Thursday, October 6, 2022
HomeArchieve26న సంపూ క్యాలీఫ్ల‌వ‌ర్‌

26న సంపూ క్యాలీఫ్ల‌వ‌ర్‌

పోస్ట‌ర్ విడుద‌ల చేసిన నిర్మాత‌లు
హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 14:
బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు హీరోగా న‌టిస్తున్న క్యాలీఫ్ల‌వ‌ర్ చిత్రం ఈ నెల‌ 26న థియేటర్స్‌లో గ్రాండ్ గా విడుదలవబోతోంది. ఆర్కే మలినేని దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ‘హృదయ కాలేయం’ సినిమాతో సంపూర్ణేష్ బాబు హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది క్యాలీఫ్ల‌వ‌ర్ చిత్రానికి ఉపశీర్షిక. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని నవంబరు 26న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్ర‌క‌టించారు. చిత్ర పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.

గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబు సరసన వాసంతి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ముజీర్‌ మాలిక్‌ ఛాయగ్రాహకుడు. ఎడిటింగ్‌ బాధ్యతలను బాబు నిర్వ హిస్తున్నారు. నటీనటులు: సంపూర్ణేష్‌బాబు, వాసంతి, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, నాగ మహేశ్, గెటప్‌ శీను, రోహిని, కాదంబరి కిరణ్, కల్లు కృష్ణారావు, విజయ్, కల్యాణీ, సుమన్‌ మనవ్వాద్, ముస్కాన్, బేబీ సహృద, రమణ్‌దీప్‌.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ