Thursday, March 23, 2023
HomeArchieveశిష్యునికి వివి వినాయ‌క్ శుభాకాంక్ష‌లు

శిష్యునికి వివి వినాయ‌క్ శుభాకాంక్ష‌లు

“గీత” ఘన విజయం సాధించాలి!
నా శిష్యుడు ‘విశ్వ’ విజేత కావాలి!!
టైటిల్ రోల్‌లో హెబ్బా పటేల్
ముఖ్యపాత్రలో సునీల్!!
ప్రతినాయకుడిగా సాయికిరణ్!!
హైద‌రాబాద్‌, డిసెంబ‌ర్ 16(Hebba Patel and Sunil geetha movie): సంచలన దర్శకులు వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు “విశ్వ”ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… వి.వి.వినాయక్ ఆశీస్సులతో “గ్రాండ్ మూవీస్” పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం “గీత”. “మ్యూట్ విట్నెస్” అన్నది ఉప శీర్షిక!!
క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తుండగా… “నువ్వే కావాలి, ప్రేమించు” వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంచలన దర్శకులు వి.వి.వినాయక్ విడుదల చేశారు!!
తన శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతున్న “గీత’ ఘన విజయం సాధించాలని, తన మిత్రుడు రాచయ్య నిర్మాతగా రాణించాలని వి.వి.వినాయక్(VV. Vinayak) అభిలషించారు. ఈ చిత్రంలో పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు!!


ఈ సినిమా అవకాశం తన గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారని, నిర్మాత రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చిత్ర దర్శకుడు విశ్వ పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న హిందీ “ఛత్రపతి” పనులతో తలమునకలుగా ఉన్నప్పటికీ… తమ మీద ప్రత్యేకమైన అభిమానంతో “గీత” చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి నిర్మాత ఆర్.రాచయ్య కృతజ్ఞతలు తెలిపారు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా డైరెక్టర్ విశ్వ… “గీత”(Hebba Patel and Sunil geetha movie) చిత్రాన్ని అత్యద్భుత ప్రణాళికతో రూపొందించారని పేర్కొన్నారు!!
రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా… ఓ చాలెంజింగ్ రోల్ చేస్తుండడం విశేషం!!


సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు ప్లే చేస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, పాటలు: సాగర్, సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, పోరాటాలు: రామ్ కిషన్, కళ: జె.కె.మూర్తి, ఛాయాగ్రహణం: క్రాంతికుమార్.కె, కూర్పు: ఉపేంద్ర, కో-డైరెక్టర్: వి.వి.రమణ, నిర్మాత: ఆర్.రాచయ్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విశ్వ!!!

ALSO READ: పలుకే బంగారమాయెరా!… బాపూ…పలుకే…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ