FIR లాంటి చిత్రం నాకు కూడా చేయాలని ఉంది – మాస్ మహారాజా రవితేజ

Date:

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ  చిత్రానికి  మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌గ‌ర్వ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్దు జొన్నలగడ్డ, సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో….

వీడియో సందేశం ద్వారా రవితేజ మాట్లాడుతూ.. ‘ఆరు నెలల క్రితం ఈ సినిమాను చూశాను. నాకు చాలా నచ్చింది. డిఫరెంట్ కంటెంట్ సినిమా. ఇలాంటి చిత్రం నాకు కూడా చేయాలని ఉంది. విష్ణు విశాల్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ‘త్వరలోనే తెలుగు నేర్చుకుంటాను. డైరెక్ట్ తెలుగు సినిమాను కూడా త్వరలోనే చేస్తాను. రవితేజ గారు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. రవితేజ వద్ద పని చేసే శ్వేతను పరిచయం చేసి ఇదంతా జరిగేందుకు కారణమైన జ్వాలకు థ్యాంక్స్. అభిషేక్ పిక్చర్స్ వారు ఈ సినిమాను చూశారు. థియేటర్లోనే ఈ సినిమాను విడుదల చేయాలని ముందే ఫిక్స్ అయ్యాం. ఓటీటీ అనే ఆలోచన ఎప్పుడూ పెట్టుకోలేదు. ఇప్పుడు కేవలం తమిళంలోనే కాదు తెలుగులోనూ సినిమాను విడుదల చేస్తున్నాం. మను అద్భుతమైన డైలాగ్స్ రాశారు. మంజిమా, మోనిక అద్భుతంగా నటించారు. గౌతమ్ సర్ సూపర్‌గా ఉంటారు. నీలో ఉన్న హీరోను ప్రేక్షకులు చూడాలి. దాన్ని నువ్ ఇంకా బయటకు తీసుకురావడం లేదు అని గౌతమ్ మీనన్ సర్ అన్నారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయకపోతే నేను నీతో మాట్లాడను అని గుత్తా జ్వాలా అన్నారు. నాకు సపోర్ట్‌గా నిలిచినందుక థ్యాంక్స్. సందీప్ కిషన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఫిబ్రవరి 11న రావాలని సడెన్‌గా నిర్ణయించుకున్నాం. చివరి క్షణాల్లోనే అంతా ఫిక్స్ అయ్యాం. చెప్పిన వెంటనే సందీప్ కిషన్ వచ్చారు. ఆయనకు థ్యాంక్స్. సిద్దు తన సినిమా రిలీజ్ ఉన్నా కూడా వచ్చి సపోర్ట్ చేశారు. రవితేజ గారు మా సినిమా చూసి మెచ్చుకున్నారు. ప్రెజెంట్ చేసేందుకు రెడీ అన్నారు. ఆయన నాకు బ్రదర్‌లా అనిపించారు. ఖిలాడీ సినిమాతో హీరోగా, ఈ సినిమాతో ప్రజెంటర్‌గా వస్తున్నాను అయితే ఏంటి? అని కూల్‌గా రిప్లై ఇచ్చారు. ఆయనకు థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులకు కంటెంట్ అంటే చాలా ఇష్టం. ఫిబ్రవరి 11న థియేటర్లోకి రాబోతోన్నాం. అందరూ చూడండి’ అని అన్నారు.

డైరెక్టర్ మను ఆనంద్ మాట్లాడుతూ.. ‘నాకు తెలుగు భాష అంటే ఇష్టం. అందుకే తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించను. మాస్ మహారాజా రవితేజ, ఆయన టీంకు థ్యాంక్స్. అభిషేక్ పిక్చర్స్‌కు థ్యాంక్స్. వారి వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నాం. నా హీరో, నిర్మాత విష్ణు విశాల్‌కు థ్యాంక్స్. నిర్మాతగా కాకుండా హీరోగానే ఈ కథను ఆయనకు చెప్పాను. 20 నిమిషాల కథ విని వెంటనే ఓకే చెప్పారు. ఆయనకు నా మీదున్న నమ్మకానికి థ్యాంక్స్. ఆ తరువాత కొన్ని పరిస్థితుల వల్ల ఈ సినిమాను ఆయనే నిర్మించాల్సి వచ్చింది. సినిమా తీయాలనే కమిట్మెంట్‌తో నిర్మించారు. ఈ రోజు సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం నిర్మాత విష్ణు. చిన్న ప్రాజెక్ట్‌గా మొదలైంది. కానీ ఇప్పుడు పెద్ద సినిమాగా మారింది. మంజిమా అద్భుతమైన నటి. రెబా మోనిక జాన్, రైజా విల్సన్ ఈ రోజు ఇక్కడకు రాలేకపోయారు. నా గురువు గౌతమ్ మీనన్ వల్లే నేను సినిమాలను తెరకెక్కించగలిగాను. ఆయన స్థాయిని తగ్గించకుండా ఉండేలా సినిమాను తెరకెక్కించాను. సినిమాకు ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. దివ్యాంక, రాకెందు మౌళిలు సినిమా రైటింగ్‌లో సాయం చేశారు. ఫిబ్రవరి 11న ఈ సినిమాను థియేటర్లో అందరూ చూడండి’ అని అన్నారు.

గుత్తా జ్వాలా మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు విష్ణు, టీం అంతా కూడా చాలా కష్టపడ్డారు. చాలా మంచి సినిమా. అందరూ థియేటర్లో చూడండి. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని నేను అన్నాను. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను కచ్చితంగా చూడాలి అని అన్నాను. రవితేజ మమ్మల్ని సపోర్ట్ చేశారు. ఆయనకు థ్యాంక్స్’ అని అన్నారు.

వాసు మాట్లాడుతూ.. ‘విష్ణు విశాల్ మంచి కంటెంట్‌ను ఎంచుకుంటారు. రాక్షసన్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. మళ్లీ ఇప్పుడు FIR అనే మూవీతో రాబోతోన్నారు. సినిమాలో చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది కాబట్టి. రవితేజ గారు కూడా సపోర్ట్ చేశారు. అందుకే మా అభిషేక్ పిక్చర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. థర్డ్ వేవ్ ముగుస్తున్న సమయంలో మంచి సినిమాలు ముందుకు వస్తున్నాయి. ఈ వారం అన్నీ మంచి సినిమాలు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులను అలరించబోతోన్నాయి. నటీనటులందరూ మంచిగా నటించారు. గౌతమ్ సర్ స్కూల్ నుంచి దర్శకుడు వస్తున్నాడంటే స్క్రిప్ట్ పరంగా, టెక్నికల్‌గా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ట్రైలర్ చూస్తుంటేనే అది అర్థమవుతోంది. ఇది ఇంటెన్స్ థ్రిల్లర్. విష్ణు గారికి ఇది తెలుగులో మంచి ఆరంభం అవుతుంది’ అని అన్నారు.

సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘నాకు యాక్షన్, థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టం. ఇలాంటి జానర్‌తో విష్ణు విశాల్ టాలీవుడ్‌కు పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. ట్రైలర్ చూశాను. అద్బుతంగా ఉంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

రాకేందు మౌళి మాట్లాడుతూ.. ‘సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నన్ను నటింపజేసినందుకు గౌతమ్ మీనన్ గారికి థ్యాంక్స్. ఆ సినిమాకు మను అసిస్టెంట్‌గా పని చేశారు. అందులో ఓ ర్యాప్ పాటను మను నాతో రాయించారు. మను ఏ స్క్రిప్ట్ రాసినా నాతో షేర్ చేసుకుంటారు. ఆయన వ్యక్తిగతంగా ఎంతో మంచి మనిషి. ఆయన తీసిన ఓ వెబ్ సిరీస్‌లో నటించాను. మాటలు రాశాను. ఇప్పుడు ఆయన సినిమాలో నటించలేదు. కానీ తెలుగు వర్షన్‌కు మాటలు రాయాలని అన్నారు. విష్ణు విశాల్ ప్రొడక్షన్‌లో ఏ ఇబ్బంది లేకుండా పూర్తి చేశాను. ఇందులో ఆయన వాయిస్‌కు హేమచంద్ర డబ్బింగ్ చెప్పారు. నెక్ట్స్ ఆయనే డబ్బింగ్ చెప్పాలి. చాలా రోజుల తరువాత మంచి పాటలు రాశాను అనిపిస్తుంది. ఫిబ్రవరి 11న థియేటర్లో సినిమాను చూడండి’ అని అన్నారు.

మంజిమా మోహన్ మాట్లాడుతూ.. ‘రవితేజ గారు, అభిషేక్ పిక్చర్స్ లేకుంటే ఈ రోజు మేం ఇక్కడకు వచ్చే వాళ్లం కాదు. మీరు ఇచ్చిన సపోర్ట్‌కు థ్యాంక్స్. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. సాహసం శ్వాసగా సాగిపో తరువాత చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాతో రాబోతోన్నాను. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అందరూ సినిమాను థియేటర్లో చూడండి’ అని అన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘విష్ణు విశాల్ సినిమాలను తెలుగు వాళ్లు సబ్ టైటిల్స్ చూసేస్తారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేదు. రాక్షసన్ సినిమాకు నేను డబ్బింగ్ చెబుతాను అని కూడా అన్నాను. ఆ చర్చలు మా మధ్య జరిగాయి. ఈ వారం మంచి సినిమాలు రాబోతోన్నాయి. విష్ణు విశాల్ ఇలాంటి కంటెంట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు అనే ఆలోచన నాకు వస్తుంటుంది. నువ్ నీ సినిమాను ఇక్కడ ప్రమోట్ చేసుకోవడం ఆనందంగా ఉంది. గౌతమ్ సర్ అద్భుతమైన నటుడు. మైఖేల్ సినిమాలో కూడా మంచి పాత్రను పోషించారు. మంజిమాకు ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రవితేజ గారిని ఒప్పించడం మామూలు విషయం కాదు. ఈ వారం రాబోతోన్న సినిమాలకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

వీడియో సందేశం ద్వారా గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. మను ఆనంద్ నాకు పదేళ్లుగా తెలుసు. విష్ణు విశాల్ ఈ సినిమాలో నటించడమే కాదు నిర్మించారు. రవితేజ గారు తెలుగులో ప్రజెంట్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది. విష్ణు విశాల్ మొదటి నుంచి డిఫరెంట్ సినిమాలను చేస్తూనే వచ్చారు. చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లోకి రాబోతోంది’ అని అన్నారు.

వీడియో సందేశం ద్వారా రామ్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూశాను. అద్బుతంగా ఉంది. విష్ణు విశాల్, జ్వాలా గుత్తాకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది. టాలీవుడ్‌లోకి విష్ణు విశాల్‌కి స్వాగతం’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...