విశ్వ‌నాథ ప్ర‌థ‌మ శిష్యుడు జివి సుబ్బారావు క‌న్నుమూత‌

Date:

శేషేంద్ర శ‌ర్మ ప్ర‌శంస‌లందుకున్న ర‌చ‌యిత‌
హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 28:
ప్ర‌ముఖ ర‌చ‌యిత గుఱ్ఱ‌ప్ప‌డి వెంక‌ట సుబ్బారావు (జివి సుబ్బారావు) ఇటీవ‌ల క‌న్నుమూశారు. మహాకవి అని శేషేంద్రశర్మ ప్రశంసలందుకున్న ర‌చ‌యిత ఆయ‌న‌. విశ్వనాథ స‌త్య‌నారాయ‌ణ గారి ప్ర‌థ‌మ శిష్యునిగా పేరు గాంచారు. మహాకవి అని మహాకవి శేషేంద్ర శర్మ ప్రశంసలందుకున్నారు. ఆయన అంతగా చాలామందికి తెలియదు. తన సాహితీ ప్రతిభ గురించి తన పద్యకవితా ప్రాశస్త్యం గురించి ప్రచారం చేసుకోలేదు. ప్రముఖ సాహితీ వేత్త దుగ్గిరాల రామారావు ఈయన పద్యకవితాధార గంగా ప్రవాహమని ప్రస్తుతించారు. మంచికవి, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడు గుఱ్ఱప్పడి వేంకట సుబ్బారావు (జివి సుబ్బారావు తమ 92 వ ఏట ఈనెల 24న అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాత ఏ విధమైన అనారోగ్యం లేకుండా ప్రశాంతంగా నిద్రలోనుంచి దీర్ఘనిద్రలోకి వెళ్లిపోయారు. 25 సెప్టెంబర్ 1929 నాడు నెల్లూరులో జన్మించారు. సుబ్బారావు ఎ జి కార్యాలయంలో సీనియర్ ఆడిట్ ఆఫీసర్ గా ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయ‌న‌కు భార్య, ముగ్గురు కుమారులు నాగరాజు, రాజగోపాల్, రవి, కుమార్తె జ్యోత్స్నాలత మనవలు మనవరాళ్లు ఉన్నారు.
వృత్తిరీత్యా ఆడిటింగ్ నిపుణుడైనా ప్రవృత్తిరీత్యా తెలుగుకవి, రచయిత. గణితశాస్త్రం ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడుయేషన్ డిగ్రీలు సాధించి మద్రాస్ యూనివర్సిటీ లో బంగారు పతకం గెలిచారు. తెలుగుభాషలో ఎం ఏ తో పని లేకుండానే అపూర్వమైన సీతామనోరామాయణమ్ అనే మహాకావ్యాన్ని సులభమైన తెలుగు భాషలో 16వేల 819 మధురమైన పద్యాలతో రచించిన తెలుగు భాషావేత్త. ‘‘ఈనాటి పద్యకావుల్లో సుబ్బారావు గారు మహాకవి పీఠాలంకృతుడు అన్న మాట నిష్కృష్టము. ఆయనకు నా హార్దిక అభినందనలు’’ అని సాక్షాత్తూ గుంటూరు శేషేంద్ర శర్మ ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ సాహితీ వేత్తలు ఉత్పల సత్యనారాయణాచార్యులు, దుగ్గిరాల రామారావు వీరి కావ్యాలను విశేషంగా ప్రస్తుతించారు.


సుబ్బారావు అంతకుముందు క్రాస్ రోడ్స్ శిల్పాశ్రువులు అనే వచన కవితా సంపుటాలను వెలువరించారు. తారారాఘవం నాటికను, వేదనా మధ్యాక్కఱలు, శ్రమణి అనే పద్యకావ్యం కూడా రచించారు. అమెరికన్ ఆంథాలజీ ఆఫ్ పోయెట్రీ అనే సంస్థ సుబ్బారావు రచించిన కొన్నివచన కవితలను ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించారు. తారారాఘవం, నీలవేణి, విమోచన అనే నాటికలు విజయవాడ హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాలనుంచి ప్రసారమైనాయి. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆయనను అమెరికా ఆంధ్రా అసోసియేషన్ వారు సత్కరించారు,
సీత చెప్పిన రాముని కథకు సుబ్బారావు సృష్టికర్త. రామాయణ కథానాయిక సీత స్వయంగా మనకు రామాయణ కథ వివరిస్తే ఏ విధంగా ఉంటుందో అనే అద్భుతమైన ఊహకు సీతామనోరామాయణం పద్యకావ్యస్వరూపం. వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో ఉన్న సీతాదేవి తన కథను పుత్రులైన కుశలవులకు, వారి గురువుగారయిన వాల్మీకికి కూడా వినిపించినట్టు ఈ కావ్యం సాగుతుంది. వాల్మీకి తన రామాయణాన్ని సీతాయాశ్చరితం అని పిలుచుకున్నాడు. కనుక సీతామనో రామాయణం అనే నామకరణం సహేతుమే అని ఉత్పల సత్యనారాయణాచార్య బాలకాండ పుస్తకానికి ముందుమాటలో పేర్కొన్నారు. శ్రమణి కావ్యాన్ని సుబ్బారావు శబరి కేంద్ర బిందువుగా నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఒకే విడతలో రూ. 2 లక్షల రుణ మాఫీ: రేవంత్

తుమ్మల, పొంగులేటి ఇచ్చేది మాత్రమేఅధికారిక సమాచారంకాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎంహైదరాబాద్, జూన్...

అమరావతి ఆంధ్రుల ఆశల ఆకృతి

(వాడవల్లి శ్రీధర్)అ) అమరావతి (ఆ) ఆంధ్రప్రదేశ్ రెండూ అక్షర క్రమంలో రాజధాని...

రెండు ఫైల్స్ పై పవన్ తొలి సంతకాలు

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణవిజయవాడ, జూన్ 19 : రాష్ట్ర ఉప...

Immediate challenges to BJP and Modi

(Dr Pentapati Pullarao) There is no challenge to the Narendra...