సోనూ సూద్‌ ఆదాయంపై ఇన్‌కం టాక్స్ క‌న్ను

0

ముంబైలోని ఆరు ప్రాంతాల్లో సాగుతున్న సోదాలు
న్యూఢిల్లీ, సెప్టెంబ‌ర్ 15:
త‌న దాన‌శీల‌త‌తో యావ‌ద్దేశాన్ని ఆక‌ట్టుకుంటున్న సోనూ సూద్‌కు సంబంధించిన ప్రాంతాల‌లో ఆదాయ‌ప‌న్ను శాఖ ప‌రిశీల‌న‌లు జ‌రుగుతున్నాయి. ఆదాయ ప‌న్ను శాఖ వ‌ర్గాలు ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు. ముంబైలోని ఆరు ప్రాంతాల‌లో ఈ సోదాలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. క‌రోనా స‌మ‌యంలో వెత‌ల పాల‌యిన వ‌ల‌స కార్మికుల‌ను గ‌మ్యాల‌కు చేర్చ‌డానికి తొలుత చొర‌వ చూపిన సోనూ సూద్‌, క్ర‌మేపీ త‌న ఉదార‌త‌ను పెంచుకున్నారు. విద్యార్థులు, ఆరోగ్య స‌మ‌స్య‌లు… ఇలా ఒక‌టేమిటి ఏ ఇబ్బంది ఉంద‌ని చెప్పినా తానున్నానంటూ ప‌లుకుతున్నారు. అలాంటి వ్య‌క్తిపై ఇన్‌కంటాక్స్ విభాగం చేస్తున్న సోదాలు ఆస‌క్తిని రేపుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here