Wednesday, September 28, 2022
HomeArchieveఆచార్య విడుద‌ల ఎప్పుడంటే?

ఆచార్య విడుద‌ల ఎప్పుడంటే?

హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 16: ఆచార్య సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో చిరంజీవి ‘ఆచార్య’ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్నామ‌ని, కొత్త తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని ఆ సినిమా యూనిట్ తెలిపిన విష‌యం తెలిసిందే. ఆదివారం నాడు కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఈ సినిమాను ఉగాది పండుగ వేళ‌ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

ఏప్రిల్ 1 ఆచార్య సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని వివ‌రించింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న‌ కుమారుడు రామ్ చరణ్ న‌టిస్తున్నారు. చిరంజీవి స‌ర‌స‌న‌ కాజల్ అగర్వాల్, చరణ్ స‌ర‌స‌న‌ పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుద‌లైన ప‌లు పాట‌లకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది.ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుద‌ల చేయాల‌ని ముందుగా నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ దేశంలో కరోనా విజృంభ‌ణ కార‌ణంగా ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు.

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి ప‌లు పెద్ద సినిమాల విడుద‌ల వాయిదా ప‌డింది. సంక్రాంతి ముందు ఆ సినిమాల‌ను విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో క‌రోనా విజృంభిస్తుండ‌డం, ప‌లు రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌లో ఆంక్ష‌లు పెట్ట‌డంతో ఆయా సినిమాల విడుద‌లను వాయిదా వేశారు. మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ త‌గ్గాక ఈ సినిమాల‌ను విడుద‌ల చేసే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ