క్రిష్ణయ్య ఆకలి తీర్చిన మునిపత్నులు

0

గోదా చెప్పిన గోవిందుని కథలు-4
(మాడ‌భూషి శ్రీ‌ధ‌ర్‌)

అంబరమే పాశురంలో మరో పదం శోరే అంటే అన్నం. ఆహారం. పరమాత్మకోసం మునులంతా యజ్ఞాలు చేస్తుంటారు. అక్కడే ఉన్న పరమాత్ముడు చిన్నారి శ్రీ కృష్ణుడిని వారు గుర్తించరు. అప్పుడు గోపబాలకులంతా కృష్ణయ్యా ఆకలి అని అడుగుతారు. క్రిష్ణయ్య నేరుగా మునిపత్నులదగ్గరికి వెళ్తాడు. తనకు తన మిత్రులకు అన్నం పెట్టమని అడుగుతాడు. యజ్ఞం ముగిసేదాకా ఆగాలని కోప్పడకుండా ఆ మునిపత్నులు, చిన్నారి క్రిష్ణయ్య చిన్నారిబొజ్జలో ఆకలి అంటూ ఉంటే మునుల నియమాలన్నీ పక్కన బెట్టి ఆయనకు పిల్లలకు అందరికీ భోజనాలు వడ్డిస్తారట. యా ప్రీతిర్మునిపత్ని భక్తిరచితే… నారాయణుడికి రోజూ వైష్ణవులు చేసే తిరువారాధన ఆరగింపులో చదివే శ్లోకంలో ఈ పదం తప్పనిసరిగా వస్తుంది. ప్రీతితో భక్తితో మునిపత్నులు కృష్ణునికి ఆయన బాలమిత్రులకు ఆకలి తీర్చి మహాపుణ్యం కట్టుకున్నారు. వారి భర్తలకు దక్కే యజ్ఞఫలం కన్న ముని పత్నులకు ఎంతో ఎక్కువ ఫలం దక్కించి, క్రిష్ణయ్య యజ్ఞం చేస్తున్న మునులను చూసి నవ్వుకుంటూ వెళ్లిపోతాడట. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ న్యాయ కోవిదుడు, సెంట్ర‌ల్ ఆర్టీఐ మాజీ క‌మిష‌న‌ర్‌)

Prof. Madabhushi Sridhar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here