’ చిత్రం తెర‌కెక్కుతోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు ఈ చిత్రానికి సమ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
సోమవారం ‘ఓరి దేవుడా’ చిత్రం నుంచి ‘పాఠశాలలో పాత బడదురా…’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిన్ననాటి నుంచి పెద్దయ్యే వరకు ఉండే స్నేహితుల మధ్య ఉండే స్నేహం గురించి తెలియజేసేలా ఈ  సాంగ్ ఉంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ పాటను అనంత శ్రీరామ్ రాశారు. అర్మాన్ మాలిక్, సమీరా భరద్వాజ్ ఈ పాటను పాడారు. తమిళ చిత్రం ‘ఓ మై కడవులే’కి ఇది రీమేక్. డైరెక్టర్ అశ్వత్ మారి ముత్తు తెలుగు నెటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేర్పులు చేశారు. 
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలను అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వహించారు. విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా వ‌ర్క్ చేస్తున్న ఈ చిత్రానికి వంశీ కాకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌య్యింది. మ‌రో వైపు ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి. 
న‌టీన‌టులు:………………………….విశ్వక్ సేన్‌, మిథిలా పాల్క‌ర్‌, ఆశా భ‌ట్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:……………………..ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  అశ్వ‌త్ మారిముత్తుసంగీతం:  లియోన్ జేమ్స్‌సినిమాటోగ్ర‌ఫీ:  విదు అయ్య‌న్న‌మాట‌లు:  త‌రుణ్ భాస్క‌ర్‌ఎడిట‌ర్‌:  గ్యారీ బి.హెచ్‌ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  రామాంజ‌నేయులుఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  వంశీ కాక‌కో డైరెక్ట‌ర్‌:  ఇ. రామ‌స్వామిచీఫ్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌:  కృష్ణ చేపూరిఅసోసియేట్ డైరెక్ట‌ర్స్‌:  న‌వీన్, వినోద్‌, పుణ్య‌కోటిప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  బి.ఆంజ‌నేయులుప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్:  కె.కిర‌ణ్ కుమార్‌ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌:  వి.శ్ర‌వ‌ణ్‌కుమార్‌ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  క‌పిల‌న్‌స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్:  వ‌ర‌హాల మూర్తి పోమ‌టి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

తెలంగాణాలో మూడు ఫార్మా విలేజెస్

లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్ ప్రకటనహైదరాబాద్,...

I.N.D.I.A. Alliance unity going ahead  

(Dr Pentapati Pullarao) After losing the 2014 and 2019 parliament...

షావుకారు పోస్టరు వెనుక కధ

(డా. పురాణపండ వైజయంతి) మన సినిమాలలో కథానాయకుడికే ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కథానాయకుడు...

శిల్ప కాలనీలో కమ్యూనిటీ హాలుకు రూ. 25 లక్షలు

మార్చి మొదటివారంలో శంకుస్థాపనహై మ్యాస్ట్ దీపాల ప్రారంభ కార్యక్రమంలో పాండురంగారెడ్డిహైదరాబాద్, ఫిబ్రవరి...