త‌మిళ సినీ తెర‌పై దాదా ఈ సూప‌ర్ స్టార్‌

Date:

వెండితెరపై విరిసిన రజనీకాంతులు
(శ్రీధర్ వాడవల్లి, 9989855445)
టికెట్ల చిల్లర లెక్కేసుకునే చిన్న బస్సు కండెక్టర్.. కోట్ల రూపాయల వినోదాల టిక్కెట్లను హాట్ కేకుల్లా ప్రజలు ఎగరేసుకుపోయేలా చేయగల స్దాయికి ఎదిగిన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ పయనం. తనదైన శైలి నటనతో ప్రేక్షకులకు గమత్తును పంచిన ముత్తు. ప్రేక్షకజనరంజక కాంతులే తన సొత్తు అని భావించే వినమ్రశీలి. ఆతని దారి విజయాల రహదారి. బేషజాలు లేని బాష. అంకితభావంతో పనిచేసే రోబో. “ అతిగా ఆశపడే మగవాడు…అతిగా ఆవేశపడి ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు…’’– నరసింహ” “ దేవుడు శాసించాడు…అరుణాచలం పాటిస్తాడు’’ – అరుణాచలం అభిమానులు ఎంతోమంది పదేపదే చెప్పుకునే నానుడిలా మారిపోయాయి రజనీమార్క్ డైలాగులు. రజనీకాంత్ ఆరడుగుల ఆజానుబాహువు కానేకాడు. సన్నగా చిన్ని కళ్ళతో కనిపించే ఆయన సినిమా హీరోగా మనగలుగుతాడా అని సందేహం వ్యక్తపరచిన వ్యక్తులను తన నటనా కౌశలంతో విన్మయపరచి సంచలనాలు సృష్టించి వారిని స్దబ్దుగా వుండేటట్లు చేయటానికి. అంతటి స్టార్ స్టేట‌స్‌ని సొంతం చేసుకున్నారంటే… నటనపట్ల ఆయనకున్న ఆస‌క్తి అకుంఠిత దీక్ష, నిరంతర శ్రమ కారణం. విలక్షణ మైన నటన వినూత్న రీతిలో ప్రతిభా ప్రదర్శన రజనీ ప్రొఫైల్‌. ఆ ప్రొఫైల్ కోసమే ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడతారు. నిర్మాత దర్శకులు రజని ఇంటి ముందు క్యూ కడతారు. తమిళ నాట నటవేల్పుగా అభిమానం సంపాదించు కున్న తలైవా విదేశాలలో సైతం సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు.. రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. 1950 డిసెంబర్ 12న కర్ణాటక బెంగుళూరులో ఓ మరాఠీ కుటుంబంలో జన్మించారు. తల్లి గృహిణి. తండ్రి రామోజీ రావు గైక్వాడ్ పోలీసు కానిస్టేబుల్‌.
జీవితాన్ని మలుపు తిప్పిన నాటకం:
రజనీకి తొలి సినిమా అవకాశం రావడం గురించి “రజనీకాంత్ కండక్టర్ గా పనిచేసే రోజుల్లో నాటకాలు వేసేవాళ్ళు . రజనీ లీడ్ రోల్లో చాలా బాగా నటించేవాడు. అతడి ప్రతిభ చూసి, సినిమాల్లోకి వెళ్లమని చెప్పాడు అతని స్నేహితుడూ . అందులో ప్రయత్నిస్తే గొప్ప నటుడివి అవుతావని అన్నాడు. చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరమని సలహా ఇచ్చి ప్రోత్సహించి ఆసరాగా నిలిచాడు. దీంతో అక్కడ రెండేళ్లపాటు రజనీ శిక్షణ తీసుకున్నాడు. మొత్తం కోర్సు పూర్తయిన తర్వాత వాళ్లు ఓ నాటకం వేశారు. దానికి చూసేందుకు వచ్చిన ప్రముఖ దర్శకుడు బాలచందర్ రజనీ నటనకు ముగ్దుడయ్యారు. తమిళం నేర్చుకోమని సలహా ఇచ్చారు. రజనీ.. తమిళం పూర్తిగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత బాలచందర్ దగ్గరకు వెళ్లగా, తాను తీయబోయే ‘అపూర్వ రాగంగళ్’లో రజనీకి అవకాశమిస్తున్నట్లు ఆయన చెప్పారు.


బాలచందర్ బడిలో నటునిగా ఓనమాలు :
కె.బాలచందర్ దర్శకత్వంలో 1975లో తెరకెక్కిన ‘అపూర్వ రాగంగళ్ సినిమాతో శ్రీకారం చుట్టి నటజీవితాన్ని ప్రారంభించారు రజనీకాంత్‌ ఈ చిత్రంలో రజనీ కాంత్ పాత్ర చిన్నది తక్కువ నిడివి కల పాత్ర. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకొని మూడు జాతీయ సినిమా పురస్కారాలను అందుకొంది. ఆ పురస్కారాలతో 1976 నాటి 23వ జాతీయ చలన చిత్ర పురస్కారాల వేడుకలో ఉత్తమ తమిళ చిత్ర పురస్కారం కూడా ఉంది. కొత్తగా వచ్చిన రజనీకాంత్ గౌరవప్రదంగా, ఆకట్టుకునేటట్టుగా ఉన్నార’ని ఓ రివ్యూ ఇచ్చింది. ఆ తరువాత విడుదలైన మరొక సినిమా ‘కథ సంగమ’. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ విలన్ పాత్రలో నటించారు. తెలుగు రీమేక్ అయిన ‘అంతు లేని కథ’ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో రజినీకాంత్ నటించారు. ఈ తెలుగు సినిమాకు బాలచందరే దర్శకుడు. తెలుగు సినిమా ‘చిలకమ్మ చెప్పింది’ అనే సినిమాతో మొదటిసారి ప్రధాన పాత్రలో నటించారు. తమిళ దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్ ‘బువ్నా ఒరు కెళ్వీ కురి’ అనే సినిమాలో పాజిటివ్ రోల్ ఇచ్చి ఓ ప్రయోగం చేశారు. 1977లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత విజయవంతమైందంటే 1990 వరకు ఎస్.పి.ముత్తురామన్, రజనీకాంత్ కలిపి మరో 24 సినిమాలకు పనిచేసే అంత. 1977 సంవత్సరంలో రజనీకాంత్ నటించిన 15 సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో ఎక్కువగా సహాయక, ప్రతినాయకుడి పాత్రల్లో రజనీకాంత్ కనిపించడం గమనించదగ్గ విషయం.


ఎంట్రీ సాంగ్ సెంటిమెంట్ :
అప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ భాషలలో ప్రధాన పాత్రలలో కనిపించిన రజనీకాంత్ మొదటగా హీరోగా నటించిన సినిమా పేరు ‘భైరవి’. ఎం.భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీకాంత్ సోలో హీరోగా నటించారు. ఈ సినిమాకే రజనీకాంత్‌ ‘సూపర్ స్టార్’ అనే బిరుదు వచ్చింది. ‘వనక్కతు కురియ కాదలియే’ అనే సినిమాలో రజనీకాంత్‌కు ఓ ఎంట్రీ సాంగ్ ఉంది. ఆ తరువాత రజనీకాంత్‌కు ఎంట్రీ సాంగ్ ఇవ్వడం అనేది ఓ ఆనవాయితీగా మారింది. 1979లో నందమూరి తారక రామారావు హీరోగా తెరకెక్కిన ‘టైగర్’ సినిమాలో నటించారు రజినీకాంత్. ఈ సినిమాతో ఇండస్ట్రీకొచ్చిన నాలుగేళ్లలో 50 సినిమాలను పూర్తి చేశారు రజనీకాంత్.అమితాబ్ బచ్చన్ నుంచి స్ఫూర్తి: బిగ్ బి రీమేక్లతో సూపర్ ఫాం బిగ్ బి రీమేక్లతో సూపర్ ఫాం బిగ్ బీ’ సినిమాలు తమిళ రీమేక్లలో ఆయన పాత్రలలో నటించారు. 1978లో వచ్చిన ‘శంకర్ సలీం సైమన్’ సినిమాతో మొదలుకొని అమితాబ్ బచ్చన్ పదకొండు తమిళ రీమేక్లలో రజనీకాంత్ నటించారు. ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ సినిమా రీమేకే. ఇందులో రజనీకాంత్ ‘రామ్’ పాత్రలో నటించారు. అమితాబచ్చన్ అంటే రజనీకాంత్ కు అమితాబచ్చన్ అంటే రజనీకాంత్ కు ఎంతో గౌరవం. రజనీ హవా 1983 నాటికి దక్షిణ భారత సినిమా పరిశ్రమలో ఓ ప్రసిద్ధ‌ నటుడుగా పేరు గాంచారు. ఆ తరువాత బాలీవుడ్ సినిమాలతో పాటు తమిళ సినిమాతో బిజీగా ఉన్నారు రజనీకాంత్. ఆ సమయంలోనే ‘అమెరికన్ చిత్రంలో ఇంగ్లీష్ మాట్లాడే ఓ భారతీయ టాక్సీ డ్రైవర్‌గా నటించారు.
కమర్షియల్ హీరోగా 1990ల నాటికి రజనీకాంత్ తనను తాను ఓ కమర్షియల్ ఎంటర్టైనర్గా నిరూపించుకోవడంలో విజయవంతమయ్యారు. 1990లలో విడుదలయిన రజినీకాంత్ సినిమాలన్నీ కూడా బాక్సాఫీసు వద్ద బ్రహ్మాండమైన విజయాల్ని చూశాయి. మణిరత్నం దర్శకత్వంలో ‘తలపతి’ (తెలుగులో ‘దళపతి’) సినిమాలో నటించారు రజని. ఇందులో మమ్ముట్టితో కలిసి నటించారు ఆ తరువాత సురేష్ కృష్ణ, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్లో ‘బాషా’ సినిమా తెరకెక్కింది. రికార్డులను కొల్లగొట్టి మరీ విజయమందుకొంది ఈ చిత్రం. అభిమానులే కాదు విమర్శకులు కూడా ఈ సినిమాతో రజినీకాంత్ ఫ్యాన్స్ అయిపోయారనే చెప్పాలి. మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ‘పెద్దరాయుడు’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు రజని. బాలచందర్ నిర్మాతగా, కె.ఎస్.రవికుమార్ దర్శకుడిగా రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘ముత్తు’ సినిమా మరొక కమర్షియల్ విజయాన్ని అందించింది రజనీకాంత్కి. జపనీస్ భాషలో డబ్ అయిన మొదటి తమిళ సినిమాగా గుర్తింపు పొందింది ఈ సినిమా. జపాన్లో కూడా ఈ చిత్రం విజయవంతమై అక్కడ కూడా రజనీకాంత్‌కు ఫ్యాన్స్ ఏర్పడడానికి కారణమయింది . 1997లో వచ్చిన ‘అరుణా చలం’ సినిమా కూడా మరొక కమర్షియల్ విజయవంత‌మయ్యి రజనీకి మరొక సక్సెస్ని తెచ్చిపెట్టింది. 1999లో వచ్చిన రజనీకాంత్ సినిమా ‘పడయప్పా’ (తెలుగులో ‘నరసింహ’) కూడా బ్లాక్బాస్టర్ విజయాన్ని చవి చూసింది. ‘బాబా’ ‘చంద్రముఖి’, ‘రోబో వంటి సినిమాల ద్వార బాక్సాఫీస్ ను శాసించే స్దాయికి ఎదిగాడు.’,
పురస్కారాలు: తమిళ నాడు రాష్ట్ర ఫిల్మ్ పురస్కారాలను ఆరుసార్లు అందుకొన్నారు రజనీకాంత్. వాటిలో నాలుగు సార్లు ఉత్తమ నటుడిగా పురస్కారాలు, ఉత్తమ నటుడిగానే రెండు ప్రత్యేక పురస్కారాలను అందుకొన్నారు. ఫిలింఫేర్ ఉత్తమ తమిళ నటుడి పురస్కారం కూడా రజనీకి లభించింది. 2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో రజినీని గౌరవించింది. 2016లో పద్మ విభూషణ్ పురస్కారం కూడా వరించింది. 1984లో ‘కలైమామణి’ పురస్కారం కూడా దక్కింది. ఇంకా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.
ఇంతై ఇంతితై నటునిగా ఎదిగినా స్నేహితుడిని మరువని స్నేహశీలి. బెంగళూరులో కండక్టర్ గా ఉన్నప్పుడూ రాజ్ బహదూర్ డ్రైవర్. అప్పుడు మొదలైన‌ వీరి స్నేహం.. ఇప్పటికీ కొనసాగుతోంది. బెంగళూరు ఎప్పుడొచ్చినా, రజనీ.. రాజ్ బహదూర్ కచ్చితంగా కలుస్తారు. జయాలకు పొంగిపోక అపజయాలకు కుంగిపోక స్దితప్రజ్ఞతతో నిరాడంబరంగా ఉంటూ సహచర నటులతో స్నేహం పూర్వకంగా మెలుగుతారు. షూటింగ సమయంలో దర్శకుని దగ్గర నిత్య విద్యార్దిగా వుంటూ తన నటనకి తాను మెరుగులు దిద్దుకుంటారు. నిర్మాతలకు అపజయాలు వస్తే తన పారితోషికాన్ని వదులుకున్న సందర్బాలెన్నో. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడూ విరాళాలు ఇవ్వడం. సామాజిక కార్యక్రమాలలో పాల్గోవడం. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి విద్య, ఉపాధి కల్పించడం వంటివి చేస్తారు. ప్రచారం అర్బాటం కోసం పాకులాడరు. మానసిక విశ్రాంతికి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోటానికి హిమాలయాలకు వెళ్ళతారు .


దాదాసాహెబ్ ఫాల్కే:
సూపర్ స్టార్‌ రజనీకాంత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ లభించింది. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ పరిశ్రమకు చేస్తున్న విశేష సేవలకు గాను కేంద్రప్రభుత్వం ఆయన్ని ఈ పురస్కారంతో సత్కరించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.. వెండితెరపై జనరంజక రజనీకర కాంతులు శత వసంతాలు వెల్లివిరియాలి . సరేశ్వరుడు సదా అరోగ్య అనందాలు మీకు ప్రసాదించాలి. మా తలైవా రజనీకాంత్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ సినీ విమ‌ర్శ‌కులు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Modi’s Kurukshetra of 4 states

(Dr Pentapati Pullarao) The great Mahabharat war between Pandavs...

Kejriwal: Noble past and uncertain future

(Dr Pentapati Pullarao) Just today Kejriwal announced his future....

BJP ‘s mistakes messing up 2024 elections?

(Dr Pentapati Pullarao) There is hardly one month left for...

భలే పింగళి – పాతాళభైరవి

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ) పాతాళభైరవి… ఈ పేరే...