Saturday, March 25, 2023
HomeArchieveపంట‌కు ప‌దివేల రూపాయ‌లు

పంట‌కు ప‌దివేల రూపాయ‌లు

కాళేశ్వ‌రం రుణం తీరుస్తున్న రైతు
సిఎంఆర్ఎఫ్‌కు జ‌మ‌చేసిన ప‌న్నాల‌
అభినందించిన సీఎం కేసీఆర్‌
హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 29:
కాళేశ్వరం జలాలతో ఎండిన బీళ్ళ‌ను సస్యశ్యామలం చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ రుణం తీర్చుకోవాలని సంకల్పించిండు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెల్లపల్లి మండలం, బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్ రెడ్డి అనే యువ రైతు. ఇన్నాళ్ళు బీళ్ళుగా మారిన తన వ్యవసాయ భూమినుంచి కాళేశ్వర జలాల సాయంతో పంటలు పండిస్తూ ఆదాయాన్ని పొందుతున్నాడు. తాను పండించిన పంటలో కొంత భాగాన్ని పేదలకోసం ఖర్చు చేయాలని, అందులో భాగంగా కొంత మొత్తాన్ని ‘‘ముఖ్యమంత్రి సహాయ నిధి’’ కి అందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం…ఏడాదిలో తాను పండించే రెండు పంటలనుంచి వచ్చిన ఆదాయాన్ని ‘‘పంటకు పదివేల రూపాయల’’ చొప్పున ఆరునెల్లకోసారి సిఎంఆర్ఎఫ్‌కు జమ చేయాలనే తలచాడు. తలచిందే తడవుగా.. శుక్రవారం ప్రగతి భవన్‌కు వచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తాను తెచ్చిన 10 వేల రూపాయలను అందించాడు.


ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి రంగం అభివృద్దితో పాటు విద్యుత్ తదితర అనుబంధ రంగాల అభివృద్ధితో.. తెలంగాణ యువత వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవడం సంతోషకరం. వాణిజ్య పంటలను వినూత్నరీతిలో పండిస్తూ నికరాదాయన్ని గడిస్తున్నారు. ఏదో సంస్థలో అర కొర జీతానికి పనిచేయడమే ఉద్యోగం అనే మానసిక స్థితినుంచి వారు బయటపడుతుడడం ఆహ్వానించదగ్గ పరిణామం. తమ తమ స్వంత గ్రామాల్లోనే పచ్చని పంటపొలాల నడుమ ప్రకృతితో భాగమై ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుని తమ సొంత కాల్లమీద నిలబడడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో..శ్రీనివాస్ రెడ్డి తన సంపాదనలోంచి సామాజిక బాధ్యతగా కొంత మొత్తాన్ని కేటాయించాలనుకోవడం గొప్ప విషయం. సిఎం ఆర్ ఎఫ్ ద్వారా పేదలకు సాయం చేసేందుకు తన పంటలో కొంతభాగాన్ని కేటాయించేందుకు ముందుకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి స్పూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలి.అతనికి నా అభినందనలు..’’ అని సిఎం రైతు శ్రీనివాస్ రెడ్డి గొప్పతనాన్ని కొనియాడారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ